ETV Bharat / science-and-technology

ఏఆర్​ హెడ్​సెట్​తో సర్జరీ మధ్యలోనూ సీటీస్కాన్​

వైద్య రంగంలో సాంకేతికత వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. రోగి శరీర స్థితిని బట్టి వైద్యులు అతని శస్త్రచికిత్స చేస్తుంటారు. ఒక్కోసారి సర్జరీ చేసేటప్పుడు ఆ వ్యక్తి స్పందించే తీరును బట్టి మళ్లీ అతనికి సీటీ స్కాన్​ చేసి పరిశీలించాల్సి వస్తుంది. అలాంటి అవసరం లేకుండా వైద్యుల కళ్లకే ఎక్స్​రేలాంటి పవర్​ ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ప్రతిరూపమే ఏఆర్​తో ఆపరేషన్..

CT scan in the middle of surgery with augmented reality technology
ఏఆర్​ హెడ్​సెట్​తో సర్జరీ మధ్యలోనూ సీటీస్కాన్​
author img

By

Published : Dec 27, 2020, 12:59 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ప్రమాదంలో ఏ ఎముకో విరిగింది. అది సరిగ్గా ఎక్కడ విరిగిందీ, ఎలా సరిచేయాలీ అన్నది తెలుసుకోడానికి ఎక్స్‌ రే, సీటీ స్కాన్‌ తీయించి ఆ చిత్రాలను నిశితంగా పరిశీలించి చికిత్స ఎలా చేయాలన్నది ప్లాన్‌ చేసుకుంటారు వైద్యులు. అయితే ఒక్కోసారి శస్త్రచికిత్స మొదలుపెట్టాక కూడా రోగి శరీర స్థితిని బట్టి వైద్యులకు సందేహాలు వస్తుంటాయి. సర్జరీ మధ్యలో ఆపి సీటీ స్కాన్‌ని మళ్లీ మళ్లీ పరిశీలించాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా వైద్యుల కళ్లకే ఎక్స్‌రేలాంటి పవర్‌ ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది ‘ఆగ్మెడిక్స్‌’ సంస్థ సీఈవో నిసాన్‌ ఎలిమెలెక్‌కి.

ఆగ్మెంటెడ్‌ రియాలిటీని సర్జరీలో మాత్రం ఎందుకు వాడకూడదూ అని చేసిన పరిశోధనల ఫలితమే ఈ ఎక్స్‌విజన్‌. సర్జరీ చేసే వైద్యుడు ఏఆర్‌ హెడ్‌సెట్‌ పెట్టుకుంటే అది సీటీ స్కాన్‌ని త్రీడీలో పేషెంట్‌ శరీరం మీద కనిపించేలా చేస్తుంది. అచ్చం ఎక్స్‌రే కళ్లతో చూసినట్లే లోపలి భాగాలను చూడవచ్చు. దాంతో సంక్లిష్టమైన ఆపరేషన్‌ని పేషెంట్‌ మీది నుంచి దృష్టి మళ్లించనక్కర లేకుండా డాక్టరు చేసేయ గలుగుతారు. స్పష్టంగా చూడ గలగడం వల్ల వైద్యులకు పరిస్థితి మీద నియంత్రణ వస్తుంది. ఇప్పుడు అమెరికాలోని జాన్‌ హాప్‌కిన్స్‌ లాంటి పలు ప్రముఖ ఆస్పత్రుల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.