ETV Bharat / science-and-technology

WhatsApp Tips: ఈ షార్ట్‌కట్స్ గురించి తెలుసా? - వాట్సాప్ డెస్క్​టాప్ షార్ట్​కట్స్

ఈ జనరేషన్​లో వాట్సాప్ ఉపయోగించనివారు ఉండరేమో. మొబైల్​లో వాట్సాప్ వాడుతున్నవారికి ఎన్నో షార్ట్​కట్స్ అందుబాటులో ఉన్నాయి. మరి.. బ్రౌజర్​లో వాట్సాప్ వినియోగిస్తున్నవారి మాటేంటి అంటారా? వారి కోసం కూడా అనేక టిప్స్(WhatsApp Tips) ఉన్నాయి. వాటితో ఏ పనైనా సింపుల్​గా చేసెయ్యొచ్చు తెలుసా?

WHATSAPP SHORTCUTS
వాట్సాప్ టిప్స్
author img

By

Published : Jul 26, 2021, 8:19 AM IST

వర్క్‌ ఫ్రం హోం విధానం ఎక్కువైన తర్వాత వాట్సాప్‌ వినియోగం బాగా పెరిగింది. ఆఫీస్‌ వర్క్‌ కోసం డెస్క్‌టాప్‌లో ట్యాబ్‌లను ఓపెన్‌ చేసుకోవడంతోపాటు 'వెబ్‌ వాట్సాప్‌'ను ఓ భాగం చేసుకుంటూ ఉంటాం. అయితే మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఓపెన్‌ చేస్తుంటారు. దీని వల్ల సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా ముఖ్యమైన సందేశం వస్తేనే చూసుకోవడానికి నోటిఫికేషన్‌ అలర్ట్‌ను వాడొచ్చు. అంతేకాకుండా వాట్సాప్‌ వెబ్ కోసం ప్రత్యేకంగా కొన్ని షార్ట్‌కట్‌లు(WhatsApp Tips) ఉన్నాయి. అవేంటో చూద్దాం..

మార్క్‌ యాజ్‌ అన్‌రీడ్‌

ఏదైనా గ్రూప్‌లో మెసేజ్‌ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూస్తాం. అప్పుడు పంపిన వ్యక్తికి మనం ఆ మెసేజ్‌ను చూశామని తెలుస్తుంది. అలాకాకుండా మెసేజ్‌ను చూడలేదని తెలిసేలా ctrl+alt+shift+u క్లిక్‌ చేస్తే అన్‌రీడ్‌ మోడ్‌లోకి వెళ్తుంది.

ఆర్కివ్‌ చాట్‌

సాధారణంగా డెస్క్‌టాప్‌లో ఏదైనా గ్రూప్‌నుకానీ, వ్యక్తిగత చాటింగ్‌ను ఆర్కివ్‌ చేయాలంటే సింపుల్‌గా ctrl+alt+e క్లిక్‌ చేస్తే సరిపోద్ది.

పిన్‌ చాట్‌

ముఖ్యమైన గ్రూప్‌ను టాప్‌లో పెట్టుకునేందుకు పిన్‌ చాట్‌ ఉపయోగపడుతుంది. దీని కోసం ctrl+alt+shift+p

సెర్చ్‌ చాట్‌

గ్రూప్‌లోని చాటింగ్ సెక్షన్‌లో సెర్చ్‌ చేసుకోవడానికి ctrl+alt+shift+f క్లిక్‌ చేయాలి.

న్యూ గ్రూప్‌, న్యూ చాట్

కొత్తగా గ్రూప్‌ క్రియేట్‌ చేసుకోవడానికి ctrl+alt+shift+N క్లిక్‌ చేయాలి. న్యూ చాట్‌ కోసం ctrl+alt+N ప్రెస్ చేయాలి.

ఇన్‌క్రీజ్ లేదా డిక్రీజ్‌ స్పీడ్‌ ఆఫ్‌ సెలెక్టెడ్‌ వాయిస్ మెసేజ్‌

మీరు ఎంచుకున్న వాయిస్ మెసేజ్‌ స్పీడ్‌ను పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి shift+. ఉపయోగపడుతుంది.

సెట్టింగ్స్‌

వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలంటే మెను క్లిక్‌ చేసి అందులోని సెట్టింగ్స్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్‌గా వెళ్లాలంటే ctrl+alt+, క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

మ్యూట్‌

ఒక గ్రూప్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ను మ్యూట్‌ చేయాలంటే ctrl+alt+shift+M వాడుకోవచ్చు.

ఎగ్జిట్‌ గ్రూప్

ఏదైనా గ్రూప్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలంటే.. సాధారణంగా గ్రూప్‌లోని త్రీడాట్స్‌ను క్లిక్‌ చేసి ఎగ్జిట్‌ గ్రూప్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి బదులు ctrl+alt+Backspace ప్రెస్ చేస్తే సరిపోతుంది. వ్యక్తిగత చాట్‌లో మెసేజ్‌లను క్లియర్‌ చేసుకోవడానికి దీనిని వాడుకోవచ్చు.

ప్రొఫైల్ అండ్‌ ఎబౌట్‌

యూజర్‌ ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌ సెక్షన్‌కు వెళ్లేందుకు ctrl+alt+P క్లిక్‌ చేసేయండి.

ఇదీ చదవండి: మొబైల్స్​పై అమెజాన్​ ఆఫర్ల బొనాంజా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.