ETV Bharat / science-and-technology

అలెక్సాకు రోజుకు 19 వేల సార్లు 'ఐ లవ్​ యూ' - అలెక్సాకు మూడేళ్లు

అమెజాన్ స్మార్ట్ పరికరం అలెక్సా భారత విపణిలోకి అడుగుపెట్టి మూడేళ్లవుతోందని సంస్థ వెల్లడించింది. అలెక్సాతో కస్టమర్ల సంభాషణ 2020లో 67 శాతం పెరిగిందని తెలిపింది. సగటున రోజుకు 19 వేల సార్లు 'ఐ లవ్ యూ' చెప్పారని పేర్కొంది.

Indians said 'I Love You' to Alexa 19K times a day in 2020
అలెక్సాకు రోజుకు 19 వేల సార్లు 'ఐ లవ్​ యూ'
author img

By

Published : Feb 8, 2021, 3:03 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

అలెక్సాతో భారతీయ వినియోగదారుల సంభాషణ 2020లో 67 శాతం పెరిగిందని అమెజాన్ వెల్లడించింది. భారత్​లో అలెక్సాను ప్రవేశపెట్టి మూడేళ్లయిన సందర్భంగా ఆసక్తికరమైన గణాంకాలను వెలువరించింది. 2020లో సగటున రోజుకు 19 వేల సార్లు కస్టమర్లు అలెక్సాకు 'ఐ లవ్​ యూ' చెప్పారని తెలిపింది. 2019తో పోలిస్తే ఇది 1200 శాతం అధికమని పేర్కొంది.

2020లో దేశంలోని 85 శాతం పిన్​కోడ్​లకు చెందిన ప్రజలు అలెక్సాను కొనుగోలు చేశారని అమెజాన్ తెలిపింది. ఎక్కువ శాతం నాన్-మెట్రో నగరాల ప్రజలే అలెక్సాను కొన్నారని వెల్లడించింది. భారత్​లో 50 శాతం వినియోగదారులు నాన్-మెట్రో నగరాలకు చెందినవారేనని పేర్కొంది.

"మాకు ఇప్పటికీ తొలిరోజులాగే ఉంది. ఇకపైనా అలెక్సాను మరింత మెరుగుపరుస్తాం. కస్టమర్ల నుంచి ఫీడ్​బ్యాక్ తీసుకొని కొత్త ఫీచర్లను పొందుపరుస్తూనే ఉంటాం. స్థానికులు మాట్లాడే విషయాలను అర్థం చేసుకొని స్పందించేలా అలెక్సాను అభివృద్ధి చేస్తాం."

-పునీశ్ కుమార్, అలెక్సా ఇండియా లీడర్

అలెక్సా మూడో వార్షికోత్సవం సందర్భంగా డిజిటల్ అసిస్టెన్స్​ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తామని అమెజాన్ పేర్కొంది. 'ఎకో పరికరాల'పై ఫిబ్రవరి 15 నుంచి అమెజాన్​లో బ్లాక్ బస్టర్ ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలిపింది.

ఇప్పటికే ప్రముఖ స్మార్ట్​పోన్ బ్రాండ్లు తమ మొబైల్ డివైజ్​లలో అలెక్సాను బిల్టిన్​గా అందిస్తున్నాయి. రెడ్​మీ నోట్9 ప్రో, వన్​ ప్లస్ నార్డ్​లో ప్రస్తుతం అలెక్సా అందుబాటులో ఉంది.

2020జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 95.9 శాతం మార్కెట్ వాటాతో ఎకో పరికరాల అమ్మకాల్లో అమెజాన్ దూసుకుపోతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.