How to Use Whatsapp One Time Voice Message Feature : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ను తమ యూజర్స్ కోసం అందిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే వన్-టైమ్ లిసెన్ వాయిస్ మెసేజ్ ఫీచర్. అంటే ప్రస్తుతం మీరు వ్యూ వన్స్ ఫీచర్‌ను ఉపయోగించి ఫొటోలు, వీడియోలు పంపుతున్నట్టే.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌లను కూడా ఒక్కటేసారి వినేలా ఈ ఫీచర్‌ను తీర్చిదిద్దారు.
మీరు పంపాలనుకున్న సున్నితమైన సమాచారాన్ని వన్-టైమ్ లిసెన్ వాయిస్ మెసేజ్ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్ రూపంలో ఎటువంటి భయం లేకుండా పంపుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ వల్ల.. మీరు పంపే వాయిస్ సందేశాన్ని ఇతరులకు ఫార్వర్డ్ లేదా షేర్ చేయడం, సేవ్ చేసుకోవడం, స్టార్ చేయడం, రికార్డ్ చేయడం కుదరదు. తద్వారా ఈ పైవాటిలో దేని ద్వారా కూడా మీరు భవిష్యత్‌లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడదు.
ఎలా వాడాలి?
- ముందుగా మీ వ్యక్తిగత చాట్ లేదా గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేయండి.
- మైక్రోఫోన్ లేదా మైక్ సింబల్‌ను సెలెక్ట్ చేసుకోండి.
- దానిని పైకి స్వైప్ చేయండి. ఇది మీ రికార్డింగ్‌ను లాక్ చేస్తుంది.
- తర్వాత రికార్డ్ బటన్‌ను ప్రెస్ చేసి, చెప్పాలనుకున్న విషయం చెప్పండి.
- మీరు నొక్కిన బటన్ గ్రీన్ కలర్లో మారే వరకు వేచి ఉండండి. ఇది 'వ్యూ వన్స్' మోడ్‌ను సూచిస్తుంది.
- ఇప్పుడు సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఒకవేళ అవతలి వ్యక్తి రీడ్ మెసేజెస్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే గనుకు అతడు మీరు వన్-టైమ్ వ్యూ ఫీచర్‌ను ఉపయోగించి పంపిన వాయిస్ మెసేజ్‌ను అతడు చూశాడా లేదా అనే విషయం మీకు అర్థం అవుతుంది.
త్వరలో 'రిప్లై బార్' ఫీచర్..!
Whatsapp Reply Bar : ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌కు మీరు నేరుగా ఇచ్చే రిప్లై ఫీచర్ మాదిరిగానే వాట్సాప్‌లోనూ అలాంటి ఫీచర్‌ను తీసుకురానుంది మెటా సంస్థ. వాట్సాప్ స్టేటస్‌లకు రియాక్ట్ అయ్యే ఆప్షన్ ఇప్పటికే ఉన్నప్పటికీ.. దానిని వాడాలంటే రిప్లై ఇవ్వాలనుకుంటున్న స్టేటస్ స్క్రీన్‌ను పైకి స్వైప్ చేయాల్సి ఉంటుంది. కానీ, త్వరలో రాబోయే 'రిప్లై బార్' ఫీచర్‌తో అటువంటి శ్రమేమీ లేకుండా స్టేటస్ ఓపెన్ చేయగానే రిప్లై బాక్స్ అందుబాటులో ఉంటుంది. అందులో టైప్ చేసి మీ అభిప్రాయాన్ని అవతలి వ్యక్తులకు తెలియపర్చవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కేవలం కొందరు బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంచారు. భవిష్యత్‌లో దీనిని ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ యూజర్స్ అందరకీ అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తోంది వాట్సాప్.
వాట్సాప్ స్టేటస్ ఇక ఇన్‌స్టాలోనూ షేరింగ్- మెటా నయా ఫీచర్
మీ ప్రైవేట్ చాట్స్ ఎవరూ చూడకూడదా? సింపుల్‌గా 'సీక్రెట్ కోడ్' పెట్టేయండిలా!