ETV Bharat / science-and-technology

CES 2022: టెక్​ ప్రపంచంలో.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్​ గ్యాడ్జెట్లు - అమెరికా వార్తలు తాజా

CES 2022: అమెరికాలోని లాస్​ వెగాస్​లో ప్రముఖ కన్జూమర్​ ఎలక్ట్రిక్​ షో- 2022 ప్రారంభమైంది. వివిధ సంస్థలు ప్రదర్శనకు ఉంచిన అత్యాధునిక ఆవిష్కరణలు ఆకట్టుకుంటున్నాయి.

ces 2022
టెక్‌ ప్రపంచంలో ఒక్కోటి ఒక్కో రకం
author img

By

Published : Jan 5, 2022, 9:49 PM IST

CES 2022: ప్రపంచ అతిపెద్ద టెక్‌ సందడి (Consumer Electronics Show, CES-2022) మొదలైంది. జనవరి 5 నుంచి 7 వరకు జరిగే వరల్డ్‌ బిగెస్ట్‌ టెక్‌ షో అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు, టెక్‌ విద్యార్థులు వారి అత్యాధునిక ఆవిష్కరణలను తొలిరోజు వేదిక ముందు పెట్టారు. వాటిలో ఒక్కోటి ఒక్కో రకంగా.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ కట్టిపడేలా ఉన్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కెయండి..!

నిలబడ్డా కూర్చున్నట్టే..!

రోజంతా నిలబడి పనిచేసే సెక్యూరిటీగార్డు వంటి ఉద్యోగుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..! ఈ ఆలోచన నుంచే ఓ వ్యక్తి సరికొత్త సూట్‌ ఆవిష్కరణను సృష్టించారు. ఈ మేరకు దానిని టెక్‌ సదస్సు ముందుంచారు. ఎక్కోస్కెలిటన్‌ అని నామకరణం చేసిన ఈ సూట్‌ ధరించి నిలబడ్డా కూడా కూర్చునట్లే పనిచేసుకోవచ్చు. తద్వారా ఎటువంటి కీళ్ల నొప్పులు ఉండవు.

ces 2022
ఎక్కోస్కెలిటన్‌ సూట్

లిటిల్‌ స్పీకర్‌

స్పీకర్లు ఎందుకు పెద్దగా ఉండాలి..?అని అనుకున్నాడో ఏమో ఓ వ్యక్తి.. ఏకంగా మొబైల్స్‌ వెనక అతికించే లిడిల్‌ అనే బ్లూటూత్‌ స్పీకర్‌ను కనిపెట్టాడు. టెక్‌ సదస్సులో లిడిల్‌ స్పీకర్‌ పనితనాన్ని వివరించాడు. మాగ్నెటిక్‌ ఇంటర్‌ఫేస్‌తో వచ్చే ఈ స్పీకర్‌ బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌తో ఛార్జ్‌ అవుతుంది.

ces 2022
లిడిల్‌ స్పీకర్‌

సింగిల్‌ ఛార్జ్‌తో సుదూరం..

ప్రపంచం ఇప్పుడు నెట్‌ జీరో వెంట పరుగులు పెడుతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో కొత్తకొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వీటిలో భాగమే ఎలక్ట్రిక్‌ వాహనాలు. బ్యాటరీలతో ఉద్గారాల విషయాన్ని కాసేపు పెక్కనపెడితే! సింగిల్‌ ఛార్జ్‌తో 200 మైళ్లు ప్రయాణించే ఎలక్టిక్‌ బైక్‌ను 'డెల్‌ఫాస్ట్‌' అభివృద్ధి చేసింది. టెక్‌ సదస్సులో ఇది విశేష మన్ననలు అందుకుంటోంది.

ces 2022
'డెల్‌ఫాస్ట్‌' ఎలక్ట్రిక్​ బైక్‌

అలాగే ప్రపంచంలోనే తొలిసారి మంచులో దూసుకెళ్లే ఎలక్ట్రిక్‌ బైక్‌ 'మూన్‌బైక్స్‌ మోటార్స్‌‌'ను ఈ వేడుకలో ప్రదర్శించారు. మరోవైపు విజన్‌-ఎస్‌ 02 పేరుతో ప్రముఖ దిగ్గజ కంపెనీ సోని సీఈఎస్‌-2022లో సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేయనుంది.

ces 2022
'మూన్‌బైక్స్‌ మోటార్స్‌‌' ఎలక్ట్రిక్‌ బైక్‌

సాగుకు చేదోడుగా..

సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చచొచ్చు కదా..! పలువురి నోట తరచూ వినిపించే మాట ఇది. దీని ఆధారం చేసుకోనే నయో టెక్నాలజీస్‌ సంస్థ 'ఓజ్​' (OZ) పేరుతో ఓ రోబోట్‌ను అభివృద్ధి చేసింది. వ్యవసాయంలో కూలీల కొరతను తీర్చడానికి ఇదీ ఎంతో ఉపకరిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని ద్వారా వ్యవసాయ పనులను ఆటోమేట్‌ చేయవచ్చట. ఇదిలా ఉంటే.. మరో డైనమిక్‌ రోబోతో వేడుకకు వచ్చిన హుందాయ్‌ మోటర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ యుసన్‌ చుంగ్‌ కాసేపు అలరించారు.

ces 2022
నయో టెక్నాలజీస్‌ సంస్థ 'OZ' రోబో

అందంతో పాటే భద్రత!

మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మైఎలీ (MyEli) కంపెనీ ఓ బ్రాస్‌లెట్‌ తయారు చేసింది. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ బ్రాస్‌లెట్‌పై చిన్న ట్యాప్‌ చేస్తే చాలు.. సంబంధింత ఠాణాలకు సమాచారం వెళ్తుంది. చూడటానికీ బ్రాస్‌లెట్‌ చాలా అందంగా కనిపిస్తుంది.

ces 2022
'మైఎలీ' రూపొందించిన ప్రత్యేక బ్రాస్​లెట్​

పిల్లల సందడీ ఉందండోయ్‌..!

సీఈఎస్‌ 2022లో ఈసారి పిల్లల ఆట వస్తువుల సందడి కూడా ఉందండోయ్‌. ఈ మేరకు ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆవిష్కరించిన 'అమాగామి హామ్ హామ్' అనే ఆట బొమ్మ థెరప్యూటిక్ రోబోట్‌ మాదిరి పనిచేస్తుందట. చిన్నపిల్లలు ఈ బొమ్మ నోట్ల వేలు పెట్టి ఎంచక్కా ఆడుకోవచ్చు.

ces 2022
'అమాగామి హామ్ హామ్' ఆటబొమ్మ

గృహోపకరణాలు

గృహోపకరణాలకు సంబంధించి సీఈఎస్‌-2022లో అత్యాధునిక డిష్‌ వాషర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని 9 లీటర్ల నీటితో ఒకసారి మాత్రమే వినియోగించుకోవచ్చు.

ces 2022
అత్యాధునిక డిష్‌ వాషర్లు

రియాలిటీ చెక్‌..

వర్చువల్‌ రియాలిటీ చిత్రీకరణ కోసం తీర్చిదిద్దిన డ్యూయల్ ఫిష్-ఐ లెన్స్‌ (dual fish-eye lens ) కెమెరాను కెనాన్‌ (Canon) ఈ వేడుకలో ప్రదర్శించింది.

ces 2022
డ్యూయల్ ఫిష్-ఐ లెన్స్‌

సరికొత్త సెన్సర్‌..

టెక్నాలజీ యుగం దూసుకెళ్తోన్న వేళ మరో సరికొత్త పేపర్‌ నానో టెక్‌ సెన్సర్‌ను (paper nanotech sensor) అమెరికా చెందిన వ్యక్తి ఈ వేడుకలో ప్రదర్శించారు. వివిధ రకాల టచ్‌లెస్‌ టెక్నాలజీతో దీనిని వాడుకోవచ్చని పేర్కొన్నారు.

ces 2022
నానో టెక్​ సెన్సార్​

మరింత ర్యాపిడ్‌గా కరోనా టెస్టులు

సరికొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేసిన కరోనా ఫస్ట్‌ ర్యాపిడ్‌ టెస్టు కిట్‌ను 'టెస్ట్​ఎన్​పాస్' (TestNPass) ఈ వేడుకలో ప్రదర్శనకు పెట్టింది. సాధారణ టెస్టులతో పోలిస్తే ఇవీ వేగంగా కరోనా ఫలితాన్ని ఇస్తాయట.

ces 2022
'టెస్ట్​ఎన్​పాస్​' ర్యాపిడ్‌ టెస్టు కిట్‌

టెక్‌ మాస్క్‌

టెక్ సదస్సులో ఈ టెక్నాలజీ మాస్కు ఆకర్షణగా నిలిచింది. ఎయిర్​క్సామ్​ (Airxom) కంపెనీ తయారుచేసిన ఈ మాస్కు సేంద్రియ, రసాయన కాలుష్య కారకాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

ces 2022
'ఎయిర్​క్సామ్​' కంపెనీ తయారుచేసిన ఈ మాస్కు

బద్దకిస్టుల బ్రష్‌లు

టెక్నాలజీ అందరి అవసరాలను తీరుస్తుంది. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన చాలా ఆవిష్కరణలు ఆ కోవకు చెందినవే. కానీ, ఈ బ్రష్‌ మాత్రం బద్దకస్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం 10 సెకన్లలోనే దంతాల్ని శుభ్రం చేస్తుంది. బ్యాటరీ, యూఎస్‌బీ కేబుల్ సహాయంతో పని చేసే దీనికి 'ఫాస్టీష్‌ వై బ్రష్‌' అని పేరు పెట్టారు. అలాగే 'హమ్' ఎలక్ట్రిక్‌ తయారు చేసిన స్మార్ట్‌ టూత్‌ బ్రష్‌ మన బ్రషింగ్‌ అలవాట్లను ట్రాక్‌ చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ces 2022
'ఫాస్టీష్‌ వై బ్రష్‌'

ఇదీ చూడండి : వేరే దేశాల్లో అందుబాటులోకి వచ్చినా.. భారత్​లో విడుదల కాని మొబైల్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.