కెమెరా.. సాంకేతిక వినియోగం పెరిగాక యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్న గ్యాడ్జెట్లలో ఇదీ ఒకటి. చాలా మంది వీడియో ఎడిటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. యూట్యూబ్ సహా పలు సోషల్ మీడియా సైట్లలో తమ క్రియేటివిటీతో వీడియోలు చేయడానికి కెమెరా ఓ ఆయుధంగా మారింది. అలాంటి వారిని ఆకట్టుకోడానికి సోనీ మరో ఫుల్ ఫ్రేమ్ మిర్రర్ లెస్ కెమెరాను తీసుకొస్తోంది. న్యూ ఆల్ఫా 7ఎస్-III పేరిట దీన్ని విడుదల చేయనుంది. ఇది ఫుల్ ఫ్రేమ్‌తో మిర్రర్ లెస్‌గా ఉండనుంది. అల్ట్రా హై సెన్సిటివిటీ, బియోన్జ్ ఇమేజ్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ధర రూ.2,61,915.
-
ANNOUNCEMENT: The long-awaited #SonyAlpha a7S III is here – empowering creators with impressive video capabilities, ultra-high sensitivity and so much more! (📷: @timbuz1) Learn more 👉 https://t.co/T3TVf8gpEm #BeAlpha pic.twitter.com/sntWufAknP
— Sony Alpha (@SonyAlpha) July 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ANNOUNCEMENT: The long-awaited #SonyAlpha a7S III is here – empowering creators with impressive video capabilities, ultra-high sensitivity and so much more! (📷: @timbuz1) Learn more 👉 https://t.co/T3TVf8gpEm #BeAlpha pic.twitter.com/sntWufAknP
— Sony Alpha (@SonyAlpha) July 28, 2020ANNOUNCEMENT: The long-awaited #SonyAlpha a7S III is here – empowering creators with impressive video capabilities, ultra-high sensitivity and so much more! (📷: @timbuz1) Learn more 👉 https://t.co/T3TVf8gpEm #BeAlpha pic.twitter.com/sntWufAknP
— Sony Alpha (@SonyAlpha) July 28, 2020
ఫీచర్లు ఇవే...
- బియోన్జ్ ఎక్స్ఆర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంజిన్ వల్ల ఎనిమిది రెట్ల వేగంతో ప్రాసెసింగ్.
- 12.1 మెగాపిక్సెల్ సహా ఫుల్‌ఫ్రేమ్ ఎక్స్మోర్ ఆర్ సీమాస్ ఇమేజ్ సెన్సార్ దీని సొంతం.
- అల్ట్రా హై సెన్సిటివిటీతో పాటు ఐఎస్ఓ రేంజ్ 40 నుంచి 409,600కు పెంచుకొనే సౌలభ్యం.
- సినిమాల కోసం 15+ డైనమిక్ రేంజ్ సదుపాయం.
- 4కే 60 పిక్సెల్ 16 బిట్ వీడియోను హెచ్డీఎమ్ఐలో ఔట్పుట్ తెచ్చుకోవచ్చు. ఆల్ఫా సిరీస్‌లో తొలిసారి ఈ సదుపాయం కల్పిస్తోంది సోనీ.
- సినిమా రికార్డింగ్, స్టిల్ ఇమేజ్ రికార్డింగ్ కోసం రియల్‌టైమ్ ఏఎఫ్ ఫీచర్.
- మూవీ షూటింగ్ సమయంలో 5 యాక్సిస్ ఆప్టికల్ ఇన్-బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్.
- హైస్పీడ్ డాటా ప్రాసెసింగ్ కోసం డ్యూయల్ సీఫెక్స్ప్రెస్ టైప్-ఏ కార్డ్ స్లాట్.
- ప్రపంచంలోనే ప్రకాశవంతమైన 0.64 టైప్ 9.44 మిలియన్ ఏఎల్ఈడీ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ దీనిలో ఉంది.
- టచ్ స్క్రీన్, టచ్ ఆపరేషన్స్‌తో కూడిన మెనూ సిస్టమ్.