ETV Bharat / science-and-technology

రివ్యూ 2020: ఉత్తమ స్మార్ట్ డివైజ్​లు ఇవే... - యాపిల్ హోం ప్యాడ్ ఫీచర్లు

కరోనా వల్ల విధించిన లాక్​డౌన్​తో చాలా మంది ఇంట్లోనే ఉండటం, వర్క్​ ఫ్రం హోం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో పనిని మరింత సులభతరం చేసేందుకు ఈ ఏడాది పలు కొత్త డివైజ్​లను మార్కెట్లోకి తెచ్చాయి ఎలక్ట్రానిక్ కంపెనీలు. అందులో ఎక్కవగా ఉపయోగపడే కొన్ని స్మార్ట్ డివైజ్​లు, వాటి ఫీచర్ల వివరాలు మీ కోసం.

Best Iot Products in Market
ఉత్తమ స్మార్ట్ హోం ప్రోడక్ట్​లు
author img

By

Published : Dec 17, 2020, 1:51 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

దేశీయంగా స్మార్ట్​ ఫోన్లు, స్మార్ట్​ టీవీలు, హెడ్​సెట్​లు మినహా స్మార్ట్ డివైజ్​ల వినియోగం అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇటీవల స్మార్ట్ డివైజ్​ల వినియోగం కూడా పెరుగుతోంది. లాక్​డౌన్​లో చాలా మంది ఇంట్లోనే ఉండటం, వర్క్ ఫ్రం హోం వంటివి చేస్తుండటం వల్ల.. వీటి వినియోగం ఎక్కువైంది. ఇలా ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న, ఉపయోగకరమైన పలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) డివైజ్​ల గురించి తెలుసుకుందాం.

యాపిల్ హోమ్ పాడ్ మినీ

హోం పాడ్ మినీ స్పీకర్​.. యాపిల్ ఎస్​5 చిప్​సెట్​తో పని చేస్తుంది. ఇందులో పుల్ రేంజ్ డ్రైవర్స్, పెయిర్ ఆఫ్ ఫోర్స్ వంటివి ఉన్నాయి. ఫోర్స్ క్యాన్సెలింగ్ పాసివ్ రేడియేటర్స్ ఉండడం వల్ల స్పష్టమైన బేస్​ సౌండ్ వస్తుంది. ఈ స్పీకర్​లో కొత్తగా ఇంటర్​కామ్ ఫీచర్​ను పొందుపరిచింది యాపిల్. దీని ద్వారా ఇంట్లోనే వేర్వేరు గదుల్లో ఉన్న వారికి సందేశాలు పంపించే వీలుంది.

apple home pad mini
యాపిల్ హోమ్ పాడ్ మినీ

రియల్​మీ స్మార్ట్​ క్యామ్..

ఇది 360 డిగ్రీలు రికార్డ్​ చేసే హోం సెక్యురిటీ కెమెరా. ఇందులో కృత్రిమ మేధతో పని చేసే సెన్సార్లను పొందుపరిచింది రియల్​మీ. దీనితో గదిలో ఏవైనా అనుమానాస్పద కదలికలు ఉంటే.. వెంటనే యూజర్లను అలర్ట్​ చేస్తుంది. ఇందులో నైట్ విజన్​ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా రాత్రి పూట స్పష్టంగా వీడియో రికార్డ్ చేయగలదు. ఈ కెమెరాలో మైక్రో ఎస్​డీ కార్డ్ సపోర్ట్.. 128 జీబీ వరకు రికార్డింగ్ సదుపాయాలు ఉన్నాయి.

realme smart Cam
రియల్​మీ స్మార్ట్​ క్యామ్..

ఎంఐ రోబో వ్యాక్యూమ్-ఎంఓపీ పీ

షీయోమీ ఇటీవలే.. ఎంఐ 'రోపో వ్యాక్యూమ్​ ఎంఓపీ పీ'ని దేశీయంగా అవిష్కరించింది. దీని ధర రూ.24,999.

టూ ఇన్​ వన్​ స్వీపింగ్, మాపింగ్​ దీని ప్రత్యేకత. స్మార్ట్ యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. లేజర్ డిస్టెన్స్ సెన్సర్ ఫీచర్​ ద్వారా ఇతర వ్యాక్యూమ్​లతో పోలిస్తే మరింత మెరుగ్గా పని చేస్తుంది. వ్యాక్యూమ్​ కింద పడకుండా, ఇతర వస్తువులను ఢీ కొట్టకుండా 12 రకాల వేర్వేరు సెన్సార్లు దీనిని నియంత్రిస్తుంటాయి.

mi robot Vacuum
ఎంఐ రోబో వ్యాక్యూమ్

ఎకో డాట్ (4వ తరం):

ఎకో డాట్ (4వ తరం) అనేది అమెజాన్​ నుంచి వచ్చిన మరో అలెక్సా డివైజ్. ఇది అధునాతన కృత్రిమ మేధతో పని చేస్తుంది. దీని వల్ల అలెక్సా మరింత సహజంగా యూజర్లకు ఉపయోగపడుతుంది. 3.0 అంగుళాల ఊఫర్​, డ్యుయల్ ఫైరింగ్ ట్వీటర్స్​, డాల్బీ ప్రాసెసింగ్, డీప్​ బాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎకో డాట్ ధర రూ.4,499.

Eco dot
ఎకో డాట్

ఇదీ చూడండి:చైనా టెలికాం సామాగ్రికి చెక్​

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.