ఫ్రెండ్‌తో గొడవైందా? కానీ.. అతడు/ఆమె పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూడాలని ఉందా? అది కూడా వారికి తెలియకుండా! ఇందుకు కొన్ని మార్గాలున్నాయి.
వాట్సాప్ స్టేటస్ చూసేందుకు నాలుగు మార్గాలు..
ఇన్‌కాగ్నిటో మోడ్ ఆన్
ఒక వేళ మనం డెస్క్‌టాప్‌లో వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్నట్లయితే ఆ లింక్‌ను ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఓపెన్ చేయండి. దీని వల్ల మీరు ఆ వ్యక్తి వాట్సాప్ స్టేటస్ చూసినట్లు వారికి తెలియదు.
ఆఫ్‌లైన్‌లో వాట్సాప్ స్టేటస్
వాట్సాప్ ఓపెన్ చేయండి. స్టోరీస్ అన్నీ లోడ్ అయ్యేందుకు కాసేపు వేచి చూడండి. తర్వాత నెట్ ఆఫ్ చేసి మీకు కావాల్సిన వ్యక్తి స్టేటస్ చూడండి. ఇలా చేస్తే మీ వ్యూ ఆ స్టేటస్ కింద రికార్డ్ అవ్వదు.
ఫైల్ మేనేజర్లో స్టోరేజ్
ఆండ్రాయిడ్ యూజర్లకు ఫైల్ మేనేజర్లో వాట్సాప్ పేరుతో ఓ ఫొల్డర్ ఉంటుంది. అందులో అందరి స్టేటస్లు సేవ్ అయి ఉంటాయి. స్టేటసస్ ఫోల్డర్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన వారి స్టేటస్‌ను చూడొచ్చు.
రెడ్ రిసీట్ ఆప్షన్ డిసేబుల్
బ్లూ టిక్ కనిపించకుండా ఉండేందుకు ఉపయోగించే రెడ్ రిసీట్స్ ఆప్షన్‌ను ఉపయోగించి వాట్సాప్ స్టేటస్ సీక్రెట్‌గా చూడొచ్చు. బ్లూటిక్ ఆఫ్ చేస్తే మనం మెసేజ్ చదివినట్లు వారికి తెలియదు. అలానే స్టేటస్‌ను చూసినట్లు కూడా ఎక్కడా కనిపించదు.
ఇదీ చదవండి:ఇన్‌స్టాలో వానిష్ మోడ్.. మెసేజ్‌లన్నీ మాయం! ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా?