భారత ఎన్‌కోర్ గేమింగ్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ మల్టిప్లేయర్ గేమింగ్ యాప్ ఫౌజీని అంతర్జాతీయంగా గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తెచ్చారు. చైనా సంస్థకు చెందిన పబ్‌జీని భారత్‌లో నిషేధించిన తర్వాత జనవరి 26న ఈ ఫౌజీ గేమింగ్ యాప్‌ను స్వదేశీ ఎన్‌కోర్ గేమ్స్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పుడు ఈ యాప్ అంతర్జాతీయంగా అందుబాటులోకి తేవటం ఎంతో గర్వంగా ఉందన్న సంస్థ.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. భారత్‌లో ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన 24గంటల్లోనే 5లక్షల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని సంస్థ పేర్కొంది.
ఆండ్రాయిడ్ వర్షన్‌లో ఈ గేమింగ్ యాప్‌ని అందుబాటులోకి తెచ్చిన సంస్థ.. ఐఓఎస్‌లో ఇంకా తీసుకురాలేదు.
ఇదీ చూడండి: 'భారతరత్న' ప్రచారం ఆపండి- నెటిజన్లకు టాటా విజ్ఞప్తి