అంతరిక్ష యానంలో తొలిసారిగా ఓ తెలుగు పేరు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 11న తమ అంతరిక్ష వాహక నౌక "యూనిటీ -22" ను ప్రయోగించనున్నట్లు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) ప్రకటించింది. ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రోన్సన్(Richard Branson)తో పాటు మరో ముగ్గురు అంతరిక్షంలో ప్రయాణించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ బృందంలో తెలుగు మూలాలు ఉన్న శిరీష బండ్ల(Shirisha Bandla).. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి (Vice President of the Virgin Galactic) హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు మూలాలున్న మహిళగా శిరీష చరిత్ర సృష్టించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శిరీష కుటుంబం.. వాషింగ్టన్లో స్థిరపడ్డారు. అక్కడే ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రో నాటికల్ ఇంజనీరింగ్‌లో శిరీష పట్టభద్రురాలు అయ్యారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం.. 2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్‌లో పలు కీలక బాధ్యతలను శిరీష నిర్వహిస్తున్నారు.
అంతరిక్ష ప్రయాణంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, అంతరిక్ష పర్యాటకంలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు.. బ్లూ ఆర్జిన్ (Blue Origin) సంస్థ ద్వారా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఈనెల 20న అంతరిక్ష ప్రయాణం చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ సంస్థకు పోటీగా వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) చేసిన ఈ ప్రకటన.. అందులో తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి భాగస్వామ్యం కావడం.. సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 11న "యూనిటీ -22" వాహక నౌక అంతరిక్ష ప్రయాణానికి సన్నద్ధమవుతోంది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రయోగం చేస్తున్నట్లు వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) తెలిపింది. వర్జిన్ గెలాక్టిక్ అందుకు కావలసిన అనుమతులను పొందింది.
-
Join us July 11th for our first fully crewed rocket powered test flight, and the beginning of a new space age.
— Virgin Galactic (@virgingalactic) July 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
The countdown begins. #Unity22
https://t.co/5UalYT7Hjb. @RichardBranson pic.twitter.com/ZL9xbCeWQX
">Join us July 11th for our first fully crewed rocket powered test flight, and the beginning of a new space age.
— Virgin Galactic (@virgingalactic) July 1, 2021
The countdown begins. #Unity22
https://t.co/5UalYT7Hjb. @RichardBranson pic.twitter.com/ZL9xbCeWQXJoin us July 11th for our first fully crewed rocket powered test flight, and the beginning of a new space age.
— Virgin Galactic (@virgingalactic) July 1, 2021
The countdown begins. #Unity22
https://t.co/5UalYT7Hjb. @RichardBranson pic.twitter.com/ZL9xbCeWQX
ఇదీ చదవండి: Johnson&Johnson: 'డెల్టాపై సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రభావం భేష్'