పనిమీద బయటకెళ్లాం.. అనుకోకుండా ఛార్జింగ్ అయిపోయింది.. అప్పుడేం చేస్తాం? పక్కనే ఉన్న బస్ స్టేషన్, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్, షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన ఉచిత ఛార్జింగ్ పోర్టులను ఆశ్రయిస్తాం. అయితే ఇలా మనం బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ పాయింట్లు వినియోగిస్తే.. మీ డేటాకు ముప్పుందని తెలుసా? మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించే వీలుందని ఎవరైనా చెప్పారా?
జ్యూస్ జాకింగ్.. సైబర్ నేరాల్లో ఇటీవలె ఈ తరహా విధానాన్ని ఎక్కువగా అవలంబిస్తున్నారట కేటుగాళ్లు. ఈ టెక్నిక్‌తో అనుమానం రాకుండా మన ఫోన్ మన దగ్గర ఉండగానే సమాచారాన్ని బుట్టలో వేసుకోగలుగుతారు సైబర్ నేరగాళ్లు.