ETV Bharat / science-and-technology

రూ.999కే జియో​ 4జీ ఫోన్.. ఫీచర్స్​, ప్లాన్ వివరాలు ఇలా.. - 999 కే జియో ఫోన్

Jio Bharat phone launch : జియోభారత్​ V2 పేరుతో సరికొత్త 4జీ ఫీచర్ ఫోన్​ లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. రూ.999కే ఈ ఇంటర్నెట్ ఫోన్​ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

Jio Bharat phone launch
Jio Bharat phone launch
author img

By

Published : Jul 3, 2023, 7:05 PM IST

Updated : Jul 3, 2023, 7:31 PM IST

Jio Bharat phone launch : రూ.999కే అదిరే ఫీచర్లతో ఇంటర్నెట్​ ఎనేబుల్డ్ ఫోన్​ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది రిలయన్స్ జియో. జియోభారత్​ V2 4G ఫోన్​ పేరుతో కొత్త మొబైల్​ను మార్కెట్​లోకి విడుదల చేయనుంది. జులై 7 నుంచి 10 లక్షల జియోభారత్​ ఫోన్ల బీటా టెస్టింగ్​కు సన్నాహాలు చేసింది. మార్కెట్​లోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ ఫోన్ ఇదే కానుందని చెబుతోంది రిలయన్స్ జియో.

Jio Bharat Phone Price : ఇతర టెలికాం ఆపరేటర్లతో పోల్చితే జియోభారత్​ ప్లాన్స్​ కూడా చాలా తక్కువని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది రిలయన్స్ జియో. రూ.123కు 28 రోజుల వ్యాలిడిటీతో 14 జీబీ డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇతర ఆపరేటర్లు ఈ తరహా ఫోన్ల కోసం రూపొందించిన ప్లాన్(రూ.179కి 2 జీబీ డేటా)తో పోల్చితే తమ ప్లాన్​ ధర 30శాతం తక్కువని, 7 రెట్లు డేటా అధికంగా లభిస్తుందని వెల్లడించింది రిలయన్స్ జియో.

రూ.999కే జియో​ 4జీ ఫోన్

Jio Bharat​ V2 4G Phone features :

  • 1.77 అంగుళాల స్క్రీన్, 0.3మెగాపిక్సెల్ కెమెరా
  • ఎస్​డీ కార్డ్​తో 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం
  • హెచ్​డీ వాయిస్ కాలింగ్, లౌడ్ స్పీకర్
  • 1000mAh బ్యాటరీ
  • జియో సినిమా, జియో సావన్​తో వినోదం!
  • యూపీఐ పేమెంట్స్​ చేసేందుకు వీలుగా జియోపే
    jio bharat phone launch date
    జియో భారత్ ఫోన్

'2జీ ముక్త్ భారత్​' కలను సాకారం చేయాలన్న సంకల్పంతో ఈ జియోభారత్​ మొబైల్​ ఫోన్​ను తీసుకొస్తున్నట్లు ఓ ప్రకటన ద్వారా సోమవారం వెల్లడించింది రిలయన్స్. "భారత దేశంలో 25కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికీ 2జీ శకంలోనే ఉండిపోయారు. ప్రపంచం మొత్తం 5జీ విప్లవానికి సిద్ధమవుతుంటే వారు మాత్రం కనీసం ఇంటర్నెట్​కు కూడా నోచుకోవడం లేదు. ప్రజల జీవనోపాధి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు సాంకేతికత తప్పనిసరి. ఇంటర్నెట్​ను ప్రజలందరికీ చేరువ చేసి, సాంకేతికత ఫలాల్ని ప్రతి భారతీయుడికి చేరేలా చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టబోమని ఆరేళ్ల క్రితం జియోను లాంఛ్ చేసినప్పుడు మేము చెప్పాము. సాంకేతికత.. అతి కొద్ది మందికి మాత్రమే పరిమితం కారాదు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ.

Jio Bharat​ 4G Phone features

Last Updated : Jul 3, 2023, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.