ETV Bharat / science-and-technology

యూవీ శానిటైజర్​తో నిమిషాల్లోనే క్రిములు ఖతం! - UV Sterilizer features

కరోనాపై పోరులో భాగంగా పలు సంస్థలు కీలక ఆవిష్కరణలు చేస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్... యూవీ శానిటైజర్​ను తయారు చేసింది. ఇది బాక్టీరియాను 99 శాతం చంపేస్తుందని ఆ సంస్థ తెలిపింది. స్మార్ట్​ఫోన్లు, ఇయర్​ బడ్స్​, కళ్లద్దాలపై ఉండే ఈ క్రిములను కేవలం 10 నిమిషాల్లో అంతం చేస్తుందని స్పష్టం చేసింది.

sanitizer
పది నిముషాల్లో బాక్టీరియా పని ముగించేసే యూవీ శానిటైజర్!
author img

By

Published : Jul 10, 2020, 2:59 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

కరోనా భయంతో చేతులను శుభ్రంగా కడుక్కొంటున్నాం సరే. పదే పదే ఉపయోగించే ఫోన్, ఇయర్​ఫోన్లను మాత్రం పూర్తిగా పట్టిచుకోవడం మానేశాం. వీటి మీద ఉండే క్రిములు, బాక్టీరియా వల్ల మనం అనారోగ్యం పాలయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన యూవీ శానిటైజర్​ను విడుదల చేసింది శాంసంగ్​. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. బాక్టీరియాను, క్రిములను ఈ శానిటైజర్​ పరికరం 99 శాతం చంపేస్తుందని... కరెంట్ లేనప్పుడు ఉపయోగించుకునేలా వైర్​లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉన్నట్లు తెలిపింది.

launch
శాంసంగ్ యూవీ శానిటైజర్

" ఈరోజుల్లో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. అందుకే బాక్టీరియా, క్రిములను చంపేసే యూవీ శానిటైజర్ తయారు చేశాం. ఇది ఛార్జింగ్​ చేసుకొని వాడుకోవచ్చు. దీన్ని శాంసంగ్​ సీ&టీ తయారుచేసింది. జూన్ నెల నుంచే ఈ పరికరాన్ని పరిమితంగా శాంసంగ్ స్టోర్లలో అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు వాటిని విశ్వవ్యాప్తం చేశాం. ఈ శానిటైజర్ సాయంతో 10 నిమిషాల్లోనే ఎలక్ట్రానిక్ పరికరాలపై క్రిములను చంపేయొచ్చు"

-- శాంసంగ్ సంస్థ

ఈ శానిటైజర్​ పరికరానికి పైనా, కింద రెండు యూవీ లైట్లు ఉన్నాయి. ఇందులో మనం ఫోన్లు వంటి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పెట్టినప్పుడు అది 10 నిమిషాల్లో క్రిములను చంపేసి... ఆటోమేటిక్​గా ఆగిపోతుంది. ఇంటర్టెక్, ఎసీజీఎస్ సంస్థలు టెస్టులు నిర్వహించి ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ శానిటైజర్ సాయంతో ఈ-కోలీ, స్టాఫిలోకొకస్, కాండిడా ఆల్బికన్స్​ వంటి బాక్టీరియా, ఫంగస్ ముప్పును తప్పించుకోవచ్చని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఆటోమేటిక్​ శానిటైజర్​... తాకకుండానే చేతులు శుభ్రం

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.