ETV Bharat / science-and-technology

త్వరలోనే భారత్​లో '5G'.. సెకన్లలోనే హెచ్​డీ సినిమా డౌన్​లోడ్​! - 5G in India

5G in India: దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరో కీలక ముందడుగు పడింది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ క్రమంలో 5G విషయంలో చాలా మందికి ఉన్న సందేహాలు తీర్చే ప్రయత్నమే ఇది.. దాంతోపాటు 5G ఉపయోగాలు కూడా ఓ సారి తెలుసుకుందా రండి.

5G in India:
5G in India:
author img

By

Published : Jun 16, 2022, 2:34 PM IST

5G in India: 5G సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై ఆఖరులో స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో 5G విషయంలో యూజర్లలో ఉన్న సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలిచ్చే ప్రయత్నమే ఇది. ఇందులో మీ ప్రశ్న/ సందేహం ఉందేమో చూసుకోండి. పనిలోపనిగా 5G ఉపయోగాల గురించి కూడా చదివేయండి!

  1. 5G అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సింపుల్‌గా, ఈజీగా సమాధానం చెప్పాలంటే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ కంటే వేగంగా, తక్కువ ల్యాగ్‌తో ఇంటర్నెట్‌ అందించే సర్వీసు అని చెప్పొచ్చు.
  2. 5G ఫ్రీక్వెన్సీ రేంజి గరిష్ఠంగా 24 GHz నుంచి 54 GHz మధ్య ఉంటుందని సమాచారం. 4జీ సంగతి చూస్తే ఈ ఫ్రీక్వెన్సీ రేంజి 600 MHz నుంచి 900 MHz వరకు ఉంది.
  3. 5Gలో లోబ్యాండ్, మిడ్‌ బ్యాండ్‌, హై బ్యాండ్‌ మిల్లీమీటర్‌ అని మూడు రకాల బ్యాండ్స్‌ ఉంటాయి. మన దేశంలో మిడ్‌ బ్యాండ్‌, హై బ్యాండ్‌ స్పెక్ట్రమ్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 4జీ కంటే దీని వేగం పది రెట్లు ఎక్కువ ఉండొచ్చట.
  4. 4జీలో డౌన్‌లోడ్‌ వేగం 150 ఎంబీపీఎస్‌ వరకు ఉంటే.. 5G వేగం 10 జీబీపీఎస్‌ వరకు ఉంటుందట. సుమారు 3 గంటల హెచ్‌డీ క్వాలిటీ సినిమాను 5Gలో సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు అంటున్నారు.
  5. 5G ప్లాన్స్‌ విషయంలో ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు. 4జీ ప్లాన్స్‌ కంటే ఎక్కువ ఉంటాయి అని మాత్రం చెప్పొచ్చు. అయితే 4జీ ప్లాన్స్‌, 5G ప్లాన్స్‌ ధరల్లో పెద్దగా మార్పు ఉండబోదని ఓ టెలికాం కంపెనీ అప్పట్లో పేర్కొంది.
  6. జులైలో 5G వేలం నిర్వహిస్తున్నారు. ఆ లెక్కన 2023 ప్రథమార్ధంలో దేశంలో 5G సేవలు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వేలం ప్రక్రియ పూర్తయిన రెండు నుంచి నాలుగు నెలల్లో సేవలు ప్రారంభమవుతాయని ఓ సర్వీసు ప్రొవైడర్‌ ప్రతినిధి గతంలో చెప్పారు.
  7. 5G కోసం కొత్తగా టవర్స్‌ ఏర్పాటు చేయనక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న టవర్స్‌ ద్వారానే 5G సిగ్నల్స్‌ను అందించనున్నారు.
  8. 5G సర్వీసులు కేవలం మొబైల్‌కి మాత్రమే అనుకోనక్కర్లేదు. దీనిని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎడ్జ్‌ కంప్యూటింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, క్లౌడ్‌ తదితర రంగాల్లో విరివిగా వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  9. 5G సేవలను ఆటోమేటడ్‌ గైడెడ్‌ వెహికల్స్‌, రోబోలు, మెషీన్లలోనూ వినియోగించబోతున్నారు. వీటితోపాటు వర్చువల్‌ రియాలిటీ, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ సాంకేతికతల్లోనూ 5Gని వినియోగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
  10. 5G వేగం ఎక్కువగా ఉండటం వల్ల భద్రత తక్కువగా ఉంటుందనే అసత్య ప్రచారం ఒకటి వాట్సాప్‌ యూనివర్శిటీల్లో చక్కర్లు కొడుతోంది. అయితే 4జీ కంటే 5Gలో భద్రత ఎక్కువగా ఉండేలా చర్చలు తీసుకుంటున్నట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి: వాట్సాప్​లో 'Hi' చెబితే చాలు.. క్షణాల్లో లోన్​ వచ్చేస్తుంది.. ఎలా అంటే?

మీ పాస్​వర్డ్​ సేఫేనా? హ్యాక్ అయిందో లేదో తెలుసుకోండిలా..!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.