కరోనా కాలంలో ఆన్లైన్ లావాదేవీల సంఖ్య బాగా పెరిగిపోయింది. కావాల్సిన సరకులన్నీ ఈ-కామర్స్ వేదికల ద్వారానే ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లు సైతం తమ బుర్రలకు పదును పెడుతున్నారు. కొత్త కొత్త మాల్వేర్లతో వినియోగదారులపై దాడులకు ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెచ్చుమీరిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్తగా జోకర్ అనే మాల్వేర్ను ఉపయోగిస్తున్నట్లు మహారాష్ట్ర సైబర్ సెల్ దర్యాప్తులో వెల్లడైంది. ఫోన్లు, కంప్యూటర్లలోకి చొరబడి కీలకమైన సమచారాన్ని జోకర్ చోరీచేస్తోందని సైబర్ డిపార్ట్మెంట్ హెడ్ యశస్వీ యాదవ్ తెలిపారు. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సమాచారాన్ని తస్కరించి సైబర్ నేరగాళ్ల చేతిలో పెడుతోందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి- ఆ యాప్స్‌లో 'జోకర్' మాల్వేర్- దొరికినంత దోచేస్తోంది!
మనకు తెలియకుండానే జోకర్ ఫోన్లలోకి ప్రవేశిస్తుంది. ఆన్లైన్ లావాదేవీల సమాచారాన్ని సేకరిస్తుంది. ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు దొంగలిస్తుంది. చివరగా ఖాతాను లూఠీ చేస్తుంది.
ఇదీ చూడండి: 'టెలికాం రంగంలో స్వయం సమృద్ధతే లక్ష్యం'