ETV Bharat / science-and-technology

Threads New Feature : థ్రెడ్స్ నయా ఫీచర్​.. 90 రోజుల వరకు పోస్ట్​లు అలానే! - twitter vs meta

Threads New Feature : థ్రెడ్స్ తన యూజర్ల కోసం​ మరో నయా ఫీచర్స్​ తీసుకురానుంది. ఇప్పటి వరకు 30 రోజుల్లోనే పోస్టులు ఆటో-డిలీట్​ అవుతుండగా.. ఇకపై ఆ వ్యవధిని 90 రోజులకు పెంచే దిశగా సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం.

Meta Threads app to soon feature auto delete posts
Threads new feature
author img

By

Published : Jul 10, 2023, 5:38 PM IST

Threads New Feature : థ్రెడ్స్​ యాప్​ లవర్స్​కు గుడ్​ న్యూస్​. ఇప్పటి వరకు థ్రెడ్స్​ యాప్​లో కేవలం 30 రోజుల్లోనే పోస్టులు ఆటో డిలీట్ అయ్యేలా సెట్టింగ్ ఉండేది. కానీ ఇప్పుడు యాప్​లోని పోస్టులు 90 రోజుల తరువాత మాత్రమే ఆటో-డిలీట్​ అయ్యేలా ఓ కొత్త ఫీచర్​ను తీసుకువచ్చేందుకు మెటా సన్నాహాలు చేస్తోంది.

Threads craze Instagram : ఇన్​స్టాగ్రామ్​ అనుబంధ మెసేజింగ్​ యాప్​ థ్రెడ్స్​ ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్​ సంపాదించుకుంది. మోస్ట్​ పాపులర్ మెసేజింగ్ యాప్​ ట్విట్టర్​నే సవాల్​ చేస్తూ కేవలం రిలీజ్​ అయిన గంటల్లోనే 10 మిలియన్​ యూజర్​ బేస్​ను సంపాదించుకుంది. అంతే కాదు.. ఈ నయా మెసేజింగ్ యాప్​ ఇప్పటి వరకు 100 మిలియన్​ డౌన్​లోడ్స్​తో.. వెబ్​, యాపిల్​ స్టోర్​, గూగుల్ ప్లే స్టోర్స్​లో​ ట్రెండింగ్​లో ఉంది.

Threads app to soon feature auto delete posts : మెటా కంపెనీకి చెందిన థ్రెడ్స్​ యాప్​ను.. ఇన్​స్టాగ్రామ్​కు అనుబంధంగా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ట్విట్టర్​కు పోటీగా ఈ సరికొత్త సామాజిక మాధ్యమాన్ని తీసుకువచ్చినట్లు పబ్లిక్ టాక్​. ఇది అందరికీ తెలిసిన విషయమే.

థ్రెడ్స్ యాప్​లో పెట్టిన టెక్ట్స్​ పోస్టులపై.. యూజర్లు లైక్​, కామెంట్​ చేయవచ్చు. అదే విధంగా ఆ పోస్టులను రీపోస్ట్​ చేయగలరు. షేర్​ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కానీ థ్రెడ్స్​ యాప్​లోని పోస్టులు కేవలం 30 రోజులు మాత్రమే కనిపిస్తాయి. తరువాత అవి ఆటో-డిలీట్ అవుతాయి. ఇది యూజర్లకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే థ్రెడ్స్​ ఇప్పుడు ఈ ఆటో-డిలీట్​ ఫీచర్​ను 90 రోజులకు పెంచే విధంగా ఆలోచన చేస్తోంది. త్వరలో ఇది సాకారమయ్యే అవకాశం కూడా ఉన్నట్లు ఇన్​స్టాగ్రామ్ హెడ్​ ఆడమ్​ మొస్సేరి స్పష్టం చేశారు.

ఇన్​స్టాగ్రామ్​ యూజర్ నేమ్​తోనే..
థ్రెడ్స్​ యాప్​ను ఇన్​స్టాగ్రామ్ యూజర్​ నేమ్​తోనే ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇన్​స్టాగ్రామ్​లో మనం ఫాలో అవుతున్నవారినే ఇక్కడ కూడా ఫాలో కావచ్చు. ట్విట్టర్​లో టెక్ట్స్​ సైజు కేవలం 280 పదాలు మాత్రమే ఉండగా, థ్రెడ్స్​లో అక్షరాల పరిమితి 500 వరకు ఉంది. ఇది యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ట్విట్టర్​ వర్సెస్​ మెటా
Twitter vs Threads : ప్రపంచవ్యాప్తంగా థ్రెడ్స్​కు మంచి ఆదరణ లభిస్తున్న వేళ.. ట్విట్టర్ అధినేత ఎలాన్​ మస్క్​.. మెటా కంపెనీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మెటా తమ మాజీ ఉద్యోగుల ద్వారా ట్విట్టర్​ వాణిజ్య పరమైన రహస్యాలను దొంగిలించిందని ఆరోపించారు. అలాగే మేథోపరమైన హక్కులను ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. దీనిపై తాను న్యాయస్థానంలో పిటిషన్​ వేస్తానని మస్క్​ స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలను మెటా ప్రతినిథి ఆండీ స్టోన్​ తోసిపుచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.