ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్స్ ఉపయోగించే చాలా మంది వాట్సాప్‌ను తప్పనిసరిగా వాడుతున్నారు. వాట్సాప్‌తో.. ఎంత దూరం ఉన్న వ్యక్తితో అయినా వీడియో కాల్స్, ఆడియో కాల్స్‌లో మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇందులో టెక్స్ట్ మెసెజెస్, వాయిస్ సందేశాలు పంపించుకోవచ్చు. వీడియోస్, ఫొటోస్ను కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే మన ఫోన్లో స్టోరేజీ లేకపోవడమో లేదా ఇతర కారణాల వల్లో.. వాట్సాప్‌లో వచ్చిన కొన్ని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాల్సి వస్తుంది. అవి తర్వాత ఎప్పుడైనా అవసరమైతే.. తిరిగి పొందలేమని బాధపడుతుంటాం. కానీ, ఇకపై అలా చింతించాల్సిన అవసరం లేదు. కింద చెప్పిన విధంగా చేస్తే.. డిలీట్ అయిపోయిన ఫొటోస్, వీడియోస్‌ను తిరిగి వెనక్కి తీసుకురావచ్చు.
ఫోన్ గ్యాలరీ:
మీ ఫోన్లో అన్ని ఫొటోస్, వీడియోస్‌ను.. ఫోన్ గ్యాలరీలో నిల్వ చేస్తుంటుంది వాట్సాప్. అందువల్ల మనం చాట్ నుంచి ఫొటోస్ను డిలీట్ చేసినప్పటికీ అవన్నీ డివైజ్ గ్యాలరీ, గూగుల్ ఫొటోస్ లేదా ఫొటోస్ ఐక్యూఎస్లో స్టోరై ఉంటాయి.
వాట్సాప్ మీడియా ఫోల్డర్:
ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రమే మీడియా ఫోల్డర్ నుంచి వాట్సాప్ మీడియాను రీస్టోర్ చేసుకునే అవకాశం ఉంది. తొలుత ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ప్రోగ్రాంలోకి వెళ్లాలి. తర్వాత రూట్ డైరెక్టరీలో వాట్సాప్ ఫోల్డర్‌కు వెళ్లాలి. అందులోని మీడియా ఫోల్డర్‌కు వెళ్తే.. వాట్సాప్ ఫొటోస్ ఫోల్డర్ కనిపిస్తుంది. మీరు డిలీట్ చేసిన ఫొటోస్ అన్నీ అందులో స్టోరై ఉంటాయి. అందులో నుంచి మీకు కావాలసిన ఫొటోను రీలోడ్ చేసుకోవచ్చు.
గూగుల్ డ్రైవ్ లేదా ఐకుడ్ నుంచి బ్యాక్ అప్
వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న మరో ఆప్షన్ 'బ్యాక్-అప్, రీస్టోర్'. ఐఓఎస్ యూజర్స్ ఐకుడ్ నుంచి, ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ డ్రైవ్ నుంచి బ్యాక్-అప్ చేసుకోవచ్చు. మనం బ్యాక్-అప్ చేసిన ఫొటోలు, సందేశాలను డ్రైవ్ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. రీస్టోర్ చేయగానే అందులోని మీడియా పైల్స్ కూడా కనిపిస్తాయి. అయితే, బ్యాక్-అప్ చేసినప్పుడు ఉన్న మీడియా ఫైల్స్ మాత్రమే రీస్టోర్ చేసుకునేందుకు వీలుంటుంది.
బ్యాక్ అప్ను.. రీస్టోర్ ఎలా చేయాలంటే?
వాట్సాప్‌ను రీఇన్‌స్టాల్ చేయాలి. అకౌంట్ సెట్అప్లో ఇంతకు ముందు వాడిన నంబర్‌నే ఎంటర్ చేయాలి. అనంతరం, రీస్టోర్ డేటా బ్యాక్అప్ రిక్వస్ట్‌ను యాక్సెప్ట్ చేయాలి. ఇంతకుముందు బ్యాక్-అప్ చేసిన మెసేజ్‌లు, మీడియా ఫైల్స్ అన్నీ డివైజ్‌లోకి వచ్చేస్తాయి.
గ్యాలరీలో డిలీట్ ఆప్షన్‌ను తొలగించటం:
వాట్సాప్ చాట్‌లో డిలీట్ చేసిన ఫొటోలు.. ఫోన్లోని గ్యాలరీ నుంచి డిలీట్ అవ్వకుండా ఉండాలంటే సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది. ఇందుకోసం 'డిలీట్ మీడియా ఇన్ దిస్ రిసీవ్డ్ చాట్' అనే ఆప్షన్‌ను అన్‌చెక్ చెయ్యాలి. ఇలా చేయటం వల్ల ఒకవేళ మీ వాట్సాప్ చాట్ డిలీటైపోయినా.. ఫొటోస్ మాత్రం పదిలంగా ఉంటాయి. ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మొత్తం నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి.
- డిలీట్ ఎనీ మీడియా థట్ వజ్ షేర్డ్ ఇన్ థిస్ చాట్ ఫ్రం యువర్ డివైజ్ గ్యాలరీ యాస్ వెల్.
- డిలీట్ ఫర్ ఆల్ యూజర్స్.
- డిలీట్ థిస్ ఫర్ మి.
- క్యాన్సిల్.
ఫోన్లో ఫొటోస్ డిలీట్ కాకుండా ఉండేందుకు మొదటి ఆప్షన్‌ను అన్‌చెక్ చేయాలి.