WhatsApp Upcoming Features : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా న్యూ యూజర్ నేమ్, డార్క్‌వెబ్ థీమ్, ఆడియో షేరింగ్ ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. త్వరలో వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
న్యూ యూజర్ నేమ్ ఫీచర్
WhatsApp New User Name Feature Benefits : వాట్సాప్‌లో ఇప్పటి వరకు యూజర్ల ఫోన్ నంబర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ త్వరలో మీకు నచ్చిన యూజర్ నేమ్ పెట్టుకునే అవకాశం లభించవచ్చు. ఒక వేళ ఇది అందుబాటులోకి వస్తే అనేక లాభాలు ఉంటాయి. అవేంటంటే?
1. యూజర్ నేమ్ ఉండడం వల్ల ఎవరైనా మిమ్మల్ని సులువుగా గుర్తుపడతారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా ఈజీగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. గ్రూప్ పార్టిపేషన్కు కూడా అవకాశం లభిస్తుంది.
2. యూజర్ నేమ్ ఉండడం వల్ల మీ వ్యక్తిగత భద్రతకు, ప్రైవసీకి ఆటంకం ఏర్పడదు.
3. ఫోన్ నంబర్ల కంటే, యూజర్ నేమ్స్ షేర్ చేయడం సులువు అవుతుంది. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మీ యూజర్లను అనుసంధానం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
ఆడియో షేరింగ్ ఫీచర్
WhatsApp Audio Sharing Feature Benefits : వాట్సాప్‌లో వీడియో కాల్స్ చేసినప్పుడు, స్క్రీన్ షేర్ చేస్తే ఎలాంటి ఆడియో వినిపించదు. దీని వల్ల ప్రెజెంటేషన్, మీడియా ప్లేబ్లాక్లకు ఇబ్బంది ఏర్పడుతోంది. అందుకే వాట్సాప్ ఆడియో షేరింగ్ ఫీచర్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే, వాట్సాప్ వీడియో కాల్లో స్క్రీన్ షేర్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఆడియో కూడా వినిపిస్తుంది. దీని వల్ల అనేక లాభాలు ఉంటాయి. అవి ఏమిటంటే?
1. గ్రూప్ వీడియో కాల్ చేసినప్పుడు, పార్టిసిపెంట్స్ అందరూ, షేర్ చేసిన మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
2. ఆన్లైన్ క్లాస్‌లు, ప్రెజెంటేషన్లు నిర్వహించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
3. వీడియో కాల్‌లోనే మూవీస్, షోస్ ఎంజాయ్ చేయవచ్చు.
డార్క్ థీమ్ ఆన్ వాట్సాప్ వెబ్
WhatsApp Dark Web Theme Benefits : వాట్సాప్ వెబ్‌లో డార్క్ మోడ్ ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. వాస్తవానికి వాట్సాప్ మొబైల్ యాప్‌లో ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. ఒక వేళ ఫీచర్ అందుబాటులోకి వస్తే, రాత్రి సమయాల్లో ల్యాప్‌టాప్, డెస్క్టాప్ల్లో వాట్సాప్‌ను ఉపయోగించే యూజర్లకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
సైబర్ మోసానికి గురయ్యారా? సింపుల్‌గా కంప్లైంట్ చేయండిలా!
డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించాలా? ఈ సింపుల్ టెక్నిక్స్ వాడండిలా!