ETV Bharat / science-and-technology

బ్రౌజర్​లోని చెత్తను తుడిచేయండిలా..!

Clear Browsing Data : ఇంట్లో చెత్త పేరుకుపోతే మనం శుభ్రం చేస్తాం ఇది సహజంగా చేసే పనే. అలానే మన అంతర్జాలంలో చెత్త పేరుకుపోతే ఎలా తొలగించాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఇదుగో ఈ చిట్కాలు చదివేయండి.

TIPS FOR CLEARING BROWSING DATA
TIPS FOR CLEARING BROWSING DATA
author img

By

Published : Aug 31, 2022, 8:16 AM IST

Clear Browsing Data : అంతర్జాలంలో ఎప్పుడూ ఏదో ఒక వెబ్‌సైట్‌ చూస్తూనే ఉంటాం. వస్తువులు కొంటుంటాం. బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తుంటాం. ఈ క్రమంలో బ్రౌజర్‌ మనం చూసిన వెబ్‌సైట్లు, వాడిన పాస్‌వర్డ్‌లు, డౌన్‌లోడ్‌ చేసిన పత్రాలు.. ఇలా ఎంతో సమాచారాన్ని సేకరించుకొని పెట్టుకుంటుంది. రాన్రానూ ఇది పీసీ మీద భారం పెరిగేలా చేస్తుంది. అందువల్ల బ్రౌజర్‌ క్యాచీని, కుకీలను, హిస్టరీని అప్పుడప్పుడు క్లీన్‌ చేసుకోవటం మంచిది. ఇది పీసీలో కొంత ఖాళీనీ సృష్టిస్తుంది. వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి చిక్కకుండా కాపాడుకోవచ్చు. అనవసర డేటాను తొలగించుకోవటం వల్ల కంప్యూటర్‌ వేగమూ పుంజుకుంటుంది.

కుకీలు, క్యాచీ, హిస్టరీలంటే?
ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసినప్పుడు కుకీస్‌ను అంగీకరించమని అడిగే పాపప్స్‌ను గమనించే ఉంటారు. వెనకా ముందు ఆలోచించకుండా చాలామంది వీటిని యాక్సెప్ట్‌ చేసి తర్వాత పనుల్లో మునిగిపోతుంటారు. ఇంతకీ కుకీలంటే? మనం చూసే వెబ్‌సైట్లు సృష్టించుకునే ఫైళ్లు. వెబ్‌సైట్‌ను చూస్తున్నప్పుడు, తిరిగి వాటిని తెరచినప్పుడు తేలికగా పనులు చేసుకోవటానికి వీలుగా ఇవి సమాచారాన్ని దాచి పెట్టుకుంటాయి. బ్రౌజర్‌ క్యాచీ ఏమో వెబ్‌సైట్‌ పేజీల్లో కొన్ని భాగాలను (ఫొటోల వంటి వాటిని) గుర్తుపెట్టుకుంటుంది. తిరిగి ఎప్పుడైనా ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లినప్పుడు అది త్వరగా లోడ్‌ కావటానికిది తోడ్పడుతుంది. గతంలో మనం చూసిన వెబ్‌సైట్ల జాబితాను హిస్టరీ నిక్షిప్తం చేసుకుంటుంది.

తొలగించుకోవటమెలా?
మన బ్రౌజింగ్‌ వివరాలు గోప్యంగా ఉంచుకోవాలని అనుకుంటే కుకీలు, క్యాచీ, హిస్టరీని క్లియర్‌ చేసుకోవటం మంచిది. అదెలాగో చూద్దాం.

గూగుల్‌ క్రోమ్‌లో..

  • పీసీలో క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి. పైన కుడివైపున కనిపించే మూడు చుక్కల బటన్‌ను నొక్కాలి.
  • డ్రాప్‌ డౌన్‌ మెనూలో 'మోర్‌ టూల్స్‌' ద్వారా 'క్లియర్‌ బ్రౌజింగ్‌ డేటా' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • బ్రౌజింగ్‌ హిస్టరీ, డౌన్‌లోడ్‌ హిస్టరీ, కుకీస్‌, ఇతర సైట్‌ డేటాలకు సంబంధించిన అన్ని బాక్సులను ఎంచుకోవాలి. కావాలంటే బేసిక్‌ సెటింగ్స్‌లోకి వెళ్లి రీచెక్‌ చేసుకోవచ్చు. టైమ్‌ రేంజ్‌ ఆప్షన్‌ ద్వారా ఎప్పట్నుంచి ఎప్పటివరకు బ్రౌజింగ్‌ వివరాలను డిలీట్‌ చేయాలో ఎంచుకోవచ్చు. అయితే క్యాచీని క్లియర్‌ చేసుకోవటంలో ఆల్‌టైమ్‌ను ఎంచుకోవటం మంచిది.
  • చివరికి 'క్లియర్‌ డేటా' బటన్‌ మీద క్లిక్‌ చేయాలి. అంతే. మొత్తం వివరాలు తొలగిపోతాయి.

సఫారీలో..

  • పైన కనిపించే మెనూ బటన్‌ ద్వారా హిస్టరీలోకి వెళ్లి ‘క్లియర్‌ హిస్టరీ’ని ఎంచుకోవాలి.
  • తర్వాత టైం పీరియడ్‌ను ఎంచుకొని ‘క్లియర్‌ హిస్టరీ’ మీద నొక్కాలి. బ్రౌజింగ్‌ హిస్టరీ, క్యాచీ మొత్తం డిలీట్‌ అవుతాయి.

మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో..

  • పైన కుడివైపు మూలకు కనిపించే హ్యాంబర్గర్‌ మెనూను క్లిక్‌ చేయాలి. సెటింగ్స్‌ ఆప్షన్‌ మీద నొక్కాలి.
  • ఎడమ వైపున జనరల్‌ సెటింగ్స్‌ కింద ఉండే 'ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ' విభాగాన్ని ఎంచుకోవాలి.
  • ఇందులో 'కుకీస్‌ అండ్‌ సైట్‌ డేటా' లోకి వెళ్లి, 'డిలీట్‌ కుకీస్‌ అండ్‌ సైట్‌ డేటా వెన్‌ ఫైర్‌ఫాక్స్‌ క్లోజ్డ్‌' బాక్స్‌ను ఎంచుకొని 'క్లియర్‌ డేటా' బటన్‌ను నొక్కాలి.
  • ప్రైవసీ విభాగంలో అలాగే కిందికి వెళ్తే హిస్టరీ ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. 'క్లియర్‌ హిస్టరీ వెన్‌ ఫైర్‌ఫాక్స్‌ క్లోజెస్‌' బాక్ల్‌ను ఎంచుకొని 'క్లియర్‌ హిస్టరీ' బటన్‌ను నొక్కాలి.

-ఒకసారి క్యాచీ, కుకీస్‌, హిస్టరీని తొలగించుకున్నాక ఆయా వెబ్‌సైట్లలోకి తిరిగి లాగిన్‌ కావాలి. ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ పీసీ వేగం పెరుగుతుంది.

ఇదీ చదవండి: పంపిన వారికి తెలియకుండా వాట్సాప్​ మెసేజ్​లు చదివేయండిలా
మీ జీమెయిల్​ ఖాతాలో వేరేవాళ్లు లాగిన్ అయ్యారని డౌటా, చెక్ చేయండిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.