ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో ఇకపై HD క్వాలిటీలో ఫొటోలు పంపే వీలు! - How to send AWESOME quality photos on WhatsApp

Whatsapp HD image sharing : వాట్సాప్​ యూజర్లకు గుడ్​ న్యూస్​. త్వరలోనే వాట్సాప్​లో మీరు హెచ్​డీ క్వాలిటీ ఇమేజ్​లను పంపించుకోవచ్చు. వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్​ను తీసుకురావడం కోసం​ సన్నాహాలు చేస్తున్నట్లు WABetalnfo పేర్కొంది.

WhatsApp upcoming feature HD image sharing
WhatsApp HD image sharing
author img

By

Published : Jun 7, 2023, 7:33 PM IST

Whatsapp HD image sharing : ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​.. తన ఫ్లాట్​ఫాం ద్వారా హెచ్​డీ క్వాలిటీ ఇమేజ్​లను పంపించేందుకు వీలుగా ఓ సరికొత్త ఫీచర్​ను తేవడానికి సన్నాహాలు చేస్తోంది. డబ్ల్యూఏబీటాఇన్​ఫో ఈ మేరకు కొన్ని వాట్సాప్​ హెచ్​డీ ఇమేజ్​ ఫీచర్​ ఉన్న స్క్రీన్​షాట్స్​ను లీక్​ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్​ వాట్సాప్​ బీటా iOS 23.11.0.76లోనూ, వాట్సాప్​ బీటా ఆండ్రాయిడ్​ 2.23.12.13లోనూ అందుబాటులోకి వచ్చింది.

WhatsApp HD photo quality and its uses
వాట్సాప్​లో ఈ హెచ్​డీ ఫోటో ఫీచర్​ వస్తే.. కనుక అది యూజర్లకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్టాండర్డ్​ క్వాలిటీలోనూ, అవసరమైతే హెచ్​డీ క్వాలిటీలోనూ ఇమేజ్​లను పంపించుకోవచ్చు. దాని కోసం మాన్యువల్​గా మనం హెచ్​డీ ఫోటో ఆప్షన్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే హెచ్​డీ క్వాలిటీ ఇమేజ్​లను కొంత మేరకు కంప్రెస్​ చేసి మాత్రమే వాట్సాప్​లో పంపించగలం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ గ్యాలరీలోని ఫొటోలకు వాటర్​మార్క్​ పెట్టనప్పటికీ, వాట్సాప్​ ద్వారా హెచ్​డీ క్వాలిటీ చిత్రాలను పంపినప్పుడు, డిఫాల్ట్​గా ఇమేజ్​ బబుల్​పై హెచ్​డీ వాటర్​మార్క్​ పడుతుంది.

ఫొటోలకు మాత్రమే.. వీడియోలకు కాదు!
ప్రస్తుతం ఫొటోలను మాత్రమే హెచ్​డీ క్వాలిటీలో పంపించే ఫీచర్ తెచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. సూపర్​ క్వాలిటీ హెచ్​డీ వీడియోలు మాత్రం పంపడానికి వీలుపడదు. ఒక వేళ మీరు కచ్చితంగా మంచి క్వాలిటీతో వీడియోలను పంపాలనుకుంటే 'డాక్యుమెంట్స్​' రూపంలో వాటిని పంపించాల్సి ఉంటుంది. మీరు స్టేటస్ అప్​డేట్​గా పెట్టుకునే ఫొటోలకు, వీడియోలకు ఇది వర్తించదు.

WhatsApp HD photo sharing ఫీచర్​ వల్ల కలిగే లాభాలు :

  1. మీరు మీ మిత్రులతో గడిపిన సంతోషకరమైన క్షణాలను ఫోటోలు తీసి హైక్వాలిటీలో షేర్​ చేసుకోవచ్చు.
  2. మీ పనికి సంబంధించిన హెచ్​డీ ఇమేజ్​లను మీ బాస్​తో లేదా సహోద్యోగులకు పంపవచ్చు.
  3. మీరు ఒక వేళ మంచి ప్రొఫెషనల్​ ఫొటోగ్రాఫర్​ అయితే మీ క్లయింట్లకు చాలా త్వరగానే సూపర్​ క్వాలిటీలో ఫొటోలు పంపించగలుగుతారు.
  4. మీరు మీ బంధువుల నుంచి ప్రియమైన వారి నుంచి చాలా దూరంగా ఉంటే, ఈ ఫీచర్​ ద్వారా మీ లైఫ్​ అప్​డేట్స్​ను వారికి తెలియజేయవచ్చు.
  5. మీరు చాలా క్రియేటివ్ వర్క్​ ప్రాజెక్ట్​లో పనిచేస్తూ ఉంటే, మీరు కచ్చితంగా మంచి క్వాలిటీ ఇమేజ్​లను పంపించుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.