వన్‌ప్లస్ సంస్థ నుంచి కొత్త నార్డ్ స్మార్ట్‌ఫోన్ జులై 21న భారత మార్కెట్లో విడుదల కానుంది. వర్చువల్ కార్యక్రమం నిర్వహించి ఫోన్‌ను ఆవిష్కరించనున్నారు. అయితే విడుదలకు ముందే స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల వివరాలు బయటకు వచ్చాయి. ఈవీఓఎంఏజీ.ఆర్ఓ అనే రొమేనియా వెబ్సైట్ ఈ వివరాలను ప్రచురించింది.
ధర..
8జీబీ ర్యామ్/128 జీబీ మెమోరీ వేరియంట్ ధర సుమారు రూ. 40,200గా ఉండనున్నట్లు వెబ్సైట్ వెల్లడించింది. ఫోన్ ధర 500 డాలర్ల లోపే ఉంటుందని వన్‌ప్లస్ ఇదివరకు ప్రకటించగా.. వెబ్సైట్లో మాత్రం 536 డాలర్లు(సుమారు)గా పేర్కొంది.
వెనుకవైపు మూడు కెమెరాలు(64 ఎంపీ ప్రైమరీ, 16 ఎంపీ, 2 ఎంపీ) ఉంటాయని వెబ్సైట్ స్పష్టం చేసింది. అయితే నార్డ్ ఫోన్‌కు వెనకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయని ఇదివరకు పలు కథనాలు వచ్చాయి. నార్డ్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8 ఎంపీ వైడ్ యాంగిల్, 5 ఎంపీ మాక్రో లెన్స్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ ఉండే అవకాశం ఉందని 'ఆండ్రాయిడ్ సెంట్రల్' వెబ్సైట్ పేర్కొంది.
రొమేనియన్ వెబ్సైట్ ప్రకారం నార్డ్ ఫీచర్లు
- 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో 6.55 అంగుళాల సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్డ్రాడన్ 765జీ ప్రాసెసర్(ఇదివరకే కంపెనీ ప్రకటించింది)
- హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా
- 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
5జీ సాంకేతికతతో వన్‌ప్లస్ నార్డ్ అందుబాటులోకి రానుంది. ప్రకాశవంతమైన నీలం, పుదీనా ఆకుపచ్చ, నలుపు, బూడిద రంగుల్లో ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.