ETV Bharat / science-and-technology

Repair Mode Option Google : రిపేర్​ సమయంలో ఫోన్​ డేటా పోయిందా? గూగుల్​ నయా ఆప్షన్​తో అంతా సేఫ్!

Repair Mode Option Google : ఫోన్​ పాడయిందని రిపేర్​కు ఇచ్చారా? ఆ సమయంలో ఫ్యాక్టరీ రీసెట్​ కారణంగా డేటా మొత్తం పోయిందా? అయితే బాధపడకండి. గూగుల్​ త్వరలో తేనున్న ఓ కొత్త ఆప్షన్​ ఇక ఆ సమస్యకు చెక్​ పెట్టబోతుంది. మీ మొబైల్​లోని పర్సనల్​ డేటా డిలీట్​ చేయకుండానే మీ డివైజ్​ మీ చేతికి తిరిగి వస్తుంది. మరి ఆ నయా ఫీచర్​ ఏంటి? దీంతో పాటు గూగుల్​ తీసుకురానున్న మరిన్ని కీలక మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Google To Launch More New Features Till This December In All Devices
Special Repair Mode Option
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 3:06 PM IST

Repair Mode Option Google : మొబైల్​ యూజర్స్​ తమ ఫోన్​లను రిపేర్​ కోసం ఇచ్చి తిరిగి దానిని పొందే సమయంలో చాలావరకు తమ వ్యక్తిగత డేటాను మొత్తం కోల్పోతారు. ఇందులో ఫోన్​ నంబర్లతో పాటు ముఖ్యమైన మీడియా ఫైల్స్​ కూడా ఉంటాయి. అయితే ఇలా పోగొట్టుకున్న పర్సనల్​ డేటాను తిరిగి పొందే అవకాశాలు దాదాపు ఉండవు. ఇలాంటి సమయాల్లో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యకు చెక్​ పెట్టేందుకే గూగుల్​ సరికొత్త ఫీచర్​ను తెచ్చేందుకు కృషి చేస్తోంది. దీని సాయంతో రిపేర్​ సమయాల్లో మీ ఫోన్​లోని వివరాలన్నింటినీ భద్రంగా లాక్​ చేసుకొని ఉంచుకోవచ్చు. మీ అనుమతితో.. అంటే మీరు సృష్టించే పాస్​వర్డ్​ లేదా ఫేస్​ లాక్​ లేకుండా దానిని మొబైల్​ సర్వీస్ సెంటర్​ సహా ఎవరూ యాక్సెస్​ చేయలేరు.

ఆండ్రాయిడ్​ 14 ఓఎస్​తో వచ్చే ఫోన్​లలో..
ఇందుకోసం గూగుల్​ త్వరలోనే రిపేర్​ మోడ్ ​( Repair Mode ) అనే ఆప్షన్​ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సమస్యకు రానున్న కొత్త ఆండ్రాయిడ్​ వర్షెన్​తో ముగింపు పలకాలని గూగుల్​ యోచిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ నయా ఫీచర్​ ( Repair Mode Feature​ ) లేదా అప్డేట్​ను ఆండ్రాయిడ్​ 14 ఓఎస్​తో వచ్చే ఫోన్​లలో చేర్చాలని సంస్థ భావిస్తున్నట్లు టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ఈ 'రిపేర్​ మోడ్​' రిపేర్​ సమయాల్లో మీ ఫోన్​ను​ సర్వీస్​ సెంటర్​కు ఇచ్చినట్లుగా గుర్తించి అందులో ఉన్న డేటాను హైడ్​ చేసుకుంటుంది. దీనిని మీరు మాత్రమే యాక్సెస్​ చేయగలరు. దీంతో రిపేర్​ చేసే వ్యక్తికి మీ మొబైల్​లో డేటా ఉందనే అనుమానం రాకుండా​ చేస్తుంది. దీంతో కొత్త అకౌంట్​తో నూతన ఓఎస్​ లేదా న్యూ వెర్షన్​ను మీ డివైజ్​లో ఇన్​స్టాల్​ చేసేందుకు వీలు కలుగుతుంది. అయితే సాధారణంగా ఫోన్​ రిపేర్​కు ఇచ్చినప్పుడు సర్వీస్​ సెంటర్లు మీ పర్సనల్​ డేటాను మొత్తం తొలగించాలని కోరుతాయి. ఇక రానున్న ఈ కొత్త అప్డేట్​తో డేటా లాస్​ అనే సమస్యలేమి ఉండవు.

ఇతర తయారీదారులు కూడా..
ఈ నయా మోడ్ ఫీచర్​​ను కేవలం గూగుల్​ పిక్సెల్​ ఫోన్​లకు మాత్రమే పరిమితం చేయకుండా Android 14 AOSPని ఉపయోగించి వేర్వేరు మొబైల్​ మ్యానుఫ్యాక్చర్లు కూడా దీనిని ఇన్​బిల్ట్​ ఫీచర్​గా తమ ఉత్పత్తుల్లో వాడుకునే వెసులుబాటును కూడా కల్పించనుంది గూగుల్​. లేదా ఇదే పద్ధతిలో ఉండే తమ సొంత టూల్స్​ను కూడా ఇన్​స్టాల్​ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్​ను గూగుల్​ పిక్సెల్స్​ ఫోన్​ల ద్వారా వినియోగదారులకు తొలుత అందుబాటులోకి తేనున్నారు. క్రమంగా Android 14 QPR1 బీటా బిల్డ్​ వెర్షన్​ రూపంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆండ్రాయిడ్​ డివైజ్​ యూజర్స్​ కూడా ఈ ఫీచర్​ను ఆస్వాదించే అవకాశం ఉంది.

రిపేర్​ మోడ్​ కోసం ప్రత్యేక యాప్​..
మొబైల్​ రిపేర్ సమయంలో​ యూజర్స్​​ పోగొట్టుకునే పర్సనల్​ డేటాను తిరిగి రిట్రీవ్​ చేసే విధానాన్ని మరింత సులభతరం చేసేందుకే గూగుల్​ తన ప్రయత్నాలు చేస్తున్నట్లు టెక్​ ఎక్స్​పర్ట్​స్​ అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ రిపేర్​ మోడ్ ​బీటా బిల్డ్​ వెర్షన్​లోకి రావడానికి డిసెంబర్​ కల్లా ఎందుకు సమయం పట్టనుందనే కారణాలను వివరిస్తూ.. ఈ ఫీచర్​ను ఉపయోగించేందుకు అనుసరించాల్సిన స్టెప్స్​ను తెలియజేస్తూ ఉన్న యాప్​ను కూడా గూగుల్​ త్వరలోనే లాంఛ్​ చేయనుంది.

మొత్తంగా ఆండ్రాయిడ్​ 14 వెర్షన్​తో వచ్చే డివైజుల్లో ఈ Repair Modeను ఎనేబుల్​ చేయడం ద్వారా మొబైల్​ యూజర్స్​ ఇక నుంచి తమ ఫోన్​లను సర్వీస్​ సెంటర్లకు డేటా పోతుందనే భయం లేకుండా నిశ్చింతగా ఇచ్చుకోవచ్చు.

గూగుల్​ క్లాక్​లో మరికొన్ని కొత్త ఫీచర్లు..
గూగుల్​ క్లాక్​కు సంబంధించి కూడా కంపెనీ మరికొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేనుంది. త్వరలో రానున్న ఈ కొత్త అప్డేట్​లు​ పనితీరు విషయానికి వస్తే.. మీరు కొత్తగా అలారాన్ని సెటప్ చేసేటప్పుడు క్లాక్ యాప్ 'వెదర్ ఫోర్‌కాస్ట్' అనే కొత్త ఆప్షన్​ను చూపించనుంది. ఇది అలారం ఆఫ్​ చేసినప్పుడు మీరు ఉండే ప్రదేశంలోని వాతావరణ సమాచారాన్ని మీకు తెలియజేస్తుంది.

అయితే ప్రస్తుతానికి ఈ 'వెదర్​ ఫోర్​కాస్ట్' ఫీచర్​ను పిక్సెల్​ డివైజ్​ యూజర్స్​లో ప్రీ-ఇన్​స్టాల్​డ్​గా ఉన్న పిక్సెల్ వెదర్​ యాప్​లో మాత్రమే గమనించవచ్చు. అంటే Android 14 QPR1 బీటా ద్వారా నడిచే Pixel 8 లేదా Pixel 8 ప్రో ఫోన్​లలో మాత్రమే అందుబాటులో ఉంది. క్రమంగా దీనిని కూడా డిసెంబరు నాటికి అన్ని మొబైల్​ యూజర్స్​కు అందుబాటులోకి తేనున్నారు.

అలారం సింక్రనైజ్​ ఆప్షన్​..
త్వరలో రానున్న ఈ కొత్త ఫీచర్(Alarm Sync Otion) సాయం​తో మీ ఫోన్​, పిక్సెల్ వాచ్​ల మధ్య కూడా అలారాలను సింక్రనైజ్​ చేసుకోవచ్చు. WearOS 3లోని పిక్సెల్ వాచ్, WearOS 4లోని పిక్సెల్ వాచ్ 2 రెండింటిలో ఈ ఫీచర్​ పనిచేస్తుందని టెక్​ నిపుణుడు మిషాల్​ రెహ్మాన్ చెప్పారు.

ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ డివైజ్​ యూజర్స్​ కోసం గూగుల్​ ప్రవేశపెట్టనున్న మరికొన్ని కీలక మార్పులు ఇవే..

  • మొబైల్​ Chromeలో URL కరెక్షన్స్​ సజెషన్స్ ( Corrections Suggestions Feature ) ఫీచర్‌ను కూడా గూగుల్​ యాడ్​ చేస్తుంది.
  • ఈ ఫీచర్​ క్రోమ్​లో యూజర్​ ఎంటర్​ చేసే పదాల్లో ఏమైనా అక్షరదోషాలు ఉంటే వాటిని ఆటోమెటిగ్గా గుర్తించి సరి చేస్తుంది.
  • ఈ ఫీచర్​ ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి వెబ్​ యూజర్స్​కు అందుబాటులో రాగా.. తాజాగా దీనిని మొబైల్​ వినియోగదారులకు కూడా అందించనున్నట్లు గూగుల్​ మంగళవారం తెలిపింది.
  • మొత్తంగా ఈ ఫీచర్​ యూజర్ సెర్చ్​ బాక్స్​లో టైప్​ చేసే వాటిల్లో అక్షరదోషాలను గుర్తించి సవరించడంలో సహాయపడుతుంది. కాగా, దీనిని త్వరలోనే అడ్రస్​ బార్​లో యాడ్​ చేయనున్నారు.
  • మీరు టైప్​ చేసే తప్పు పదాల కారణంగా కొన్ని సార్లు మీకు ఫేక్​​ వెబ్​సైట్​లు దర్శనమిస్తుంటాయి. వాటి జోలికి కూడా పోకుండా ఈ ఫీచర్​ నియంత్రిస్తుంది.
  • ఇవే కాకుండా గూగుల్​ మ్యాప్స్​లో Screen Reader Support For Lens In Maps అనే కొత్త ఫీచర్​ను కూడా గూగుల్​ త్వరలో ప్రవేశపెట్టనుంది. లైవ్ వ్యూ సెర్చ్ అని పిలిచే మ్యాప్స్‌లోని లెన్స్.. ఫోన్ స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న ఆసక్తికర అంశాలను మరింత క్షుణ్ణంగా చదవగలుగుతుంది. దృష్టిలోపం ఉన్నవారికి, నిరక్షరాస్యులకు ఈ ఫీచర్​ ఎంతగానో ఉపయోగపడనుందని కంపెనీ తెలిపింది. కాగా, ఈ ఫీచర్​ ఈ వారంలో iOS యూజర్స్​కు ఏడాది చివర్లో ఆండ్రాయిడ్​ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
  • ట్రాన్సిట్​ నావిగేషన్​లో తేనున్న మరిన్ని ఫీచర్లు మీరు ప్లాన్ చేసుకునే ట్రిప్స్​కు ఎంతో ఉపయోగపడతాయి.
  • అదనంగా Google తన పిక్సెల్ ఫోన్‌లు, ఇతర ఉత్పత్తులకు కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్‌లను కూడా జోడిస్తోంది. Pixel 5, నూతన వినియోగదారులు తమ కెమెరాలోని మ్యాగ్నిఫైయర్​ యాప్‌లో పలు మార్పులు చేస్తోంది. చిన్న వస్తువులను చూడటంలో ఇబ్బంది ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • మరో కొత్త ఫీచర్ గైడెడ్ ఫ్రేమ్(Guided Frame Feature). ఇది దృష్టిలోపం ఉన్న వినియోగదారులు మెరుగైన సెల్ఫీలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ గైడెడ్ ఫ్రేమ్ ప్రస్తుతం పిక్సెల్ 8, పిక్సెల్​ 8 ప్రోలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివర్లో పిక్సెల్ 6 సహా ఇతర డివైజుల్లోకి రానుంది.
  • చివరగా అసిస్టెంట్ రొటీన్స్ ఫీచర్‌(Assistant Routines Feature)ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది వినియోగదారులు జాబ్​ నుంచి ఇంటికి వచ్చినప్పుడు లైట్లను ఆన్ చేయడం, సంగీతాన్ని ప్లే చేయడం లాంటి స్మార్ట్ హోమ్ ఆటోమేషన్‌లను సెటప్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్​ను యాక్సెసిబిలిటీ ఫంక్షనాలిటీ సాయంతో ఆస్వాదించవచ్చు.

Top 10 WhatsApp Features : వాట్సాప్​ లాంఛ్​ చేసిన టాప్​ 10 ఫీచర్స్​​ ఇవే.. మీరు వాడుతున్నారా?

X New Subscription Fee : ట్విట్టర్​ యూజర్లకు షాక్​.. ఏం చేయాలన్నా డబ్బులు కట్టాల్సిందే.. ఎంతంటే?

SpyNote Malware : మొబైల్ యూజర్లకు అలర్ట్​.. నయా స్పైవేర్​తో డేటా చోరీ సహా.. మనీ లూటీ చేస్తున్న హ్యాకర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.