ETV Bharat / science-and-technology

Big billion day 2021: రూ. 49,999కే ఐఫోన్‌ 12..! - తక్కువ ధరకే ఐఫోన్​ 12

పండుగల నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లను తీసుకొస్తున్నాయి దేశీయ ఇ-కామర్స్​ సంస్థలు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐఫోన్ల గురించి. ఐఫోన్‌ 12ను(iphone 12 price in big billion day) ఎప్పుడూ లేనంత తక్కువ ధరకే(iPhone 12 price ) ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుండగా.. ఐఫోన్‌ 11, ఎక్స్‌ఆర్‌పై అమెజాన్‌ కూడా డిస్కౌంట్‌ అందిస్తోంది.

iphone-12
iphone-12
author img

By

Published : Oct 2, 2021, 8:20 PM IST

దేశీయ ఇ-కామర్స్‌ కంపెనీలు ఆఫర్ల పండగకు తెరతీశాయి. ఏటా మాదిరిగానే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పోటాపోటీగా మొబైళ్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించాయి. అక్టోబర్‌ 3 నుంచి అమెజాన్‌ 'గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌', ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' (big billion day)పేరుతో సేల్‌ను ప్రారంభించనున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఒకరోజు ముందుగానే ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐఫోన్ల(iPhone 12 price ) గురించి. ఐఫోన్‌ 12ను(iphone 12 price in big billion day) ఎప్పుడూ లేనంత తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుండగా.. ఐఫోన్‌ 11, ఎక్స్‌ఆర్‌పై అమెజాన్‌ కూడా డిస్కౌంట్‌ అందిస్తోంది.

iphone 12
రూ.49,999కే ఐఫోన్​

యాపిల్‌ ఐఫోన్‌ 12.. 64 జీబీ వేరియంట్‌ ₹49,999కే ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో(iPhone 12 price ) లభ్యమవుతోంది. వాస్తవానికి దీని అసలు ధర ₹65,990. తగ్గింపు ధరే కాకుండా ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుదారులు 10 శాతం అదనంగా డిస్కౌంట్‌ అందుకోవచ్చు. పాత ఫోన్‌ను కూడా ఎక్స్ఛేంజ్‌ చేసి ₹15,800 వరకు పొందొచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారో వారు ఈ డీల్‌పై ఓ లుక్కేయొచ్చు. ఐఫోన్‌ 13కి, ఐఫోన్‌ 12కి పెద్ద తేడా లేకపోవడం ఇందుక్కారణం. అదే ఐఫోన్‌ 13 కొనాలంటే ₹79 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అమెజాన్‌లో ఐఫోన్‌ 11.. ₹38,999కే లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డుదారులు 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. వాస్తవంగా ఐఫోన్‌ 11 ధర రూ.49,999. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ వాస్తవ ధర ₹38వేలు కాగా.. సేల్‌ సందర్భంగా ₹32,999కే అమెజాన్‌ విక్రయిస్తోంది. యాపిల్‌ ఫోన్లను కొనాలన్న కోరిక ఉన్న వారు ఈ డీల్స్‌ను పరిశీలించొచ్చు.

ఇదీ చూడండి: Iphone Storage: యాపిల్​లో 'టెరా బైట్' ట్రెండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.