ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో పంపిన ఫొటో క్వాలిటీ తగ్గిపోయిందా.. ఇకపై అలా జరగదు! - వాట్సాప్ కొత్త వర్షన్ 2023

మనందరి నిత్య జీవితంలో భాగమైపోయిన వాట్సాప్‌.. తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. తాజాగా మరికొన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఆ కొత్త ఫీచర్ల కోసం తెలుసుకుందాం రండి.

Upcoming Features of WhatsApp 2023
వాట్సాప్ కొత్త ఫీచర్లు
author img

By

Published : Feb 2, 2023, 1:05 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను పలకరిస్తుంటుంది. ఇటీవలే డిసెప్పియర్ మెసేజెస్, వన్​టైమ్ ఫొటోలాంటి కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా మరికొన్ని ఫీచర్ల​ను పరిచయం చేయబోతుంది.

వాట్సాప్ ఫొటో క్వాలిటీ..
వాట్సాప్​లో ఏదైనా ఫొటో పంపిస్తే దాని ఒరిజినల్ క్వాలిటీ అనేది తగ్గడం సహజం. అందువల్ల చాలా మంది ఫొటోను డాక్యుమెంట్​ రూపంలో షేర్​ చేసుకుంటుంటారు. ఇప్పుడు ఆ సమస్యకు చెక్​ పెట్టేలా వాట్సాప్​ డ్రాయింగ్ టూల్​ హెడర్​కు కొత్త టెక్నాలజీని చేర్చనుంది. దీని వల్ల యూజర్లు ఫొటో క్వాలిటీని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఫొటోను పంపించే ముందు ఒక టూల్ బార్​ కనిపిస్తుంది. ఈ టూల్ సహాయంతో ఫొటో క్లారిటీని యూజర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఒరిజినల్ క్వాలిటీ ఫొటోను పంపించుకోవచ్చు.

గ్రూప్ సబ్జెక్ట్ , డిస్క్రిప్షన్ పదాలలో మార్పు
వాట్సాప్​ గ్రూప్ సబ్జెక్ట్ పెట్టడానికి కేవలం 25 పదాలను మాత్రమే ఉపయోగించుకోగలం. అయితే అది ఇప్పుడు వంద అక్షరాల వరకు పరమితి పెంచనుంది​. దాంతో పాటు గ్రూప్ డిస్క్రిప్షన్​ పదాల పరిమితిని కూడా పెంచనుంది. ఇంతకు ముందు డిస్క్రిప్షన్​ రాయడానికి 512 అక్షరాలు మాత్రమే పరిమితి ఉండేది. ఇప్పుడు దానిని 2048 అక్షరాలకు పెంచనుంది వాట్సాప్.

కొత్త ఫాంట్ స్టైల్స్
యూజర్లు కొత్తరకం ఫాంట్లను ఉపయోగించుకునేందుకు వీలుగా మరో కొత్త ఫీచర్​ను అభివృద్ధి చేస్తోంది వాట్సాప్. కాలిస్టోగా, కొరియర్ ప్రైమ్, డామియన్, ఎక్సో 2, మార్నింగ్ బ్రీజ్ ఫాంట్‌లను వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్‌కు జోడించనుంది.

కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్ గ్రూప్‌లోని మెసేజ్​కు రియాక్ట్​ అయ్యేలా..
కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్ గ్రూప్‌లో వచ్చే మెసేజ్​లకు యూజర్లు స్పందించడం సాధ్యం కాదు. త్వరలో ఆ గ్రూపుల్లో మెసేజ్​లకు రిప్లై ఇచ్చేలా కొత్త ఫీచర్​ను వాట్సాప్ అందుబాటులోకి తేనుంది.

ఇవీ చదవండి:

అన్నింటికీ ఒకటే ఛార్జర్​.. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించే దిశగా భారత్ అడుగులు!

25 నిమిషాల్లో మొబైల్​ ఫుల్​ ఛార్జింగ్​.. 4K క్యూఎల్​ఈడీతో TV.. 'వన్​ప్లస్'​ కొత్త ప్రొడక్ట్​లు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.