Russian Couple Married Hindu Tradition : ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని అఖండ్ పరమానంద్ ఆశ్రమంలో రష్యాకు చెందిన మూడు జంటలు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతగానో నచ్చి.. హిందు ఆచారంలో పెళ్లి చేసుకున్నట్లు వారు చెప్పారు. అలాగే వీరి వివాహానికి.. మరికొంత మంది రష్యా పౌరులు కూడా హాజరయ్యారు. ఇంతకీ వీరి కథేంటంటే?
50 మంది రష్యా పౌరులు ఆధ్యాత్మిక యాత్ర కోసం భారత్‌కు వచ్చారు. యాత్రలో భాగంగా వారు ఉత్తరాఖండ్ హరిద్వార్ చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి భారత ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఎంతో నచ్చాయి. దీంతో రష్యా పౌరుల బృందంలోని 3 జంటలు అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. దీంతో బుధవారం పరమానంద్ ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు.
ఘనంగా ఊరేగింపు.. పెళ్లి తంతు కంటే ముందు ఘనంగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ పెళ్లిలో వధూవరులు భారతీయ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించారు. వరులు షేర్వానీ ధరించగా.. వధువులు లెహంగాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక పెళ్లి జంటలతో రష్యా పౌరులందరూ.. ఉత్తరాఖండ్ ఫేమస్ డ్రమ్స్, సంప్రదాయ వాద్యాలకు, హిందీ పాటలకు హుషారుగా డ్యాన్స్‌లు చేస్తూ.. కరెన్సీ నోట్లను వెదజల్లుతు ఎంజాయ్ చేశారు. తర్వాత ఆశ్రమంలో ఉన్న శివాలయాన్ని సందర్శించారు. భగవాన్ శివుడి దర్శనం అనంతరం.. ఆశ్రమం గురూజీ పరామనంద్ గిరి మహారాజ్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఒకరినొకరు పూల దండలు మార్చుకొని.. వేదమంత్రాల మధ్య మండపంలో ఏడు అడుగులు వేశారు.
"విదేశీ పాశ్చాత్య సంస్కృతితో విసుగు చెంది.. హిందూ సంప్రదాయాల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ఏడు జన్మలపాటు కలిసి ఉంటామంటూ ఒకరికొకరు ప్రమాణం చేశారు. వీరితో పాటు ఇక్కడికి వచ్చిన రష్యాన్ పౌరులందరూ ఈ వివాహ వేడుకను ఎంజాయ్ చేశారు. ఇంతకుముందు కూడా ఇక్కడ అనేక రష్యాన్ జంటలు భారతీయ సంస్కృతి ప్రకారం వివాహం చేసుకున్నాయి" అని ఆశ్రమం గురూజీ పరమానంద్ గిరి వివరించారు.
foreign Girl Marries Indian Guy: దేశాలు వేరైనా.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భద్రాద్రి అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి