ETV Bharat / science-and-technology

భారత్‌లో వాడుతున్న కామన్ 'పాస్‌వర్డ్' ఇదేనట! - Most Used Passwords 2021

సాంకేతిక రంగంలో భారత్‌ దూసుకెళ్తున్నా.. పాస్‌వర్డ్ విషయంలో మాత్రం వెనుకంజలోనే ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. తేలికగా గుర్తుండేలా సులభమైన పాస్​వర్డ్​ వాడుతుండటం వల్ల ఆన్‌లైన్‌ నేరాల సంఖ్య పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు గ్లోబల్ పాస్‌వర్డ్ మేనేజర్ నార్డ్‌పాస్ పలు వివరాలు వెల్లడించింది.

Most Used Passwords
భారత్​లో కామన్​గా వాడుతున్న పాస్‌వర్డ్
author img

By

Published : Nov 20, 2021, 1:42 PM IST

కరోనా మహమ్మారి డిజిటల్ రంగంవైపు శరవేగంగా అడుగులు వేయించింది. దాంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్ తరగతులు, డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. ఇదే సమయంలో ఆన్‌లైన్‌ నేరాల సంఖ్య పెరుగుతోంది. అందుకే ప్రభుత్వాలు, అధికారులు నెట్టింటి రక్షణ కోసం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మన సైబర్ భద్రతలో పాస్‌వర్డ్‌లదే కీలక పాత్ర అని తెలిసిందే. వాటిని సైబర్‌ నేరగాళ్లు ఛేదించలేని విధంగా పెట్టుకోవడం మరీ ముఖ్యం. దీనిపై గ్లోబల్ పాస్‌వర్డ్ మేనేజర్ నార్డ్‌పాస్ పలు వివరాలు వెల్లడించింది. 50 దేశాల్లో ప్రజలు వాడుతున్న పాస్‌వర్డ్‌లను, వాటిని ఛేదించే సమయాన్ని వివరించింది.

భారత్‌లో ఎక్కువమంది పాస్‌వర్డ్‌గా 'password' అనే పదాన్నే ఉపయోగిస్తున్నారు. అలాగే 12345, 123456, 1234567, 12345678, 123456789, india123, 1234567890, qwerty, abc123ని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. వాటిలో india123 మినహా అన్నింటినీ ఒక సెకనులో క్రాక్‌ చేయగలరని పేర్కొంది. india123కి 17 నిమిషాల సమయం పట్టినట్లు చెప్పింది. 50దేశాల్లో 123456, 123456789, 12345 పాస్‌వర్డ్‌లను చాలా కామన్‌గా వాడుతున్నారు. qwerty, password తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. మన పాస్‌వర్డ్ ఎంత భద్రంగా ఉందో తెలియజేయడమే ఆ లెక్కల ఉద్దేశమని వివరించింది.

'ప్రజలు బలహీనమైన పాస్‌వర్డ్ ఉపయోగిస్తున్నారో, లేదో తెలుసుకొనేందుకు ఈ ఏడాది మళ్లీ ఆ సమయం వచ్చింది. 2021లో నిర్వహించిన పరిశోధన ప్రకారం టాప్‌ 200లో ఉన్న అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లను మీ ముందు ఉంచుతున్నాం. ఆ పాస్‌వర్డ్‌ను ఎన్నిసార్లు ఉపయోగించారు? ఎంత సమయం పడుతుందనేది ఈ జాబితాలో వివరించాం' అని నార్డ్‌పాస్‌ ఆ జాబితాను ట్విటర్‌లో షేర్ చేసింది. 'మన డిజిటల్‌ జీవితంలో పాస్‌వర్డ్‌లు గేట్‌వేలుగా పనిచేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నందున మన సైబర్‌ భద్రత మెరుగ్గా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దురదృష్టవశాత్తూ పాస్‌వర్డ్‌లు బలహీనపడుతున్నాయి. ప్రజలు ఇప్పటికీ వాటి విషయంలో సరైన శ్రద్ధ చూపడం లేదు' అని నార్డ్‌పాస్‌ సీఈఓ జోనాస్ కార్క్లీస్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు.

హ్యాకింగ్‌కు సాధ్యం కాకుండా, అంచనాలకు అందకుండా ఉన్నదాన్ని బట్టి పాస్‌వర్డ్ బలమెంతో నిర్ణయమవుతుంది. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పాస్‌వర్డ్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ముంబయి పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. మీమ్స్ ద్వారా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ల ఆవశ్యకతను వివరిస్తున్నారు.

ఇదీ చూడండి: మీ ఐఫోన్​ ఇకపై మీరే రిపేర్​ చేసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.