అందం, అభినయం, తెలివి తేటలతో చాలా మంది సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవుతారు. ఇలా ప్రాచుర్యం పొందిన వారికి ఫాలోవర్లు కూడా ఎక్కువగానే ఉంటారు. చాలామంది ఫాలోవర్లు ఉన్నారంటే వారికి దగ్గర ఫాలోవర్స్‌ను ఆకర్షించే ఏదో ప్రత్యేకత ఉండనే ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని వ్యాపారులు, వారి చేత ప్రకటనలు ఇప్పిస్తుంటారు. ఇలా అడ్వటైజ్ చేసే వారినే ఇన్‌ఫ్లూయన్సర్ అంటారు. అయితే ప్రస్తుతం వర్చువల్ ఇన్‌ఫ్లూయన్సర్స్ హవా నడుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన ఓ వర్చ్‌వల్ ఇన్‌ఫ్లూయన్సర్ తన యజమానికి కోట్లు కురిపిస్తోంది. దాని పేరే రోజీ.
వర్చువల్ ఇన్‌ఫ్లూయన్సర్ అంటే ఏంటి?
వర్చువల్ ఇన్‌ఫ్లూయన్సర్ అనేది నిజంలా కనిపించే ఓ అబద్ధం. అచ్చం మనిషిని పోలిన విధంగా కనిపిస్తుంది. కానీ మనిషి కాదు. బొమ్మ అని అనుకోవాలంటే కనీసం వస్తువులాగా కూడా అనిపించదు. ఇది ఓ కల్పిత పాత్ర మాత్రమే. రోజీని చూస్తే మీరు కచ్చితంగా అమ్మాయి అనే అనుకుంటారు. తను యోగా చేస్తుంది. పుట్టినరోజు అని కేక్ మీద ఉండే క్యాండిల్‌ను ఆర్పుతుంది. ఇక రోజూవారి పనులు అయిన తినడం, చదవడం, స్విమింగ్, టబ్‌బాత్ లాంటివి అచ్చం మనుషులు చేసినట్లే చేస్తుంది. అందుకే ఫాలోవర్లు ఈమె ఫాలో అవుతున్నారు.
రోజీ సంపాదన ఎంత?
సామాజిక మాధ్యమాల్లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే ప్రకటలు కూడా బాగా వస్తాయి. ఇలా రోజీకి ఉన్న ఫాలోవర్లను చూసి సుమారు 100కుపైగా కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పటికే 8 పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకుంది రోజీ. వీటి ద్వారా తన యజమానికి ఏడాదికి రూ.6 కోట్లకు పైగా సంపాదించి పెడుతుందట. రోజీ సంపాదించే ఈ మొత్తం కొన్ని బహుళ జాతి కంపెనీల సీఈఓలు సంపాదించే దాని కంటే ఎక్కువ అని టెక్కీలు చెప్తున్నారు. కరోనా కారణంగా బాగా ప్రాచుర్యంలో వచ్చిన రోజీ.. సాధారణ ఇన్‌ఫ్లూయన్సర్‌ను మించి కోట్లు సంపాదిస్తుండడం గమనార్హం.
వర్చువల్ ఇన్ల్ఫూయన్సర్స్ పుట్టుక ఎలా..?
వచ్చువల్ ఇన్ఫ్లూయన్సర్స్లు మానవ మేథస్సు నుంచి పుట్టినవి. కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో 3డీ మోడలింగ్ టెక్నాలజీతో వీటిని తయారు చేస్తారు. అందమే ప్రామాణికంగా ఇవి రూపుదిద్దుకుంటాయి. కృత్రిమమేధతో ఇవి పని చేస్తాయి. వీటికి కేవలం కొన్ని పనులకు సంబంధించిన ప్రోగ్రామ్‌ను మాత్రమే రాస్తారు. దక్షిణ కొరియాకు చెందిన రోజీని సిడూస్ స్టూడియో ఎక్స్ తయారు చేసింది.
ఇదీ చూడండి: ఐటీ రీఫండ్ అంటూ మోసాలు.. ఆండ్రాయిడ్ యూజర్లే టార్గెట్!