Twitter Subscription Fees : ఎక్స్ (ట్విట్టర్) యూజర్లకు ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. త్వరలోనే ట్విట్టర్ ఖాతాాదారులు అందరి నుంచి నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే కనుక అమలు జరిగితే యూజర్లపై అదనపు ఆర్థిక భారం పడడం ఖాయం.
ఫీజు ఎంత ఉండవచ్చు!
X Subscription Fee : సబ్స్క్రిప్షన్ ఫీజు విధిస్తామని స్పష్టం చేసిన ఎలాన్ మస్క్.. అది ఎంత మేరకు ఉంటుందనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నవారికి అదనపు ఫీచర్లు కల్పిస్తారా? లేదా? అనే విషయాన్ని కూడా వెల్లడించలేదు.
నోట్ : ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్).. ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫీజు కింద నెలకు 8 డాలర్లు చొప్పున వసూలు చేస్తోంది.
భారీ ఆదాయం!
ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) వేదికలో 550 మిలియన్లకు పైగా మంత్లీ యూజర్స్ ఉన్నారని ఎలాన్ మస్క్ తెలిపారు. వీరు ఒక రోజులో కనీసం 100 నుంచి 200 మిలియన్ల పోస్టులు పెడుతున్నారని ఆయన వివరించారు. ఒక వేళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమలులోకి వస్తే.. ట్విట్టర్ (ఎక్స్) కంపెనీకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది.
బాట్స్‌ను నియంత్రించడానికే..
Benjamin Netanyahu And Elon Musk Meeting : ఎలాన్ మస్క్‌తో.. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహూ మాట్లాడుతూ.. 'సోషల్ మీడియా వేదికల్లో ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం (bots) బాట్స్. వీటిని నిరోధించాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. తాము కూడా ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా త్వరలో ఎక్స్ ఖాతాదారులకు నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు విధించనున్నామని పేర్కొన్నారు. ఇలా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రవేశపెట్టడం వల్ల బాట్లు ఉపయోగించి ఖాతాలు సృష్టించడం చాలా కష్టతరమవుతుంది మస్క్ అభిప్రాయపడ్డారు. ఎలా అంటే.. కొత్త ట్విట్టర్ ఖాతాలను తెరవాలనుకున్న ప్రతిసారీ.. కొత్త క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్‌తో.. రిస్క్!
AI Risk To Humanity : ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూతో.. ఎలాన్ మస్క్ 'కృత్రిమ మేధస్సు సాంకేతికత' (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ) వల్ల కలిగే ప్రమాదం గురించి చర్చించారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. ఏఐ సాంకేతికతను రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉందని మస్క్ అభిప్రాయపడ్డారు.
ఆదాయం భారీగా తగ్గింది.
Twitter Ad Revenue 2023 : అమెరికాలో ట్విట్టర్ ప్రకటనల ఆదాయం గత నెల ఏకంగా 60 శాతం వరకు పడిపోయింది. పౌర హక్కుల నేతలు, వినియోగదారుల సమూహాలు.. తమలాంటి పెద్దపెద్ద బ్రాండ్లపై దుష్ప్రచారం చేయడం, ఒత్తిడిలు తీసుకురావడం వల్లనే తమ ఆదాయం తగ్గుతోందని మస్క్ విమర్శించారు.
ద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహించడం లేదు!
Hate Speech In Twitter : ట్విట్టర్ వేదికలో ఇటీవల హేట్ స్పీచ్ (ద్వేషపూరిత ప్రసంగాలు), వర్గవైషమ్యాలు పెంచే పోస్టులు పెరిగిపోతున్నాయి. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. ఇలాంటి వాటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని స్పష్టం చేశారు.