ETV Bharat / science-and-technology

ఎఫ్‌బీలో అకౌంట్‌ లేకుండానే కావాల్సింది చూడొచ్చు! - ఫేస్​బుక్​ సెర్చ్​

ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఫేస్​బుక్​ ఒకటి. బంధువు, మిత్రులు, తెలిసిన వారు, తెలియని వారు అంటూ చాలా మందే ఉంటారు. ఇతరుల గురించి తెలుసుకోవడానికి చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఇందుకు ఎఫ్​బీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖాతా లేని వారు కూడా అందులో ఉన్న వారి గురించి, కావాల్సిన సమాచారం కనుక్కోవచ్చని అంటున్నారు . ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

You can see what you need without an FB account!
ఎఫ్‌బీలో అకౌంట్‌ లేకుండానే కావాల్సింది చూడొచ్చు!
author img

By

Published : Apr 3, 2021, 10:05 AM IST

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్‌ నెట్‌వర్క్‌ ఏదంటే అది ఫేస్‌బుక్కేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, దాంట్లో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోనివారు.. ఉన్న అకౌంట్‌ని డిలీట్‌ చేసిన వారూ చాలా మందే ఉంటారు. అందుకు కారణాలు ఏవైనా.. ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ లేకుండానే దాంట్లో వెతుకులాట సాగించాలంటే? అది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమే.. అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే.. ఎఫ్‌బీలో ఉన్న వ్యక్తుల్ని, ఇతర సమాచారాన్ని అకౌంట్‌ లేకుండానే వెతకొచ్చు. అదెలాగో చూద్దాం..

ఓ 'డిక్షనరీ' ఉంది తెలుసా?

ఫేస్‌బుక్‌ స్టార్ట్‌ చేసిన కొత్తలో పలు రకాలుగా కావాల్సిన వివరాల్ని వెతికి చూసేందుకు వీలుండేది. కానీ, యూజర్ల ప్రైవసీ కాపాడే ప్రయత్నంలో ఫేస్‌బుక్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీంతో అకౌంట్‌లోకి లాగిన్‌ అయితే తప్ప.. ప్రొఫైల్స్‌, ఇతర వివరాల్ని వెతికే వీలు లేకుండా చేసింది. అయితే, అకౌంట్‌ లేని వారు ఇతర మార్గాల్ని ప్రయత్నించొచ్చు. వాటిల్లో 'ఫేస్‌బుక్‌ డిక్షనరీ' ఒకటి. దాంట్లోకి వెళ్లి ప్రొఫైల్స్‌ని చూడొచ్చు. అందుకు ఫేస్‌బుక్‌ సైట్‌ హోమ్‌ పేజీలోని 'పీపుల్‌' మెనూలోకి వెళ్లండి. పేజీకి కింది భాగంలో ఉన్న ఆప్షన్స్‌లో కనిపిస్తుంది. క్లిక్‌ చేస్తే.. ఏ టూ జెడ్‌ వరకూ ప్రొఫైళ్ల జాబితా వస్తుంది. గ్రూపులు, పేజెస్‌నీ చూడొచ్చు. సెర్చ్‌ ద్వారా కావాల్సిన వారి ప్రొఫైల్‌ని వెతకొచ్చు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రైవసీ కంట్రోల్స్‌ ఆధారంగా జాబితా కనిపిస్తుంది. అంటే.. పబ్లిక్‌గా ప్రొఫైల్‌ని కనిపించేలా పెట్టుకున్నవారివి మాత్రమే డిక్షనరీలో చూడొచ్చు. ప్రైవసీ కంట్రోల్స్‌లో యూజర్లు పలు రకాల సెట్టింగ్స్‌ని అకౌంట్‌కి అప్లై చేస్తున్నారు. ఎవరెవరికి కనిపించాలో ముందే నిర్దేశిస్తున్నారు.

You can see what you need without an FB account!
ఎఫ్‌బీలో అకౌంట్‌ లేకుండానే కావాల్సింది చూడొచ్చు!

సెర్చింజన్ల ఆధారంగా..

ఒకవేళ డిక్షనరీలో మీకు కావాల్సిన ప్రోఫైల్‌ కనిపించకపోతే.. సెర్చింజన్ల ఆధారంగా వెతకొచ్చు. అందుకు కొన్ని కీవర్డ్‌లను వాడొచ్చు. అదెలాగంటే.. వెతకాలనుకునేవారి పేరుకి 'ఫేస్‌బుక్‌.కామ్‌'ని ProfileName Site:facebook.com జత చేయండి. దీంతో మీరు వెతకాలనుకునేవారి ప్రొఫైల్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌లో కనిపిస్తుంది. అంటే.. పబ్లిక్‌గా కనిపించేలా పెట్టుకున్న వారి అకౌంట్‌లు మాత్రమే సెర్చ్‌ ఫలితాల్లో వస్తాయి. మరో అడుగు ముందుకేసి 'సోషల్‌ సెర్చింజన్‌'ల సాయం తీసుకోవచ్చు.

  • www.social-searcher.com
  • http://snitch.name/

ఇవి సోషల్‌ మీడియా సెర్చింజన్‌. దీంట్లో ప్రొఫైల్స్‌ని వెతకడంతో పాటు ప్రస్తుత ట్రెండ్స్‌ని కూడా చూడొచ్చు. ప్రొఫైల్స్‌ని వెతికేందుకు 'యూజర్స్‌' ట్యాబ్‌లోకి వెళ్లండి.

  • www.mentionlytics.com
  • https://brandmentions.com/socialmention/

ఒకవేళ మీరేదైనా ఉద్యోగం లేదా వ్యాపారం నిమిత్తం వ్యక్తుల సోషల్‌ మీడియా కంటెంట్‌ని రివ్యూ చేద్దాం అనుకుంటే వీటిని ప్రయత్నించొచ్చు.

  • www.peoplefinder.com

పీపుల్‌ సెర్చింజన్‌ అనొచ్చు దీన్ని. మీరు వెతకాలనుకునే పేరుని దీంట్లో ఎంటర్‌ చేస్తే చాలు. చాలా వరకూ వివరాల్ని వెతికి చూపిస్తుంది. వాటిల్లో ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ కూడా ఉండొచ్చు.

ఇదీ చూడండి: ఇన్​స్టాలో కొత్త ఫీచర్లు- టీవీల్లో జియో బ్రౌజర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.