ETV Bharat / science-and-technology

రోదసిలోకి నలుగురు వ్యోమగాములు.. దూసుకెళ్లిన స్పేస్​ఎక్స్ ఫాల్కన్ రాకెట్​​

author img

By

Published : Mar 2, 2023, 3:17 PM IST

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పని చేసేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన బృందం రోదసిలోకి వెళ్లింది. ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారా స్పేస్‌ఎక్స్‌ సంస్థ వీరిని నింగిలోకి పంపింది. ఇందులో అమెరికాకు చెందిన ఇద్దరు, యూఏఈ, రష్యాకు చెందిన ఒక్కో వ్యోమగామి ఉన్నారు. రోదసీలోకి వెళ్లిన యూఏఈకి చెందిన రెండో వ్యోమగామిగా సుల్తాన్ అల్-నెయాది ఖ్యాతినార్జించారు.

spacex crew 6 launch
రాకెట్​ ప్రయోగం

నాసా కోసం నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ నింగిలోకి పంపింది. స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ రాకెట్‌ వీరిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. అమెరికా, రష్యా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన వ్యోమగాములు ఈ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు.

రోదసీలోకి వెళ్లిన యూఏఈకి చెందిన రెండో వ్యోమగామిగా సుల్తాన్ అల్-నెయాది ఖ్యాతినార్జించారు. ఈ నేపథ్యంలో యూఏఈకి చెందిన సుమారు 80 మంది ప్రేక్షకులు ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించారు. యూఏఈలోని పాఠశాలలు, కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆరు నెలల పాటు సుల్తాన్‌ అల్‌ నెయాది అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించనున్నారు. సౌదీ యువరాజు సుల్తాన్ బిన్ సల్మాన్ 1985లో డిస్కవరీ షటిల్‌లో ప్రయాణించి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి అరబ్‌గా ఖ్యాతినార్జించారు.

ఫాల్కన్‌ రాకెట్‌లో యూఏఈ వ్యోమగామితో పాటు రిటైర్డ్ నేవీ సబ్‌మెరైనర్‌, నాసాకు చెందిన స్టీఫెన్ బోవెన్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాజీ రీసెర్చ్ సైంటిస్ట్ వారెన్ వుడీ హోబర్గ్, రష్యన్ వైమానిక దళం నుంచి పదవీ విరమణ చేసిన స్పేస్ రూకీ ఆండ్రీ ఫెడ్యావ్ ఉన్నారు. వీరంతా అక్టోబర్‌ నుంచి అంతరిక్ష కేంద్రంలో సేవలు అందిస్తున్న అమెరికా, రష్యా, జపాన్‌ బృందాన్ని భర్తీ చేయనున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విషయంలో ఇంకా అమెరికా, రష్యా కలిసే పని చేస్తున్నాయి.

spacex crew 6 launch
నింగిలోకి దూసుకెళ్తున్న పాల్కన్​ రాకెట్

రికార్డుల రారాజు..
వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించి.. కక్ష్యలో ప్రవేశపెట్టి, విజయవంతంగా తిరిగి నేలపైకి తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రైవేటు కంపెనీ స్పేస్​ఎక్స్​. అంతేగాక ఇంటర్నేషనల్ అంతరిక్ష కేంద్రానికి వ్యోమనౌకను పంపిన తొలి ప్రైవేట్ కంపెనీగా స్పేస్​ఎక్సే నిలిచింది. కక్ష్యలోకి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను పంపింది కూడా స్పేస్​ఎక్స్ కంపెనీనే. అంతరిక్ష ప్రయోగ రంగాన్ని విప్లవాత్మక మలుపు తిప్పిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీ కేవలం 20 ఏళ్లలోనే ఎన్నో విజయాలను సాధించింది.

spacex crew 6 launch
నింగిలోకి దూసుకెళ్తున్న పాల్కన్​ రాకెట్
spacex crew 6 launch
ఫాల్కన్ రాకెట్
spacex crew 6 launch
వ్యోమగాములు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.