Video Calling Feature On Twitter : ఎక్స్ (ట్విట్టర్) సీఈఓ లిండా.. త్వరలోనే ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో వీడియో కాలింగ్ (వీడియో ఛాట్) ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ ఫీచర్ వచ్చిన తరువాత యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను ఇతరులతో పంచుకోకుండానే వీడియో కాలింగ్ (Twitter Video Calling Feature) చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.
మస్క్ విజన్‌కు అనుగుణంగా
Elon Musk Vision For Twitter : ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. ఈ సోషల్ మీడియా యాప్‌ను ఎవ్రిథింగ్ యాప్‌గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే లిండా యాకరినో.. వీడియో కంటెంట్, పేమెంట్ సర్వీసెస్, సబ్స్క్రిప్షన్ లాంటి అనేక ఫీచర్లను ఎక్స్ ప్లాట్‌ఫాంలో పొందుపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు.
వీడియో కాల్ చేశాను!
Twitter Video Calling Feature : వాస్తవానికి ఈ వారం ప్రారంభంలో ఎక్స్ డిజైనర్ ఆండ్రియా కాన్వే.. ఎక్స్ వీడియో కాలింగ్ ఫీచర్ గురించి ఒక పోస్ట్ చేశారు. దానినే ఇప్పుడు లిండా యాకరినో ధ్రువీకరిస్తూ మరో పోస్టు పెట్టారు. వాస్తవానికి ఈ పోస్టులో నేరుగా వీడియో కాలింగ్ గురించి ఆమె స్పష్టంగా పేర్కొనలేదు.. కానీ 'ఇప్పుడే ఒకరికి ఎక్స్ ద్వారా కాల్ చేశాను' అని పేర్కొన్నారు. దీనితో వీడియో కాలింగ్ ఫీచర్ గురించి ఒక స్పష్టత ఇచ్చినట్లు అయ్యింది.
భారీ పోటీ ఉంది!
Twitter Competitors : ఇప్పటికే మార్కెట్లో జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్, యాపిల్ ఫేస్‌టైమ్ లాంటి అనేక ప్లాట్‌ఫాంలు.. వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఎక్స్‌లోనూ వీడియో కాలింగ్ ఫీచర్ తీసుకురావడం వల్ల కొత్తగా ఏం ఉపయోగం ఉంటుందని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.
డిజిటల్ హబ్
Twitter Features 2023 : విమర్శలు ఎన్ని వస్తున్నా.. ఎలాన్ మస్క్, లిండా ఆలోచనలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. వీరు ఎక్స్‌ను కేవలం ఒక సోషల్ మీడియా వేదికగా మాత్రమే చూడడం లేదు. వాస్తవానికి ఎక్స్‌ను ఒక రియల్ టైమ్ డిజిటల్ హబ్‌గా మార్చాలని భావిస్తున్నారు. ముఖ్యంగా మీడియా, కమ్యునికేషన్, ఆర్థిక లావాదేవీలు జరిపే వేదికగా దీనిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
లాంగ్ ఫార్మ్ వీడియో కంటెంట్
Twitter Long Video Duration : ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చిన తరువాత.. ఆ ప్లాట్‌ఫాంలో అనేక సరికొత్త మార్పులు చేశారు. మొదటిగా ఎక్కువ నిడివి గల వీడియోలను కూడా పోస్టు చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా ట్విట్టర్ బ్లూ ఫీచర్ ద్వారా యూజర్లు రెండు గంటల నిడివి గల వీడియోలను అప్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించారు. దీనిలో యాపిల్ కంపెనీ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకొని.. తమ సిరీస్ 'Silo' మొదటి భాగాన్ని ట్విట్టర్లో పోస్టు చేసింది.
మోనిటైజేషన్
Twitter Monetization : ఎక్స్ (ట్విట్టర్)లో మంచి యూజర్ ఫాలోయింగ్ ఉన్న కంటెంట్ క్రియేటర్లకు మోనటైజేషన్ ఎనేబుల్ చేశారు. దీని ద్వారా ఓ కంటెంట్ క్రియేటర్.. తాను దాదాపు 24,000 డాలర్ల వరకు సంపాదించానని చెప్పడం విశేషం.