కొత్త కొత్త అప్డేట్లతో ఎప్పుడూ వినియోగదారులకు ఆకర్షించే ఫేస్బుక్ తాజాగా అదిరే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా యూజర్లకు స్క్రీన్ షేరింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
స్కీన్ షేరింగ్అం టే?
ఫేస్బుక్ యూజర్లు మెసెంజర్ ద్వారా ఇప్పటికే వీడియో కాల్ చేసే సదుపాయం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వీడియో కాల్ ద్వారానే స్క్రీన్ షేరింగ్ ఫీచర్ కూడా పని చేస్తుంది.
ఎవరైనా యూజర్ స్నేహితులకు వీడియో కాల్ చేసినప్పుడు.. స్క్రీన్ షేరింగ్ ఫీచర్ను వినియోగించి తమ ఫోన్ స్క్రీన్ను(మొబైల్ లేదా డెస్క్టాప్ తెరను) కాల్లో ఉన్నవారందరితో పంచుకునేందుకు వీలుంటుంది.
మెసెంజర్ రూమ్స్లోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ప్రస్తుతానికి వెబ్, డెస్క్టాప్ వెర్షన్లలో మెసెంజర్ రూమ్స్ ద్వారా 16 మందితో స్క్రీన్ షేర్ చేసుకునే సదుపాయం ఉంది. త్వరలోనే ఈ పరిమితిని 50కి పెంచనున్నట్లు వెల్లడించింది.
ఉపయోగాలు..
స్క్రీన్ షేరింగ్ ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కలిసి ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. ఇతర సమాచారాన్ని పంచుకోవడం మరింత సులభం కానుంది.