ETV Bharat / science-and-technology

WhatsApp Restore : మీ ఫోన్​ పోగొట్టుకున్నారా?.. ఈ సింపుల్​ టిప్స్​తో వాట్సాప్​ అకౌంట్​ను రీస్టోర్​ చేసుకోండి!

WhatsApp Restore Account : మీ ఫోన్​ పోయిందా? దీనితో పాటు మీ వాట్సాప్​ కాంటాక్ట్స్​, పర్సనల్​ మెసేజెస్ అన్నీ​ పోయాయని బాధపడుతున్నారా? చింతించకండి. 6 సింపుల్​ టిప్స్​తో మీ వాట్సాప్​ అకౌంట్​ను తిరిగి రీస్టోర్​ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

How To Restore Your Whatsapp Messages On A New Phone
How To Restore Your Whatsapp Backup From Google Drive
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 2:18 PM IST

WhatsApp Restore Account : వాట్సాప్​.. విశేష జనాదరణ కలిగిన సోషల్​ మీడియా ప్లాట్​ఫాం. ఏ చిన్న పని చక్కబెట్టాలన్నా ప్రస్తుతం దీన్నే చాలామంది విరివిగా వాడుతున్నారు. అయితే ఒక్కోసారి టైం బాగోక మన ఫోన్​ అపహరణకు గురవుతుంటుంది. లేదా మనమే పోగొట్టుకుంటూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో అందులోని విలువైన సమాచారం.. ఫోన్​ నంబర్లు, సందేశాలతో పాటు ఇతర ముఖ్యమైన వ్యక్తిగతమైన వివరాలను కూడా కోల్పోతాము. ముఖ్యంగా ఇతరుల చేతుల్లోకి మన డేటా వెళ్లిపోతుంది. దీనితో మన ఫ్రెండ్స్​తో, ఫ్యామిలీతో వాట్సాప్​లో చేసిన పర్సనల్​ చాట్స్​ అన్నీ బహిర్గతం అయ్యే ప్రమాదం ఉంటుంది. మరి ఇలా జరగకుండా ఉండాలంటే.. 6 సింపుల్​ టిప్స్​ ఫాలో అయితే సరిపోతుంది. దీనితో మీ వాట్సాప్​ అకౌంట్​( WhatsApp Restore Messages )ను తిరిగి రీస్టోర్​ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా పునరుద్ధరించుకొని, సురక్షితంగా ఉంచుకోవచ్చు.

1. చాట్​ హిస్టరీ బ్యాకప్​ మేలు!
WhatsApp Restore With Backup : మన ఫోన్​ ఎప్పుడు, ఎక్కడ అపహరణకు గురవుతుందో చెప్పలేము. అలాంటప్పుడు ముందుగానే మన వాట్సాప్​ చాట్​ హిస్టరీని బ్యాకప్​ చేసుకొని ఉంచుకోవడం మేలు. దీనితో మీరు కొత్త ఫోన్​లో లేదా పాత మొబైల్​లో కూడా మీ వాట్సాప్​ అకౌంట్​ను రీస్టోర్​ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఓల్డ్​ చాట్​ హిస్టరీని కూడా రికవరీ చేసుకోవచ్చు.

మీ చాట్​ హిస్టరీని బ్యాకప్​ చేయడానికి ముందుగా.. వాట్సాప్​ సెట్టింగ్స్​> చాట్స్​> చాట్​ బ్యాకప్​> చివరగా బ్యాకప్​ బటన్​పై ట్యాప్​ చేయండి. లేదా ఆటోమెటిక్​ బ్యాకప్స్​ను సెటప్​ చేయడం ద్వారా కూడా మీ చాట్​ను గూగుల్​ డ్రైవ్​ లేదా ఐ-క్లౌడ్​ నుంచి రీస్టోర్​ చేసుకోవచ్చు.

2. వెంటనే అకౌంట్​ను డీ-యాక్టివేట్​ చేయండి..!
మీ ఫోన్​ అపహరణకు గురయినప్పుడు లేదా పోగొట్టుకున్నప్పుడు మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది.. వాట్సాప్​ అకౌంట్​ డీ-యాక్టివేషన్​. ఇది మీ వాట్సాప్​ ఖాతాను ఎవరూ యాక్సెస్​ చేయడానికి వీల్లేకుండా చేస్తుంది.

మీ అకౌంట్​ను డీ-యాక్టివేట్​ చేయడానికి ముందుగా.. వాట్సాప్​ సపోర్ట్​కు మెయిల్​ పంపండి. support@whatsapp.com అనే మెయిల్​ ఐడీకి "Lost/Stolen: Please deactivate my account" అనే సబ్జెక్ట్​ లైన్​తో ఈ-మెయిల్​ పెట్టండి. అయితే ఇలా మెయిల్​ పెట్టే సమయంలో బాడీ విభాగంలో మీ ఫోన్​ నంబర్​ను ఇంటర్నేషనల్​ ఫార్మాట్​లో అంటే +1 555-123-4567 లాంటి సంఖ్యలను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.

3. కొత్త సిమ్​ కార్డును తీసుకోండి!
How To Restore WhatsApp Backup : ఒకవేళ మీరు పొగొట్టుకున్న ఫోన్​ మరలా దొరికింది అనుకుందాం.. అప్పుడు కూడా పాత నంబర్​పైనే మరో కొత్త సిమ్​ కార్డును తీసుకోండి. దీనితో మీ వాట్సాప్​ అకౌంట్​ను.. చాట్​ హిస్టరీని మరలా రిస్టోర్​ చేసుకోవడానికి వీలవుతుంది. లేకపోతే కొత్త సిమ్​కార్డును వేరే మొబైల్​లో వేసి.. గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి వాట్సాప్​ను ఇన్​స్టాల్​ చేసుకోండి. తరువాత మీ ఫోన్​ నంబర్​ను వెరిఫై చేసుకోవడం సహా.. వాట్సాప్ చాట్​ హిస్టరీని కూడా రీస్టోర్​ చేసుకోండి.

4. చాట్​ హిస్టరీని రిస్టోర్​ చేయండి!
How To Restore Your WhatsApp Chats : మీరు పోగొట్టుకున్న ఫోన్​లో వాట్సాప్​ చాట్​ హిస్టరీని బ్యాకప్​ చేసినట్లయితే.. మీరు సులువుగా కొత్త ఫోన్​లో వాటిని రీస్టోర్​ చేసుకోవచ్చు. దీనితో మీ పాత చాట్​లోని ఫొటోలు, వీడియోలు సహా వ్యక్తిగత సందేశాలన్నంటినీ తిరిగి పొందవచ్చు.

5. మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోండి!
భవిష్యత్తులో మీ వాట్సాప్​ అకౌంట్​ను థర్డ్​ పార్టీలేవీ యాక్సెస్​ చేయడానికి వీల్లేకుండా మీరు కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్స్ చేసుకోవాలి. అందులో ముఖ్యంగా టూ-స్టెప్​ వెరిఫికేషన్​ను ఎనేబుల్​ చేసుకోండి. ఇందుకోసం వాట్సాప్​ సెట్టింగ్స్​> అకౌంట్​> టూ-స్టెప్​ వెరిఫికేషన్​పై క్లిక్​ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు తెలియకుండా మరెవరూ మీ వాట్సాప్​ను యాక్సెస్ చేయలేరు. ఎవరైనా మీ ఖాతాను యాక్సెస్​ చేయడానికి ప్రయత్నించినా.. మీకు మాత్రమే తెలిసిన 6 అంకెల పిన్​ నంబర్​ను వాట్సాప్​ అడుగుతుంది.

6. వాట్సాప్​ వెరిఫికేషన్​ కోడ్​.. జాగ్రత్త!
WhatsApp Verification Code : మీ వాట్సాప్​ వెరిఫికేషన్​ కోడ్​ను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి. ఒకవేళ మీ వెరిఫికేషన్​ కోడ్​ను ఇతరులకు చెబితే.. వాళ్లు మీ అకౌంట్​ను ఇతర డివైజ్​లలో యాక్సెస్​ చేసి, మీ వ్యక్తిగత సమాచారాన్ని అపహరించే అవకాశం, ప్రమాదం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.