అమెరికా శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం, ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా.. చిన్నారుల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల కోసం స్మార్ట్ వాచ్‌లను తయారు చేసేందుకు నార్వేకు చెందిన ఎక్స్‌ప్లోరా టెక్నాలజీస్‌తో పని చేయనుంది. ఈ స్మార్ట్ వాచ్ కారు కీ గానూ పని చేయనుందని తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతానికి టెస్లా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఎక్స్‌ప్లోరా స్మార్ట్‌వాచ్ అభివృద్ధిలో టెస్లా పాలుపంచుకుంటున్నట్లు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్‌సీసీ) ఫైలింగ్ ద్వారా తెలిసింది.
భవిష్యత్తులో..
భవిష్యత్తులో పిల్లల కోసం మరిన్ని భద్రతాపరమైన ఫీచర్లు తీసుకురావాలని భావిస్తోంది టెస్లా. ఇప్పటికే మోడల్-3, వైలలో కీ ఫోబ్స్కు బదులుగా ఫోన్లను ఉపయోగంలోకి తెచ్చింది. దీనికి అదనంగా స్మార్ట్ వాచ్‌ను ఐచ్ఛిక కీగా వినియోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఐఓఎస్‌లోనూ గూగుల్ మ్యాప్స్- త్వరలో విడుదల