భారత్‌లో తమ యాప్ స్టోర్ల నుంచి పబ్జీ మొబైల్ గేమ్‌ను తొలగించాయి గూగుల్, యాపిల్. పబ్జీ సహా 118 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి.
దీనితో ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి కొత్తగా పబ్జీ మొబైల్ గేమ్‌ను డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు. అయితే ఇప్పటికే తమ ఫోన్లలో పబ్జీని డౌన్లోడ్ చేసుకున్న యూజర్లు దానిని వినియోగించేందుకు ప్రస్తుతానికి వీలుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పబ్ జీని బ్లాక్ చేస్తే ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నవారు కూడా గేమ్‌ను ఆడేందుకు వీలుకాదు.
సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ చేస్తే..
ఇంతకు ముందు టిక్‌టాక్‌పై నిషేధం విధించినప్పుడు కూడా ఆ యాప్‌ను కొత్తగా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు లేకుండా గూగుల్, యాపిల్ తమ యాప్ స్టోర్ల నుంచి ఆ యాప్‌ను తొలగించాయి. ఆ తర్వాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు టిక్‌టాక్‌ను బ్లాక్ చేశాయి. దీనితో అప్పటికే డౌన్లోడ్ చేసుకున్నవారు కూడా దాన్ని వాడేందుకు వీలులేకుండా చేసింది కేంద్రం.
పబ్జీ విషయంలోనూ ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్నవారు గేమ్ ఆడేందుకు అవకాశం ఉంది. అయితే త్వరలోనే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ గేమ్నూ బ్లాక్ చేయనున్నారు.