ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో వాయిస్ స్టేటస్.. ఎలా పోస్ట్ చేయాలో తెలుసా? - వాట్సాప్ లో మీ వాయిస్ స్టేటస్ షేర్

వాట్సాప్​లో వాయిస్ స్టేటస్​లు వచ్చేశాయి. ఈ కొత్త ఫీచర్​ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ వెల్లడించింది. మరి వాట్సాప్ వాయిస్ స్టేటస్ ఎలా పెట్టుకోవాలో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

WHATSAPP VOICE STATUS
WHATSAPP VOICE STATUS
author img

By

Published : Mar 21, 2023, 12:52 PM IST

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్న వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. సింపుల్​గా ఉంటూనే.. ఆకట్టుకునే ఫీచర్లన్నీ ఉండటం దీని ప్రత్యేకత. ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ ఉండటం దీనికి అదనపు బలం. అందుకే సందేశాలు పంపుకునేందుకు ఎక్కువ మంది వాట్సాప్​నే ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పటికే అనేక అప్డేట్లతో ముందుకొచ్చిన వాట్సాప్.. తాజాగా మరో కొత్త ఫీచర్​ను యూజర్లకు పరిచయం చేసింది. సొంతంగా రికార్డ్ చేసిన ఆడియో క్లిప్​లను స్టేటస్​లుగా పెట్టుకునే వీలు కల్పిస్తోంది. వాటిని వాట్సాప్ కాంటాక్టులతో షేర్ చేసుకునే అవకాశం ఇస్తోంది.

వాట్సాప్​లో ఇప్పటికే ఇమేజ్, వీడియో, టెక్ట్స్ స్టేటస్​లు పెట్టుకునే అవకాశం ఉంది. వీటికి అదనంగా వాయిస్ స్టేటస్ వచ్చినట్లైంది. వాయిస్ స్టేటస్ ద్వారా.. యూజర్ల మధ్య ఎంగేజ్​మెంట్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. వ్యక్తిగత ఆలోచనలు, భావాలను వ్యక్తం చేసేందుకు ఇది మంచి ఆప్షన్​ అవుతుంది. స్టేటస్​లకు యూజర్లు పర్సనల్ టచ్ ఇచ్చుకోవచ్చనే ఉద్దేశంతో ఈ అప్డేట్ తీసుకొచ్చినట్లు వాట్సాప్ చెబుతోంది. మరి.. ఆండ్రాయిడ్ ఫోన్​లో వాయిస్ స్టేటస్​ను ఎలా షేర్ చేసేందుకు ఈ కింది స్టెప్స్​ను ఫాలో అవ్వండి.

  • ముందుగా వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్​ను ఇన్​స్టాల్ చేసుకోవాలి.
  • ఆండ్రాయిడ్ ఫోన్​లో వాట్సాప్​ను ఓపెన్ చేయాలి. తర్వాత స్టేటస్ ట్యాబ్​ను క్లిక్ చేయాలి.
  • స్క్రీన్​పై కింద కనిపించే 'పెన్సిల్' సింబల్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు టెక్ట్స్ స్టేటస్ విండో ఓపెన్ అవుతుంది. అదే స్క్రీన్​పై కింది భాగంలో కుడి వైపున మైక్రోఫోన్ ఐకాన్ కనిపిస్తుంది.
  • దానిపై ట్యాప్ చేసి రికార్డింగ్ మొదలు పెట్టాలి.
  • మెసేజ్ రికార్డ్ చేస్తున్నంతసేపు మైక్రోఫోన్ బటన్​ను నొక్కి పట్టుకోవాలి.
  • 30 సెకన్ల వరకు ఆడియోను రికార్డు చేసుకోవచ్చు.
  • మెసేజ్ రికార్డ్ చేసిన తర్వాత ప్రివ్యూ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్లే బటన్​పై క్లిక్ చేయడం ద్వారా రికార్డైన సందేశాన్ని విని చెక్ చేసుకోవచ్చు.
  • వాయిస్ స్టేటస్ మెసేజ్​ ఓకే అనిపిస్తే.. సెండ్ బటన్​పై క్లిక్ చేయాలి.
  • వెంటనే అది స్టేటస్​గా మారిపోతుంది. మన కాంటాక్టుల్లోని వారందరికీ వాయిస్ స్టేటస్ కనిపిస్తుంది.

ఐఫోన్​లో వాయిస్ స్టేటస్ ఇలా..

  • ఐఫోన్​లో వాట్సాప్ ఓపెన్ చేయాలి.
  • స్టేటస్ ట్యాబ్​లోని టాప్ రైట్ కార్నర్​లో ఉన్న "+" ఐకాన్​పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మైక్రోఫోన్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు.
  • రికార్డ్ చేసిన వాయిస్​ను చెక్ చేసుకొని, అవసరమైతే టెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు.
  • చివరకు, సెండ్ బటన్​ను టచ్ చేస్తే.. కాంటాక్టులకు వాయిస్ స్టేటస్ వెళ్లిపోతుంది.

అవసరమైతే వాయిస్ స్టేటస్​కు టెక్ట్స్​ను సైతం జోడించవచ్చు. ఇందుకోసం స్టేటస్ మెసేజ్ రికార్డ్ చేసే స్క్రీన్​పై 'యాడ్ ఎ క్యాప్షన్' బటన్ ఉంటుంది. ఇతర స్టేటస్​ల మాదిరిగానే.. వాయిస్ స్టేటస్​ను సైతం నచ్చినవారికే కనిపించేలా పెట్టుకోవచ్చు. స్టేటస్ ప్రైవసీ ఆప్షన్​ను సెట్ చేసుకొని.. ఎవరికి కావాలంటే వారికే కనిపించేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.