ETV Bharat / science-and-technology

టెలిగ్రామ్​లోని ఆ ఫీచర్​.. ఇకపై వాట్సాప్​లో! - పోల్​ ఫీచర్

Telegram Features in Whatsapp: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మరింత యూజర్​ ఫ్రెండ్లీ సేవలందిస్తోంది వాట్సాప్​. ఈక్రమంలోనే టెలిగ్రామ్​లో అందుబాటులో ఉన్న ఓ ఫీచర్​ను వినియోగదారుల కోసం తీసుకొస్తోంది.

poll feature in whatsapp
telegram features in whatsapp
author img

By

Published : Mar 7, 2022, 4:31 PM IST

Telegram Features in Whatsapp: వినియోగదారులకు అనేక ఫీచర్లు అందిస్తున్న టెలిగ్రామ్​తో అగ్రగామి మెసెంజర్​ వాట్సాప్​ను తరచూ పోలుస్తుంటారు. టెలిగ్రామ్​లో ఉన్నన్ని ఫీచర్లు వాట్సాప్​లో లేవు. అయినా సులువైన చాటింగ్​తో పాటు యూజర్​ ఫ్రెండ్లీగా ఉంటూ ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన మెసెంజర్​గా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే మరో కొత్త ఫీచర్​ను తన వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది వాట్సాప్​. అదే 'పోల్'​ ఫీచర్​. అయితే ఈ ఫీచర్​ ఇప్పటికే టెలిగ్రామ్​లో అందుబాటులో ఉంది.

ఏంటీ ఫీచర్..

ఈ పోల్​ ఫీచర్​ను వాట్సాప్​ ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​తో తీసుకురానుంది. ఇది కేవలం గ్రూప్​ చాట్​లోనే అందుబాటులో ఉండనుంది. గ్రూప్​లోని సభ్యులు మాత్రమే ఈ పోల్స్​ను చూసి, ఓటు వేసి, ఫలితాలను తెలుసుకోగలరు.

ప్రస్తుతం వాట్సాప్​ గ్రూప్​లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే.. ముందు దాని గురించి మెసేజ్​ చేసి, ఎంత మంది ఓటేశారు, ఫలితం ఏంటనేది మ్యానువల్​గా లెక్కించాల్సి ఉంది. నిర్ణయాలను కచ్చితంగా, వేగంగా తీసుకోవడానికి ఈ పోల్​ ఫీచర్​ ఉపయోగపడుతుంది.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ఇప్పటివరకు దీని గురించి కచ్చితమైన సమాచారం లేదు. అయితే పోల్​ ఫీచర్​కు సంబంధించిన పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయని సమాచారం. ముందుగా ఇది ఐఓఎస్​ యూజర్లకు.. ఆ తర్వాతే డెస్క్​టాప్​, ఆండ్రాయిడ్​ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:

టెలిగ్రామ్​కు క్యూ కట్టిన యూజర్లు

WhatsApp: వాట్సాప్‌తో పోటీనా.. వండర్ జరగాల్సిందే!

వాట్సాప్​, టెలిగ్రామ్​లకు ఆదాయం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.