ETV Bharat / science-and-technology

టెలిగ్రామ్ కొత్త ఫీచర్​.. 'వాయిస్​ చాట్​​ 2.0'! - .వాయిస్ చాట్‌లు రికార్డ్

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ 'వాయిస్ చాట్​ 2.0' ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాయిస్ చాట్‌లు రికార్డ్ చేయడం సహా.. పాల్గొనేవారిని ప్రత్యక్ష లింక్‌ల ద్వారా ఆహ్వానించడం, వారి జాబితా, వాయిస్ చాట్ టైటిల్స్​ ఫీచర్లను జోడించింది.

Telegram launched Voice Chats 2.0 with new features
టెలిగ్రామ్ నూతన ఫీచర్​.. 'వాయిస్​ చాట్​​ 2.0'!
author img

By

Published : Mar 23, 2021, 7:08 AM IST

ప్రముఖ మెసెంజర్ యాప్ టెలిగ్రామ్.. తన ఛానెళ్లలో అపరిమిత లైవ్ వాయిస్ చాట్ సెషన్‌లు నిర్వహించుకునేందుకు వీలుగా 'వాయిస్ చాట్స్ 2.0' పేరిట సరికొత్త ఫీచర్​ను పరిచయం చేసింది. వినియోగదారుల వ్యక్తిగత ఖాతాల గోప్యతకు భంగం కలగకుండా ఈ ఫీచర్​ని రూపొందించామని కంపెనీ తెలిపింది.

టెలిగ్రామ్ వాయిస్​ చాట్​​లో కొత్త ఫీచర్లు

ఈ ఫీచర్​తో ప్రత్యక్ష వాయిస్ చాట్ సెషన్లను రికార్డ్ చేసుకోవచ్చు. సెషన్ ముగియగానే రికార్డు అయిన ఫైల్స్​ ఆటోమేటిక్​గా మన ఫోన్​/కంప్యూటర్​లో సేవ్ అవుతాయి. అంతేగాక.. ఛానెల్‌ళ్లలో అపరిమితంగా ప్రత్యక్ష వాయిస్ చాట్ సెషన్‌లను సైతం నిర్వహించుకోవచునేలా రూపొందించారు. 2020 డిసెంబర్‌లో ప్రారంభించిన టెలిగ్రామ్ గ్రూపులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది.

మరికొన్ని..

ప్రత్యక్ష చాట్ సెషన్‌ సమయంలో మ్యూట్​లో ఉన్నవారు మాట్లాడాలనుకుంటే తమ చేతిని పైకెత్తవచ్చు. దీంతో అడ్మిన్​లు వీరిని సులభంగా గుర్తించటానికి వీలవుతుంది. పబ్లిక్ గ్రూపులు, ఛానెళ్ల నిర్వాహకులు వాయిస్ చాట్‌కి సంబంధించిన ఆహ్వాన లింక్‌లను పంపవచ్చు. అంతేగాక.. సెలబ్రిటీలు వారి వ్యక్తిగత ఖాతాలకు బదులుగా టెలిగ్రామ్‌లో ప్రత్యేకంగా పబ్లిక్ ఛానల్ పేరుతో వాయిస్ చాట్‌లో చేరవచ్చు.

వినియోగదారులు ఒక సందేశాన్ని ఫార్వార్డ్ చేసిన సందేశాన్ని రద్దు చేసుకోవచ్చు.. లేదా పంపేముందు గ్రహీతనూ మార్చుకోనే ఫీచర్​నూ అందుబాటులోకి తెచ్చారు.

ఇదీ చదవండి: టెలిగ్రాంలో వాట్సాప్​ తరహా ఫీచర్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.