ETV Bharat / science-and-technology

టోల్​గేట్ ఛార్జీలు, ట్రాఫిక్ తప్పించుకోవాలా? సంక్రాంతి రిటర్న్ జర్నీలో ఇలా చేయండి - గూగుల్ మ్యాప్స్ టోల్ ఫ్రీ మార్గాలు

Toll Free Route Google Maps : సంక్రాంతి ప్రయాణాలు చేస్తున్నారా? హైవేపై రద్దీ, టోల్ ఛార్జీలతో విసిగిపోయారా? టోల్ చెల్లించకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణించాలని అనుకుంటున్నారా? అయితే, మీకు గుడ్​న్యూస్! ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే చాలు. అదేంటంటే?

Toll Free Route Google Maps
Toll Free Route Google Maps
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 2:25 PM IST

Toll Free Route Google Maps : సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణాలు అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సొంతూర్లకు వచ్చీపోయే సమయంలో రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్​లు, టోల్ ప్లాజాల వద్ద ఎదురుచూపులు, ఛార్జీల మోత వంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందే! అయితే, ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడేందుకు, టోల్ ఛార్జీలు తప్పించుకునేందుకు ఓ మంచి మార్గం ఉంది. దాన్ని పాటిస్తే డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.

Travel Without Toll Gates : డబ్బు, సమయం సేవ్ చేసుకోవాలంటే మీ వద్ద ఒక్క టూల్ ఉంటే చాలు. కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మీ రోడ్డు ప్రయాణాన్ని ఇక సాఫీగా మార్చుకోవచ్చు. టోల్ ఛార్జీలు లేని మార్గాలు, రద్దీ లేని రూట్లలో రయ్​రయ్​ అంటూ దూసుకెళ్లిపోవచ్చు. మరి ఆ టూల్ ఏంటోనని ఆలోచిస్తున్నారా? అదే 'గూగుల్ మ్యాప్స్'.

ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి!
గూగుల్ మ్యాప్స్ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ఫీచర్లతో రహదారులపై టోల్​ప్లాజాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించవచ్చు. ఆ టోల్స్​లో ఎంత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు, టోల్స్ లేని దారులనూ వెతుక్కోవచ్చు. ఆండ్రాయిడ్​తో పాటు ఐఫోన్​లోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కింది స్టెప్స్ ఫాలో అయ్యి టోల్ సమస్యలు లేని రూట్ వెతికేద్దాం పదండి.

  • గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీ జర్నీ స్టార్టింగ్, ఎండ్ పాయింట్లను ఎంటర్ చేయాలి.
  • టాప్ రైట్ కార్నర్​లో ఉన్న 3-డాట్ సింబల్​పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత 'ఆప్షన్స్​'పై క్లిక్ చేయాలి. అందులో 'అవాయిడ్ టోల్స్', 'అవాయిడ్ మోటర్​వేస్' అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి టాగల్​ను ఆన్ చేయాలి.
  • వెంటనే మీకు టోల్​గేట్లు లేని మార్గాలను గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది.
  • ఈ సెట్టింగ్స్​ను మీరు ఒక్కసారి ఆన్ చేసుకుంటే తర్వాతి నుంచి కూడా మీకు టోల్ గేట్లు లేని మార్గాలనే మ్యాప్స్ చూపిస్తుంది. అవసరం లేదంటే మీరు ఈ సెట్టింగ్స్​ను ఆఫ్ చేసేసుకోవచ్చు.

ఆ ఒక్కటి మైనస్!
పండగలకు ఇంటికి వెళ్లినవారికే కాకుండా తరచుగా ఈ మార్గాల్లో ప్రయాణించేవారికి సైతం ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే హైవేలను తప్పించుకోవడం సహా మంచి వ్యూ ఉండే మార్గాల్లో వెళ్లడం వల్ల ప్రయాణికులకు కొత్త అనుభూతి కలుగుతుంది. అయితే, హైవేలను వీడటం వల్ల ప్రయాణ సమయం కాస్త పెరుగుతుంది. డబ్బు సేవ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఇది చక్కటి ఆప్షన్.

గూగుల్​ మ్యాప్స్​లోనూ లైవ్​ లొకేషన్​ షేరింగ్​- ఎలాగో తెలుసా?

జీ-మెయిల్ యూజర్స్ తెలుసుకోవాల్సిన టాప్​-9 హిడెన్ ఫీచర్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.