ETV Bharat / science-and-technology

స్పేస్​ఎక్స్​ తొలి ప్రైవేటు స్పేస్​ టూర్​ విజయవంతం - స్పేస్​ ఎక్స్​ ప్రత్యేకతలు

స్పేస్ఎక్స్ తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. నలుగురు యాత్రికులతో కూడిన తొలి అంతరిక్ష వాహకనౌక మూడు రోజుల పర్యటన అనంతరం శనివారం సాయంత్రం సురక్షితంగా భూమిని చేరింది. వ్యోమగాములున్న క్యాప్సుల్​ ప్యారాచూట్​ల సాయంతో ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రంలో క్షేమంగా ల్యాండ్ అయ్యింది.

SpaceX capsule
స్పేస్​ ఎక్స్ క్యాప్సుల్​
author img

By

Published : Sep 19, 2021, 6:52 AM IST

Updated : Sep 19, 2021, 12:43 PM IST

స్పేస్​ ఎక్స్ అంతరిక్ష యాత్ర సక్సెస్​

అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్​ఎక్స్ మరోసారి చరిత్ర సృష్టించింది. మూడు రోజుల క్రితం.. నలుగురు యాత్రికులతో అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్​ఎక్స్​ వాహక నౌక శనివారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) సురక్షితంగా భూమిని చేరింది. పారాచూట్​ల సహాయంతో ఫ్లోరిడాలోని అట్లాంటిక్​ సముద్రంలో ఈ అంతరిక్షనౌక క్షేమంగా దిగింది. అందులోని వ్యోమగాములు కూడా పూర్తి సురక్షితంగా ఉన్నారు. అయితే వారంతా కొన్ని గంటలపాటు.. వైద్యులు, నిపుణుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు స్పేస్​ ఎక్స్​ వర్గాలు వెల్లడించాయి.

Space Capsule landing in Sea
సముద్రంలో దిగుతున్న క్యాప్సుల్​

ప్రయాణం ఇలా..

అంతరిక్ష పర్యటనల కోసం స్పేస్​ ఎక్స్​ తీర్చిదిద్దిన వాహక నౌక డ్రాగన్ 'స్పేస్ క్యాప్సూల్‌' ద్వారా.. షిఫ్ట్-4 పేమెంట్స్ అనే డిజిటల్ పేమెంట్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు 38 ఏళ్ల జారెడ్ ఐజాక్‌మన్ సహా.. సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్‌ వైద్యాధికారిణి హేలీ ఆర్సెనాక్స్‌, డేటా ఇంజినీర్ క్రిస్ సెంబ్రోస్కీ, 51ఏళ్ల టీవీ నటి సియాన్ ప్రోక్టర్ బుధవారం రాత్రి అంతరిక్షంలోకి వెళ్లారు. ఫ్లోరిడాలోని 'కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి వీరి యాత్ర ప్రారంభమైంది.

వ్యోమగాములున్న క్యాప్సుల్​.. అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్​ఎస్​)ను దాటి 160 కిలో మీటర్ల ఎత్తులో భూమి చుట్టు భ్రమం చేసింది. ఈ క్యాప్సూల్​కు అమర్చిన భారీ అద్దం ద్వారా భూమిని వీక్షించారు అందులోని స్పేస్​ టూరిస్టర్లు. 'ఇన్​స్పిరేషన్-4' అనే ఈ మిషన్​లో భాగంగా అంత ఎత్తులో (540 కిలో మీటర్లు).. మూడు రోజుల పాటు గడిపారు ఈ నలుగురు యాత్రికులకు. ఈ ఎత్తులో వారంతా జీరో గ్రావిడీని అనుభూతి చెందారు.

Astronauts in Zero Gravity
జీరో గ్రావిటీలో వ్యోమగాములు

స్పేస్​ ఎక్స్ నిర్వహించిన మొదటి ప్రైవేటు రైడ్​ ఇదే కావడం గమనార్హం. పరిశోధకులు కాకుండా పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు స్పేస్​లో ఇంత ఎక్కువ సమయం గడపడం చరిత్రలో ఇదే ప్రథమం. ఈ నలుగురిలో ఎవరికీ ఇంతకముందు వ్యోమగాములు/అంతరిక్ష యాత్ర చేపట్టిన అనుభవం లేకపోవడం విశేషం. స్పేస్ టూర్​కోసం వీరంతా ఆరు నెలలు ప్రత్యేక శిక్షణ పొందారు.

ఆనందోత్సాహాలు..

తొలి ప్రైవేటు స్పేస్​ టూర్ విజయవంతమైన నేపథ్యంలో వ్యోమగాములు సహా స్పేస్​ఎక్స్​ వర్గాల్లో సంబురాలు మిన్నంటాయి. ఈ మిషన్​లో భాగమైన వారందరికీ స్పేస్​ ఎక్స్​ సీఈఓ ఎలాన్​ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: SpaceX project: అందరికీ రోదసియానం- 15న కీలక ప్రయోగం!

Last Updated : Sep 19, 2021, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.