Tips For QR Code Scanning Issues : ప్రస్తుత కాలంలో QR కోడ్‌లు కామన్ అయిపోయాయి. ఏ షాపులో చూసినా అవే దర్శనమిస్తున్నాయి. చిన్న వస్తువు మొదలు కొని పెద్దవి కొనేటప్పుడు కూడా వాటినే ఉపయోగించి చెల్లింపులు చేస్తున్నాం. ఇవి సమాచారాన్ని త్వరగా సులభంగా యాక్సెస్ చేయడంలో సాయపడతాయి. వీటిని స్కాన్ చేసినప్పుడు సంబంధిత సమాచారం క్షణాల్లో మన కళ్లముందు ఉంటుంది. అయితే.. కొన్ని సార్లు మీ ఫోన్లో వాటిని స్కాన్ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. మీరూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఈ 8 టిప్స్ పాటించి సులభంగా మీ క్యూర్ స్కానర్‌ను సెట్ చేసుకొండి.
1. QR కోడ్‌ని చెక్ చేయండి.
కోడ్ స్కానింగ్‌లో ఇబ్బందులు ఎదురైతే ముందుగా QR కోడ్‌ని చెక్ చేయండి. ఎందుకంటే కొన్ని కోడ్స్ అస్పష్టంగా, మరకలు పడి, చిరిగి ఉంటాయి. ఇలా ఉన్న వాటిని స్కాన్ చేయడంలో సమస్యలు వస్తాయి. అదే సమయంలో సరైన వెలుతురు ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి.
2. వేరే కోడ్స్‌ను స్కాన్ చేయండి
మీరు స్కాన్ చేయాల్సిన కోడ్ స్పష్టంగా ఉండీ అది స్కాన్ అవ్వకపోతే.. ఇతర QR కోడ్‌లను స్కాన్ చేసి చూడండి. ఒకవేళ ఇతర కోడ్‌లు విజయవంతంగా స్కాన్ అవుతే.. ప్రాబ్లమ్ మొదటి కోడ్‌లో ఉందని అర్థం. దాని గడువు ముగిసి ఉండవచ్చు. లేదా దాని డిజైన్ మార్చే ప్రయత్నంలో కోడ్ విషయంలో తేడా వచ్చి ఉండొచ్చు. లేదా ఆ కోడ్‌ను కూడా మీ ఫోన్ గుర్తించడంలో విఫలమైతే.. సమస్య మీ ఫోన్లోనే ఉందని అర్థం.
3. కెమెరా లెన్స్‌ను శుభ్రం చేయండి
ఏదైనా చూసినప్పుడు అస్పష్టంగా కనిపిస్తే .. కళ్లజోడుని తుడిచి మళ్లీ చూస్తాం కదా. అలాగే స్కానింగ్ విఫలానికి కెమెరా లెన్స్ కూడా ఓ కారణం కావచ్చు. వాటిపై ఉండే దుమ్ము, ఫింగర్ ప్రింట్స్ గుర్తులు, ఇతరత్రావి స్కాన్ చేసే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయి. కాబట్టి లెన్స్‌ను మైక్రోఫైబర్ క్లాత్ లేదా లెన్స్ క్లీనింగ్ సొల్యూషన్ ఉపయోగించి శుభ్రం చేయండి. ఈ సమయంలో వాటిపై స్క్రాచెస్ పడకుండా జాగ్రత్త పడండి.
4. కెమెరా ఫోకస్ అడ్జస్ట్ చేయండి
కెమెరా ఫోకస్ సరిగ్గా లేకపోవడం కూడా QR కోడ్ స్కాన్ అవ్వకపోవడానికి మరో కారణం. కాబట్టి స్కాన్ చేసే సమయంలో ఫోకస్‌ను కరెక్ట్‌గా అడ్జస్ట్ చేయండి. దీనికోసం అవసరానికి అనుగుణంగా ఫోన్‌ను దగ్గరగా, దూరంగా పెట్టి చూడండి. లేదా కెమెరాపై ఒకసారి ప్రెస్ చేసినా ఫోకస్ సెట్టవుతుంది.
5. కెమెరా యాప్‌ను చెక్ చేయండి
కెమెరా యాప్‌ని ఒకసారి ఓపెన్ చేసి అందులో QR కోడ్ స్కానర్ ఆప్షన్ ఎనేబుల్‌లో ఉందో లేదో చూడండి. కెమెరా రిజల్యూషన్ తక్కువగా ఉండి, ఫోన్లో ఎక్కువ యాప్స్ ఓపెన్ అయినా.. ఒక్కోసారి స్కాన్ అవ్వదు. అందుకే వాటన్నింటినీ క్లోజ్ చేసి మళ్లీ ప్రయత్నించండి. అది పనిచేయకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి. ఈ కాలంలో తయారైన స్మార్ట్‌ఫోన్‌లు కెమెరాలో స్కానర్‌లు కలిగి ఉంటాయి. అదే పాత మోడళ్లలో ఇలా లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఏర్పడవచ్చు.
6. గూగుల్ లెన్స్ ఉపయోగించండి
మీ ఫోన్లో గూగుల్ లెన్స్ యాప్‌ను ఓపెన్ చేయండి. అందులో పై నుంచే కెమెరా సింబల్‌పై ప్రెస్ చేస్తే గూగూల్ లెన్స్ యాప్ ఓపెన్ అవుతుంది. దాని కింద ఆప్షన్లలో QR కోడ్‌ను సెలెక్ట్ చేసుకుంటే అది దాన్ని స్కాన్ చేస్తుంది. మీ మెయిన్ కెమెరా ద్వారా స్కానింగ్‌కు ఇబ్బంది ఎదురైతే ఈ విధంగా కూడా ప్రయత్నించవచ్చు. అంతేకాకుండా.. ప్లే స్టోర్ లో గూగుల్ లెన్స్ యాప్ కూడా ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసి కూడా వాడుకోవచ్చు.
7. అప్లికేషన్ మేనేజర్‌ను ఒక సారి చెక్ చేయండి
QR కోడ్ స్కానింగ్ యాప్స్ ప్రభావవంతంగా పనిచేయాలంటే.. వాటికి నిర్దిష్ట అనుమతులు అవసరం. ముఖ్యంగా కెమెరా యాక్సెస్ తప్పనిసరి. కాబట్టి మీరు ఉపయోగిస్తున్న యాప్‌కు అవసరమైన అనుమతులు ఇచ్చారో లేదో చూసుకోండి. దీనికోసం మీ ఫోన్ లోని Settings ఓపెన్ చేసి Apps లేదా Application Manager పై క్లిక్ చేయండి. తర్వాత సంబంధిత యాప్‌ను ఎంచుకుని Permissions పై క్లిక్ చేసి చూడండి. ఒక వేళ ఏవైనా పర్మిషన్స్ ఇవ్వలేదేమో సరిచూసుకొండి.
8. ఫోన్ స్టోరేజీ చెక్ చేసుకోండి
కొన్ని యాప్స్ సరిగ్గా పని చేయాలంటే తగినంత స్టోరేజీ అవసరం. దీనికోసం ఉపయోగించని యాప్స్ తొలగించాలి. అంతేకాకుండా ఫోన్ లోని యాప్స్ క్యాచీ(cache) ఎక్కువ స్టోరేజీ ఆక్రమిస్తుంది. వీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం ద్వారా మనకు స్పేస్ మిగులుతుంది. QR కోడ్ల వినియోగం విరివిగా పెరిగిన ఈ కాలంలో.. వాటిని సమర్థవంతంగా స్కాన్ చేయగలగడం చాలా అవసరం. అందుకే స్కాన్ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే పైన పేర్కొన్న వాటిని పాటించి చూడండి. అయినప్పటికీ సమస్య ఉత్పన్నమవుతే.. ఒకసారి సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లి ఫోన్‌ను చెక్ చేయించుకోండి.
మీ ఫోన్ పోయిందా..? బెంగ వద్దు హాయ్ అని మెసేజ్ పెట్టండి గ్యారెంటీగా దొరుకుతుంది...!