Whatsapp HD Photos Feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్.. మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ద్వారా వాట్సాప్‌లో HD ఫొటోలను ఈజీగా పంపుకోవచ్చు. ఇప్పటివరకు వాట్సాప్‌లో ఫొటోలు పంపితే అవి కంప్రెస్ అయ్యేవి. తాజా ఫీచర్‌తో ఫుల్ క్వాలిటీ ఫొటోస్ను షేర్ చేసుకోవచ్చు.
Whatsapp HD Photos Send Option : ఈ కొత్త ఫీచర్‌తో HD క్వాలిటీ ఫొటోలను సులభంగా షేర్ చేసుకోగలుగుతున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. మరికొందరు తమకు ఇంకా అప్డేట్ రాలేదని చెబుతున్నారు. అలాంటి వారు మరికొద్ది రోజులు ఆగాలని వాట్సాప్ చెబుతోంది. త్వరలోనే అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలిపింది. అంతే కాకుండా అతిత్వరలో HD వీడియో ఫీచర్‌ను కూడా తీసుకురానున్నట్లు వెల్లడించింది. మరి వాట్సాప్‌లో HD క్వాలిటీ ఫొటోలను ఎలా పంపాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా ఈ కొత్త ఫీచర్ కోసం గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి.
- మీరు HD ఫొటోలను ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేయాలి.
- అటాచ్మెంట్లో ఫొటోపై క్లిక్ చేస్తే.. Standard, HD అనే రెండు ఆప్షన్లను కనిపిస్తాయి.
- HD క్వాలిటీ ఫొటోలను పంపాలనుకున్నప్పుడు రెండో ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- ఆ తర్వాత ఫొటోలను ఎంచుకుని సెండ్ ఆప్షన్ క్లిక్ చేయలి. అంతే సింపుల్‌గా HD ఫొటోలను ఇలా షేర్ చేసుకోవచ్చు.
వాట్సాప్ కమ్యూనిటీలో పోల్స్
Whatsapp Community Polls : కొన్నిరోజుల క్రితం వాట్సాప్.. అన్ని గ్రూప్‌లకు ఒకేసారి అనుకున్న మెసేజ్‌ను పంపేందుకు వీలుగా వాట్సాప్ కమ్యూనిటీస్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. తాజాగా కమ్యూనిటీలో పోల్స్ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
Polls In Whatsapp Community : ఈ ఫీచర్ ద్వారా కమ్యూనిటీలో అడ్మిన్.. ఓ ప్రశ్న అడిగి సమాధానం కోసం ఆప్షన్లు ఇవ్వవచ్చు. అనేక గ్రూపుల్లో ఉన్న సభ్యులు.. ఆ ప్రశ్నకు ఓటింగ్ వేయవచ్చు. అయితే ఈ ఫీచర్.. యూజర్ల గోప్యతకు భంగం కలిగించదని వాట్సాప్ తెలిపింది. గ్రూప్‌ల్లో ఉన్న సభ్యుల ఫోన్ నంబర్ ఎక్కడా బహిర్గతం కాదని వివరించింది.
WhatsApp Video Call : వాట్సాప్ నయా ఫీచర్.. ఒకేసారి 15 మందితో గ్రూప్ వీడియో కాల్!
వాట్సాప్‌లో కొత్త అప్డేట్స్.. ఆకర్షణీయంగా సెర్చ్ బార్.. ఈజీగా గ్రూప్ క్రియేషన్!