ETV Bharat / science-and-technology

శుక్ర గ్రహంపై ఆ వాయువు​- జీవం ఉన్నట్లేనా?

ఇతర గ్రహాలపై జీవం కోసం మానవుడు సాగిస్తున్న అన్వేషణలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శుక్ర గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని ఇటీవల కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గ్రహం వాతావరణంలో స్వల్ప స్థాయిలో ఫాస్ఫీన్‌ వాయువు ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. అయితే... ఆ‌ వాయువు ఉన్నంత మాత్రాన జీవం ఉందని కచ్చితంగా చెప్పలేమని కూడా పరిశోధకులు వెల్లడించారు.

venus
శుక్ర గ్రహం
author img

By

Published : Sep 15, 2020, 4:29 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

భూమికి సమీపంలో ఉన్న శుక్ర గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలో ఫాస్ఫీన్​ వాయువు ఆనవాళ్లను కనుగొన్నారు. శుక్రుడిపై సల్ఫ్యూరిక్ ఆమ్ల మేఘాల్లో సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

సౌర కుటుంబంలో మనకంటే ముందు ఉండే శుక్రుడిపై పగటి ఉష్ణోగ్రతలు సీసాన్ని కరిగించే స్థాయిలో ఉంటాయి. అలాగే వాతావరణంలో భారీ స్థాయిలో కార్బన్‌డయాక్సైడ్‌ ఉంటుంది. అక్కడి మేఘాల్లో 90 శాతం సల్ఫ్యూరిక్‌ ఆమ్లం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ జీవరాశి మనుగడ దాదాపు సాధ్యం కాదనే భావించారు. కానీ, ఫాస్ఫీన్‌ వాయువు ఆనవాళ్లు కనిపించడం వల్ల అనుమానాలు మొదలయ్యాయి.

60 కిలోమీటర్ల ఎత్తులో..

సాధారణంగా కర్బన పదార్థాలు కుళ్లే ప్రక్రియలో ఫాస్ఫీన్​ ఉత్పత్తవుతుంది. అలాగే ఆక్సిజన్‌ రహిత జీవులూ(అనరోబిక్‌ లైఫ్‌ఫామ్స్‌) దీన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రయోగశాలల్లోనూ దీన్ని తయారుచేయవచ్చు. కానీ, దీనికి మండే స్వభావం అధికం.

చిలీలోని అటకామా ఎడారి, అమెరికాలోని హవాయిలో ఉన్న టెలిస్కోపులతో పరిశోధకులు ఈ గ్యాస్‌ ఆనవాళ్లను గుర్తించారు. ఈ పరిశోధనకు కార్డిఫ్‌ యూనివర్సిటీకి చెందిన జేన్‌ ఎస్ గ్రీవ్స్‌ నేతృత్వం వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ‘నేచర్‌ ఆస్ట్రానమీ’ జర్నల్‌లో ప్రచురించారు. శుక్రగ్రహం ఉపరితలం నుంచి 60 కి.మీ ఎత్తులో ఉన్న వాతావరణంలో ఈ వాయువు ఉన్నట్లు భావిస్తున్నారు.

ఫాస్ఫీన్​ ఉంటే జీవం ఉన్నట్లేనా?

ఈ విషయాన్ని చాలా మంది నిపుణులు, పరిశోధకులు అంగీకరించారు. అయితే, వేరే గ్రహంపై జీవావరణం ఉందనడానికి ఈ ఆధారాలు సరిపోవని అన్నారు. జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు అసాధారణ ఆధారాలు కావాలన్న కార్ల్​ సాగన్​ సిద్ధాంతాన్ని ఇది సంతృప్తి పరచలేదని వ్యాఖ్యానించారు. శుక్రుడిపై మేఘాల్లో జీవం ఆనవాళ్లు ఉండే అవకాశం ఉందని 1967లోనే కార్ల్ ఊహించారు.

అయితే, ఫాస్ఫీన్‌ ఉత్పత్తి కోసం ఇప్పటి వరకు వేలాది రసాయనిక చర్యలను జరిపినా సాధ్యపడలేదన్నారు శాస్త్రవేత్తలు. దీనిపై మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉందని తెలిపారు. సౌరగాలులు, నిరంతర రసాయనిక ప్రక్రియల వల్ల స్వల్ప స్థాయిలో ఫాస్ఫీన్‌ ఉత్పత్తయినప్పటికీ.. అది గుర్తించే స్థాయిలో ఉండేందుకు శుక్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులు అనుకూలించవని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కానీ, '20 పార్ట్స్‌ పర్‌ బిలియన్‌' స్థాయిలో గుర్తించగలిగామని తెలిపారు. అంటే ఆ వాయువు ఉత్పత్తికి అంతుచిక్కని ప్రక్రియేదో జరుగుతున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. అది జీవరాశే అయ్యుండొచ్చన్నది వారి అంచనా.

అత్యంత దగ్గరగా..

ఈ అధ్యయనంపై స్విన్‌బర్న్‌కు చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆలెన్‌ డఫీ మాట్లాడుతూ.. ఇతర గ్రహాలపై జీవం కోసం జరుపుతున్న అన్వేషణలో ఇప్పటి వరకు లభించిన ఆధారాల్లో ఇదే అత్యంత దగ్గరగా, ఆమోదనీయంగా ఉందని తెలిపారు. నాసా కూడా ఈ పరిశోధనను ప్రశంసించింది. శుక్రుడికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సంస్థ చీఫ్‌ జిమ్‌ బ్రిడెన్‌స్టైన్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: కాంట్రాక్టుకు చంద్రుడు- బిడ్లు ఆహ్వానించిన నాసా

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.