ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో ట్విట్టర్ లాంటి ఆప్షన్.. నచ్చిన 'ఛానెల్స్​'తో కనెక్ట్ అవ్వొచ్చు! - వాట్సాప్​ ఛానెల్స్​ ఫీచర్​

ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అప్డేట్లు తెస్తున్న వాట్సాప్..​ మరిన్ని కొత్త ఫీచర్లతో ముందుకు రాబోతోంది. ట్విట్టర్​ తరహాలో సమాచారం అందించేందుకు 'ఛానెల్స్​' ఫీచర్​ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

WhatsApp New Feature Channels
WhatsApp New Feature Channels
author img

By

Published : Apr 25, 2023, 6:41 AM IST

వాట్సాప్ లేని మొబైల్​ ఫోన్​ను ఊహించగలమా?.. ఆ స్థాయిలో ఆ యాప్ వినియోగం పెరిగిపోయింది. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​ లాంటి అనేక సోషల్ మీడియా వేదికలు ఉన్నప్పటికీ.. వాటన్నింటిలోకెల్లా వాట్సాప్​ ప్రత్యేకమనే చెప్పాలి. ఆన్​లైన్​ మెసేజింగ్​ కోసం కొన్ని ఎన్నో ఉన్నప్పటికీ.. వాట్సాప్​ను మించిన పాపులారిటీ దేనికీ లేదు. బంధువులు, మిత్రులు, సహోద్యోగులు.. ఇలా ఎవ్వరితోనైనా టచ్​లో ఉండేందుకు వాట్సాప్ తప్పనిసరి.

యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకువస్తోంది. ప్రస్తుతం అలాంటి మరొక ఫీచర్​తో యూజర్ల ముందుకు రాబోతోంది. సమాచారాన్ని ప్రసారం చేయడానికి 'ఛానెల్స్​' అనే ఫీచర్​ను పరిక్షిస్తోంది వాట్సాప్​ సంస్థ. వాట్సాప్​ బీటా ఇన్ఫో అనే సంస్థ తాజా నివేదిక ప్రకారం.. స్టేటస్​ ట్యాబ్​కు 'అప్డేట్స్​' అనే కొత్త పేరు పెట్టనుంది. ఇందులోనే వన్​-టూ-మెనీ అనే కాన్సెప్ట్​తో 'ఛానెల్స్'​ను రూపొందిస్తోంది. అయితే, దీన్ని ఓ ఆప్షనల్​ ఎక్స్​టెన్ష్​లా తీసుకువస్తోంది. ఇందులో యూజర్లు వారికి నచ్చిన ఛానెళ్ల హ్యాండిల్స్​ను ఎంచుకోవచ్చు. దానికోసం 'ఫైండ్​ ఛానెల్స్​' క్లిక్​ చేసి.. నచ్చిన ఛానెల్​ను వెతుక్కోవాలి. అనంతరం.. ఫోన్​ నంబర్​ ఇతర సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారం గోప్యతకు వాట్సాప్​ హామీ ఇస్తుంది.

మనం ఎంచుకున్న ఛానెల్స్​ నుంచి యూజర్లకు వచ్చే మెసేజ్​లను​ ఎండ్​-టూ-ఎండ్​ ఎన్​క్రిప్ట్​ చేయడానికి వీలుండదు. అయితే, వినియోగదారుల ప్రైవేటు చాటింగ్​కు ఎలాంటి అంతరాయం ఉండదు. వారి చాటింగ్​ ఎండ్​-టూ-ఎండ్​ ఎన్​క్రిప్ట్​ అవుతుంది. దీంతో పాటు మనం ఏ ఛానెల్​ను ఎంచుకున్నామో లేదా ఫాలో అయ్యామో అనే వివరాలు ఎవరికీ కనిపించవు. ఉదాహరణకు ట్విట్టర్​లో ఓ యూజర్ ఒక వార్తా ఛానెల్​ హ్యాండిల్​ ఫాలో అయితే.. అది అందరికీ కనిపిస్తుంది. కానీ వాట్సాప్​లో అలా జరగదు. ​

ఈ ఫీచర్​ను.. ఛానెల్​ యాక్సెసిబిలిటీని పెంచడానికి తీసుకొస్తున్నారు. దాని ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన అప్డేట్‌లను సులభంగా పొందుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్​ అభివృద్ధి దశలో ఉంది. యాప్​ తదుపరి అప్డేట్​లో ఈ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంతకుముందు.. వాట్సాప్​ 'కీప్​ ఇన్​ చాట్​' అనే ఫీచర్​ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్​తో ఒక్కసారి చూసిన తర్వాత డిలీట్​ అయ్యే మెసేజ్​లను లాంగ్​ ప్రెస్​ చేసి ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత సేవ్​ చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.