ETV Bharat / science-and-technology

సరికొత్త ఫీచర్స్​తో నయా స్మార్ట్​ఫోన్స్​, సెప్టెంబర్​లో రిలీజయ్యేవి ఇవే - xiaomi 12 lite

వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ నెలలో కూడా సరికొత్త ఫీచర్స్​తో మరి కొన్ని కొత్త స్మార్ట్​ ఫోన్స్​ మార్కెట్​లో అందుబాటులోకి రానున్నాయి. ఓ సారి ఆ నయా మోడల్స్​ పై లుక్కేద్దాం...

SMART PHONES RELEASING IN SEPTEMBER
SMART PHONES RELEASING IN SEPTEMBER
author img

By

Published : Sep 1, 2022, 12:01 PM IST

SMART PHONES RELEASING IN SEPTEMBER : గత రెండేళ్ల కాలంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌తో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో విడులయ్యే వాటిలో ప్రీమియం, మిడ్‌రేంజ్‌ మోడల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. వినియోగదారులు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ మోడల్స్‌కే మొగ్గుచూపుతుండటం.. సాంకేతికతలో వేగంగా జరుగుతున్న మార్పులు ఈ ధోరణికి ప్రధాన కారణం. ఈ క్రమంలో సెప్టెంబరు నెలలో విడుదలవుతున్న కొత్త మోడల్స్​ మీ కోసం..

మోటో ఎడ్జ్‌ 30 అల్ట్రా (Moto Edge 30 Ultra)
200 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరా, 108 ఎంపీ సెకండరీ కెమెరాతో మోటో ఎడ్జ్‌ 30 అల్ట్రా సెప్టెంబరు మొదటి వారంలో విడుదలకానుంది. మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి. వెనుకు మూడు, ముందు ఒకటి. 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ ఉపయోగించారు.

ఈ ఫోన్‌తో పాటు మోటో కంపెనీ మోటో ఎడ్జ్‌ 30 ఫ్యూజన్‌ (Moto Edge 30 Fusion)ను విడుదల చేయనుంది. 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 888+ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 4,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

SMART PHONES RELEASING IN SEPTEMBER
Moto Edge 30 Ultra
షావోమి 12టీ సిరీస్‌ (Xiaomi 12T Series) షావోమి 12 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను తీసుకొస్తుంది. ప్రీమియం కేటగిరీలో వస్తున్న ఈ ఫోన్‌ను 12టీ, 12టీప్రో, 12టీ+ వంటి పేర్లతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 2k అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ ఉపయోగించారు. లైకా కెమెరా సెటప్‌ ఉంది. సెప్టెంబరు రెండో వారంలో ఈ ఫోన్‌ విడుదలకానుంది. ఇందులో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
SMART PHONES RELEASING IN SEPTEMBER
Xiaomi 12T Series
ఐఫోన్‌ 14 సిరీస్‌ (iPhone 14 Series)యాపిల్‌ కంపెనీ ఐపోన్‌ 14 సిరీస్‌ను సెప్టెంబరు 7న విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో నాలుగు మోడల్స్‌ విడుదలవుతున్నాయి. వీటిలో ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 మ్యాక్స్‌, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ ఉన్నాయి. ఐఫోన్ 14 మోడల్స్‌ పూర్తి వివరాలు. వీటితోపాటు మూడు ఐపాడ్ మోడల్స్‌ను యాపిల్ విడుదల చేస్తుంది. ఐపాడ్ 10.2 (10 జనరేషన్‌), ఐపాడ్‌ ప్రో 12.9 (ఆరో జనరేషన్‌), ఐపాడ్‌ ప్రో 11 (నాలుగో జనరేషన్‌) ఉన్నాయి.
SMART PHONES RELEASING IN SEPTEMBER
iPhone 14 Series
అసుస్‌ రోగ్‌ ఫోన్‌ 6 అల్టిమేట్‌ ఎడిషన్‌ (Asus Rog Phone 6 Ultimate Edition)స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 165 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు మరో రెండు కెమెరాలు ఉన్నాయి. ముందు 12 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో లభించనుంది. సెప్టెంబరు మొదటి లేదా రెండో వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
SMART PHONES RELEASING IN SEPTEMBER
Asus Rog Phone 6 Ultimate Edition
షావోమి 12 లైట్‌ (Xiaomi 12 Lite)సెప్టెంబరు నెలలోనే షావోమి 12 లైట్‌ కూడా విడుదలవుతోంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్‌ డాట్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుక 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 32 ఎంపీ అమర్చారు. స్నాప్‌డ్రాగన్‌ 778జీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 4,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్ టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ/128 జీబీ, 8 జీబీ/ 256 జీబీ వేరియంట్లలో తీసుకొస్తున్నారు. సెప్టెంబరు రెండు లేదా మూడో వారంలో విడుదలకానుంది.
SMART PHONES RELEASING IN SEPTEMBER
Xiaomi 12 Lite
రియల్‌మీ జీటీ నియో 3టీ (Realme GT Neo 3T)రియ్‌ల్‌మీ జీటీ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను తీసుకొస్తుంది. రియల్‌మీ జీటీ నియో 3టీ పేరుతో రాబోతున్న ఈ మోడల్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌ ఉపయోగించారు. సెప్టెంబరు రెండు లేదా మూడో వారంలో విడుదలకానుంది.
SMART PHONES RELEASING IN SEPTEMBER
Realme GT Neo 3T

ఐకూ నియో 7 (iQOO Neo 7)
సెప్టెంబరు నెలలో ఐకూ కంపెనీ నియో7 ఫోన్‌ను విడుదల చేయనుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 120 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. నియో సిరీస్‌లో ఐకూ నుంచి వస్తోన్న రెండో మోడల్‌.

SMART PHONES RELEASING IN SEPTEMBER
iQOO Neo 7

వన్‌ప్లస్ నార్డ్‌ ఎన్‌20 ఎస్‌ఈ (OnePlus Nord N20 SE)

ఈ ఫోన్‌లో 6.56 అంగుళాల కలర్‌-రిచ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుక 50 ఎంపీ ఏఐ డ్యూయల్‌ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వోక్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ఈ ఫోన్‌తో పాటు వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 (OnePlus Nord 3) మోడల్‌ కూడా విడుదలకానుంది. 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ 8100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు మరో రెండు కెమెరాలను ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ సూపర్ ఫ్లాష్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

SMART PHONES RELEASING IN SEPTEMBER
OnePlus Nord N20 SE
పోకో ఎం5 5జీ (Poco M5 5G)ఎం సిరీస్‌లో పోకో మూడో మోడల్‌ను విడుదల చేయనుంది. పోకో ఎమ్‌5 5జీ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో 6.58 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

ఇవే కాకుండా మరికొన్ని మోడల్స్‌ కూడా విడుదలకానున్నట్లు సమాచారం. వీటి విడుదల తేదీ, ఫీచర్లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ జాబితాలో రియల్‌మీ 10/11 సిరీస్‌ (Realme 10/11 Series), రియల్‌మీ క్యూ5 (Realme Q5), రియల్‌మీ సీ33 (Realme C33), వివో వీ25 సిరీస్‌ (Vivo V25 Series), ఐకూ జెడ్‌5 లైట్‌ (iQOO Z6 Lite), రియల్‌మీ జీటీ 3 (Realme GT 3) ఉన్నాయి.

SMART PHONES RELEASING IN SEPTEMBER
Poco M5 5G

ఇదీ చదవండి:

వాట్సాప్ కాల్స్​కు కొత్త రూల్స్! ఇక ఫ్రీగా మాట్లాడడం కష్టమేనా?

200 ఎంపీ కెమెరాతో శాంసంగ్​ నుంచి కొత్త ఫోన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.