కరోనా వల్ల ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాస్‌లు సర్వ సాధారణమయ్యాయి. దీనితో ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. నోకియా బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా తొలి నోకియా ల్యాప్‌టాప్‌ను సోమవారం ఆవిష్కరించింది. ఇరు సంస్థల మధ్య ఉన్న భాగస్వామ్య ఒప్పందం ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది ఫ్లిప్‌కార్ట్.
ప్యూర్‌బుక్ ఎక్స్14 పేరుతో విడుదలైన ఈ ల్యాప్‌టాప్ ధరను రూ.59,990గా నిర్ణయించింది నోకియా. ఇప్పటికే ల్యాప్‌టాప్ మార్కెట్‌ను ఏలుతున్న హెచ్‌పీ, డెల్, లెనోవా, ఏసర్, ఆసుస్ల పోటీని నోకియా ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
ప్యూర్ బుక్ ఎక్స్ 14 ఫీచర్లు..
- 14 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్
- ఐ5, 10 జనరేషన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
- 1.1 కిలోల అత్యల్ప బరువు
- 8 జీబీ డీడీఆర్4 ర్యామ్
- 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజీ
- డాల్బి అట్మాస్
- హెచ్డీఎంఐ పోర్ట్, ఈతర్ నెట్
వీటితో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లను ప్యూర్‌బుక్ ఎక్స్14లో పొందుపరిచింది నోకియా. ప్యూర్ బుక్ ఎక్స్ 14 ఈ నెల 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ బుకింగ్ చేసుకునేందుకు వీలుంది.
ఇదీ చూడండి:భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు