Telegram Story Feature : టెలిగ్రామ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. టెలిగ్రామ్ ప్రైమ్ యూజర్లు ఇకపై ఇన్స్టాగ్రామ్ తరహా కథనాలను పోస్ట్ చేయడానికి వీలుగా సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ చూడడానికి ఫేస్బుక్, స్నాప్‌చాట్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న మాదిరిగానే కనిపిస్తుంది. కానీ వాటితో పోల్చితే టెలిగ్రామ్‌లో యూజర్ ప్రైవసీ ఆప్షన్లు బాగున్నాయి. ప్రస్తుతం ప్రీమియం చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరు యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్లు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డ్యూరోవ్ తెలిపారు.
టెలిగ్రామ్ యూజర్లు ఇకపై తమ ఫొటోలను, వీడియోలను స్టోరీలుగా పెట్టవచ్చు. అయితే ఇవి నిర్దిష్ట సమయం తరువాత ఆటోమేటిక్‌గా కనుమరుగవుతాయి. మరో కీలకమైన అంశం ఏమిటంటే, యూజర్లు తమ స్టోరీలకు ఇమేజ్‌లు, వీడియోలను యాడ్ చేసుకోవచ్చు. అలాగే తమ స్టోరీలకు ఎక్స్టర్నల్ లింక్‌లను, క్యాప్షన్లను పెట్టుకోవచ్చు. అలాగే తమ స్టోరీలను ఇతర వ్యక్తులకు ట్యాగ్ కూడా చేసుకోవచ్చు. ఇతరులు పెట్టిన స్టోరీలకు రియాక్ట్ కావచ్చు, కామెంట్స్ కూడా పెట్టవచ్చు.
టాప్‌లో కనిపిస్తాయ్!
Telegram story update : టెలిగ్రామ్ స్టోరీలు యాప్ స్క్రీన్‌లో టాప్ కార్నర్లో కనిపిస్తాయి. ఇది చూడడానికి ఇన్స్టాగ్రామ్ స్టోరీలానే కనిపిస్తుంది. కానీ ఇది ఇన్‌స్టా అంత స్పేస్‌ను తీసుకోదు. మరో కీలకమైన అంశం ఏమిటంటే, టెలిగ్రామ్ వీడియో మెసేజ్ ఫీచర్ ద్వారా మీరు మీ ఫోన్ ఫ్రంట్, రియర్ కెమెరాలను ఒకేసారి ఉపయోగించి, ఫొటోలను, వీడియోలను షేర్ చేయవచ్చు.
సమయం నిర్దేశించుకోవచ్చు!
Telegram story timeline update : సాధారణంగా ఇతర యాప్‌ల్లోని స్టోరీలు 24 గంటల తరువాత ఆటోమేటిక్‌గా రిమూవ్ అవుతాయి. కానీ టెలిగ్రామ్‌లో ప్రీమియం సబ్స్క్రైబర్లు.. 4 ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 6 గంటలు, 12 గంటలు, 24 గంటలు, 48 గంటలు చొప్పున సమయాన్ని నిర్దేశించుకోవచ్చు. ఈ నిర్దేశిత సమయం తరువాత అటోమేటిక్‌గా స్టోరీలు రిమూవ్ అవుతాయి.
ఎవరికి కనిపించాలో నిర్ణయించవచ్చు!
Telegram story privacy update : టెలిగ్రామ్ యూజర్లు తమ స్టోరీలు ఎవరికి కనిపించాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం తమ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న సెలెక్టెడ్ మెంబర్స్‌కు మాత్రమే స్టోరీలు కనిపించేలా నిర్దేశించుకోవచ్చు. అలాగే యూజర్లు తమ స్టోరీలను నిర్దిష్ట వ్యక్తులు చూడకుండా కూడా నిరోధించవచ్చు. ఇందుకోసం మీరు హిడెన్ లిస్ట్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి టెలిగ్రామ్ యూజర్లు అందరూ స్టోరీలను చూడవచ్చు. కానీ కేవలం ప్రైమీయం మెంబర్స్ మాత్రమే ఈ స్టోరీలను పెట్టగలరు. త్వరలో ఇది సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
టెలిగ్రామ్ ప్రీమియం మెంబర్షిప్
Telegram premium price : ప్రస్తుతం టెలిగ్రామ్ ప్రీమియం మెంబర్షిప్ పొందాలంటే నెలకు రూ.319 చెల్లించాలి. లేదా సంవత్సర చందా రూ.2,399 చెల్లించాల్సి ప్రీమియం మెంబర్షిప్ పొందవచ్చు.