ETV Bharat / science-and-technology

ఫేస్​బుక్ డేటా లీకైందా? సులభంగా తెలుసుకోండిలా! - సైబర్ సెక్యూరిటీ

సైబర్​ నేరాలు, డేటా లీకుల గురించి నిత్యం వింటుంటాం. మన డేటాపై ఆందోళన చెందుతాం. డేటా లీక్​ అయిందా? లేదా? తెలుసుకోవడం ఎలా? అని ఆలోచిస్తాం. అలాంటివారు ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

Facebook data leak
సైబర్ సెక్యూరిటీ
author img

By

Published : Jul 28, 2021, 4:38 PM IST

డేటా లీకులు ఇటీవల నెటిజన్లను నిత్యం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మన డేటా అసలు లీకైందా లేదా తెలుసుకోవాలని అప్పుడప్పుడు అనుకుంటాం. అది తెలుసుకోవడానికి సులభమైన పద్దతులు అందుబాటులో ఉన్నాయి. .

ఈ వెబ్​సైట్​తో..

'Have I been PWNED' అనే వెబ్​సైట్​ ఉంది. ఈ సైట్​లో మీ ఈమెయిల్​ గానీ ఫోన్ నెంబర్​ను సర్చ్ చేస్తే.. డేటా లీకు గురించి తెలుసుకోవచ్చు. ఇంతకుముందు ఈ మెయిల్ అడ్రస్​తో మాత్రమే వివరాలు తెలుసుకునే వీలుండేది. ఇటీవల ఫోన్​ నెంబర్​ ద్వారా కూడా తెలుసుకునేలా వీలు కల్పించారు. ఈ ఫోన్ నెంబర్​ను ఈ వెబ్​సైట్​లో సర్చ్​ చేస్తే డేటా లీకైందా లేదా తెలుసుకోవచ్చు.

ఫేస్​బుక్​ డేటా లీక్​..

కొన్ని రోజుల క్రితం ఓ వార్త అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఫేస్​బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం ఆన్​లైన్​లో లీకైనట్లు నివేదికలు వచ్చాయి. అమెరికాలో 539 మిలియన్ల యూజర్లు, యూకేలో 11 మిలియన్లు, భారత్​లో 6 మిలియన్ల యూజర్లు ఇందులో ఉన్నారని వెల్లడించాయి.

9.9 కోట్ల భారత యూజర్ల డేటా లీక్​..

డేటా లీక్​ భారత్​ను కలవరపెట్టింది. మొబిక్విక్ యూజర్లలో 9.9 భారత యూజర్ల డేటా లీకైందని వార్తలు వెల్లడయ్యాయి. హ్యాకర్లు కూడా డేటా లీక్ చేసినట్లు ప్రకటించారు. ఫోన్​ నెంబర్లు, ఈ మెయిల్​లు, బ్యాంకు వివరాలు అందులో ఉన్నాయని సమాచారం.

డేటా రక్షణకు విధానాలు

  • కఠినమైన పాస్​వర్డ్​ను క్రియేట్ చేసుకోవాలి.
  • సెక్యురిటీలో రెండు సార్లు వెరిఫికేషన్ చేసుకునే పద్దతిని పాటించాలి.
  • బయోమెట్రిక్​ పాస్​వర్డ్​ తయారు చేసుకోవాలి.

ఇదీ చదవండి:CYBER ATTACK: బ్యాంక్​ సర్వర్​లోకి చొరబడి కోట్లు కొల్లగొట్టింది ఎందరు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.