ETV Bharat / science-and-technology

సెప్టెంబరులో వచ్చే స్మార్ట్‌ ఫోన్స్‌ ఇవే..!

వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్​ఫోన్ల విడుదల చేస్తాయి మొబైల్​ తయారీ సంస్థలు. అయితే ఈ సారి సెప్టెంబరు నెలలో ఐఫోన్‌, శాంసంగ్​, రియల్​మీ, రెడ్​మీ సహా పలు సంస్థ కొత్త ఫోన్లను విడుదల చేయనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Smartphones to be released in September
సెప్టెంబరులో వచ్చే స్మార్ట్‌ ఫోన్స్‌
author img

By

Published : Aug 30, 2021, 3:45 PM IST

కొత్త నెల వచ్చేస్తోంది.. మరి ఆ నెలలో ఏయే మొబైల్స్‌ వస్తున్నాయో తెలుసుకోవాలి కదా. అందుకే ఈ లిస్ట్‌తో మీ ముందుకొచ్చాం. సెప్టెంబరులో మార్కెట్‌లోకి వస్తాయని సమాచారం ఉన్న స్మార్ట్‌ఫోన్ల వివరాలివీ..

శాంసంగ్‌ గెలాక్సీ ఏ 52 ఎస్‌

శాంసంగ్‌ నుంచి సెప్టెంబరులో కొత్త 5జీ ఫోన్‌ రాబోతోంది. గెలాక్సీ ఏ 52ఎస్‌ పేరుతో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ఇందులో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778 ప్రాసెసర్‌ ఇస్తున్నారట. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌ ఉంటుంది. వెనుకవైపు 64 ఎంపీ మెయిన్‌ కెమెరా ఇస్తున్నారు. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఉంటుంది. 6 జీబీ ర్యామ్‌, 8 జీబీ ర్యామ్‌ వెర్షన్లు ఉంటాయి. ఈ మొబైల్‌లో వాటర్‌ రెసిస్టెన్స్‌ సదుపాయం ఉంటుందని సమాచారం. ఆమోలెడ్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఈ మొబైల్‌ ధర సుమారు ₹35 వేలు ఉంటుందని భోగట్టా.

Smartphones to be released in September
శాంసంగ్​ గెలాక్సీ ఏ 52 ఎస్​

రెడ్‌మీ 10 ప్రైమ్‌

ప్రపంచ మార్కెట్‌లో రెడ్‌ మీ 10 పేరుతో లాంచ్‌ అయిన మొబైల్‌ను రెడ్‌మీ 10 ప్రైమ్‌గా మన దేశంలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబరు 3న ఈ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఇందులో మీడియాటెక్‌ జీ88 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 50ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్‌ చేస్తుంది. దీని ధర సుమారు ₹10 వేలు - ₹12 వేలు ఉంటుందని అంచనా.

Smartphones to be released in September
రెడ్​మీ 10 ప్రైమ్​

జియో ఫోన్‌ నెక్స్ట్‌

జియో నుంచి సెప్టెంబరు నెలలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ రాబోతోంది. దీనిని గూగుల్‌ ప్రత్యేకంగా రూపొందించిన ఓఎస్‌తో సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబరు 10న ఈ మొబైల్‌ లాంచ్‌ చేయొచ్చు. దీని ధర ₹3 వేల నుంచి ₹4 వేలు వరకు ఉంటుందని అంచనా. హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. కీప్యాడ్‌ ఫోన్స్‌ వాడుతున్న వారిని స్మార్ట్‌ఫోన్‌లవైపు తీసుకురావడమే ఈ మొబైల్‌ ఉద్దేశం. ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్‌ గో వెర్షన్‌ ఓఎస్‌ మీద రన్‌ అవుతుంది. 2జీబీ ర్యామ్‌, 3 జీబీ ర్యామ్‌ వెర్షన్స్‌... స్నాప్‌డ్రాగన్‌ 215 ప్రాసెసర్‌ ఉండొచ్చు.

Smartphones to be released in September
జియోఫోన్​ నెక్స్ట్​

రియల్‌మీ 8ఐ

రెడ్‌మీ, రియల్‌మీ పోటీ సెప్టెంబరులోనూ కొనసాగనుంది. రెడ్‌మీ నోట్‌ 10 ప్రైమ్‌కు పోటీగా... రియల్‌మీ కూడా ఓ మొబైల్‌ను తీసుకొస్తోందని సమాచారం. రియల్‌మీ 8ఐ పేరుతో ఈ మొబైల్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ 96 ప్రాసెసర్‌ ఉంటుందని సమాచారం. 6.59 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. వెనుకవైపు 50 ఎంపీ మెయిన్‌ కెమెరా ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటుంది. స్క్రీన్ రిఫ్రెష్‌ రేట్‌ 120 హెర్జ్‌ గా ఉంటుంది.

Smartphones to be released in September
రియల్​మీ 8ఐ

ఆసుస్‌ 8 జెడ్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో జెన్‌ఫోన్‌ 8గా చాలా రోజుల క్రితమే లాంచ్‌ అయిన మొబైల్‌ను 8జెడ్‌గా సెప్టెంబరులో లాంచ్‌ చేస్తున్నారు. చిన్నగా ఉంటూ... పవర్‌ఫుల్‌ స్పెసిఫికేషన్లు కావాలి అనుకునేవారికి ఈ మొబైల్‌ నచ్చుతుందట. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. వెనుకవైపు రెండు కెమెరాలు ఉంటాయి. అందులో ఒకటి 64 ఎంపీ వైడ్‌ కెమెరా. మరకొటి 12 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా. ముందువైపు 12 ఎంపీ కెమెరా ఉంటుంది. దీని ధర సుమారు ₹40 వేలు - ₹48 వేలు మధ్య ఉంటుందని అంచనా.

Smartphones to be released in September
ఆసుస్​ 8 జెడ్​

ఐఫోన్‌ 13

ఏటా సెప్టెంబరు - అక్టోబరులో యాపిల్‌ తన కొత్త సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఐఫోన్‌ 13 సిరీస్‌ మొబైల్స్‌ వస్తాయి. అయితే సెప్టెంబరు 14న ఈ కొత్త యాపిల్స్‌ లాంచ్‌ ఉంటుందని టెక్‌ వర్గాల సమాచారం. ఈసారి యాపిల్‌ నుంచి ఐఫోన్‌ 13, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్‌, 13 మినీ రాబోతున్నాయి. అయితే అధికారికంగా యాపిల్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు. చైనా మార్కెట్‌లు, కొన్ని లీకుల సమాచారం ప్రకారం చూసుకుంటే సెప్టెంబరు మధ్యలో ఈ మొబైల్స్‌ రావొచ్చు.

Smartphones to be released in September
ఐఫోన్​ 13

మోటోరోలా ఎడ్జ్‌ 20 ప్రో

మోటోరోలా నుంచి సెప్టెంబరులో ఎడ్జ్‌ 20 సిరీస్‌లో కొత్త మొబైల్‌ వచ్చే అవకాశం ఉంది. ఎడ్జ్ 20 ప్రో మోడల్‌ వస్తుందట. 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌ ఇస్తున్నారట. 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉండొచ్చు. వెనుకవైపు 108 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది. ఇది కాకుండా 16 ఎంపీ, 8ఎంపీ కెమెరాలు ఉంటాయి. 12 జీబీ ర్యామ్‌ వెర్షన్‌ తీసుకొస్తున్నారు. 256 జీబీ స్టోరేజీ ఉంటుంది. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండొచ్చు. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఉంటుంది.

Smartphones to be released in September
మోటోరోలా ఎడ్స్​ 20 ప్రో

ఐకూ 8

ఐకూ నుంచి సెప్టెంబరులో రెండు మొబైల్స్‌ వస్తాయని అంచనా. 8, 8 లెజెండ్‌ పేరుతో ఐకూ రెండు కొత్త మొబైల్స్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఐకూ 8లో గింబల్‌ కెమెరా ఉంటుందట. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ ఉండొచ్చు. ఇక ఐకూ లెజెండ్‌లోనూ ఇదే ప్రాసెసర్‌ ఉండొచ్చు. ఇందులో 120 హెర్జ్‌ ప్రాసెసర్‌ ఉంటుందని సమాచారం. అలాగే కర్వ్‌ స్క్రీన్‌ ఉంటుందని తెలుస్తోంది. ఐకూ 8 ధర ₹40 వేలుపైగా ఉండొచ్చు. ఇక ఐకూ లెజెండ్‌ ధర అయితే ₹50 వేలకుపైగా ఉండొచ్చని సమాచారం. ఐకూ 8 ప్రోనే ఐకూ లెజెండ్‌గా మార్చారట.

Smartphones to be released in September
ఐకూ 8

మైక్రోమ్యాక్స్‌ ఇన్‌ నోట్‌ 1 ప్రో

మైక్రోమ్యాక్స్‌ నుంచి తొమ్మిదో నెలలో ‘ఇన్‌ నోట్‌ 1 ప్రో’ అనే మోడల్‌ వచ్చే అవకాశం ఉంది. ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ 90 ప్రాసెసర్‌ ఉండొచ్చు. 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉంటంఉది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ వెర్షన్‌ తీసుకొస్తున్నారు. వెనుకవైపు 64 ఎంపీ కెమెరాతో కలిపి నాలుగు కెమెరాల సెటప్‌ ఉంటుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉంటుందని సమాచారం. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. దీని ధర సుమారు ₹13 వేలు ఉంటుందని అంచనా.

Smartphones to be released in September
మైక్రోమ్యాక్స్​ ఇన్​ నోట్​ 1 ప్రో

వివో ఎక్స్‌ 70

సెప్టెంబరులో వస్తున్న వివో నుంచి ఎక్స్‌ 70 సిరీస్‌లో మూడు రకాల మొబైల్స్‌ ఉంటాయట. ఎక్స్‌ 70, ఎక్స్‌ 70 ప్రో, ఎక్స్‌ 70 ప్రో ప్లస్‌ ఉంటాయి. ప్రో ప్లస్‌ వెర్షన్‌లో అయితే స్నాప్‌డ్రాగన్‌ 888 ప్లస్‌ ప్రాసెసర్‌ ఉండొచ్చు. ఎక్స్‌ 70, ఎక్స్‌ 70 ప్రోలో అయితే మీడియాటెక్‌ డైమన్సిటీ 1200 ప్రాసెసర్‌ ఉండొచ్చు. ఎక్స్‌ 70, ఎక్స్‌ 70 ప్రో మొబైల్స్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న 6.56 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. అదే ఎక్స్‌ 70 ప్రో ప్లస్‌లో అయితే 6.78 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుందట. 4400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.

Smartphones to be released in September
వివో ఎక్స్​ 70

గమనిక: ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ మొబైల్స్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి కాకుండా మరికొన్ని మొబైల్స్‌ కూడా మార్కెట్‌లోకి రావొచ్చు.

ఇదీ చూడండి: మీ స్మార్ట్‌ఫోన్ హీటెక్కుతోందా? ఈ జాగ్రత్తలు పాటించండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.