ETV Bharat / science-and-technology

రెడ్​మీ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్.. కింద పడినా ఏమీ కాదట​! - రెడ్​మీ 10 ఇండియా మార్కెట్

రెడ్​మీ నుంచి సరికొత్త బడ్జెట్ స్మార్ట్​ఫోన్ విడుదలైంది. రెడ్​మీ 10 పేరుతో వచ్చిన ఈ స్మార్ట్​ఫోన్ బ్యాటరీ, డిజైన్, ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. మరి దీని ధర, డిస్కౌంట్ల గురించి మరిన్ని వివరాలు పూర్తి కథనంలో...

REDMI 10 SMART PHONE
REDMI 10 SMART PHONE
author img

By

Published : Mar 17, 2022, 12:43 PM IST

రెడ్​మీ సంస్థ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్ విడుదలైంది. 'రెడ్​మీ 10'ను సంస్థ భారత మార్కెట్​లో అందుబాటులోకి తెచ్చింది. భారీ బ్యాటరీతో ఈ స్మార్ట్​ఫోన్​ను రూపొందించింది రెడ్​మీ. ఫొన్ డిజైన్ సైతం ఆకట్టుకుంటోంది. పొరపాటున కిందపడినా స్మార్ట్​ఫోన్​కు ఏమీ కాదని సంస్థ చెప్పుకొచ్చింది.

ప్రత్యేకతలు

  • 6 నానోమీటర్ క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 680 చిప్​సెట్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
  • 6.71 అంగుళాల ఐపీఎస్ డిస్​ప్లే
  • డ్యూయల్ కెమెరా (50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్ సెన్సార్)
  • 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • 1.5 వాట్ లౌడ్ స్పీకర్లు

మూడు రంగుల్లో ఈ స్మార్ట్​ఫోన్ లభిస్తుంది. మిడ్​నైట్ బ్లాక్, పసిఫిక్ బ్లూ, కరీబియన్ గ్రీన్ కలర్లలో ఫోన్ అందుబాటులో ఉండనుంది.

REDMI 10 SMART PHONE
రెడ్​మీ 10

ధర ఎంతంటే?

రెడ్​మీ 10 4జీబీ, 64జీబీ వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించింది సంస్థ. 6జీబీ, 128జీబీ వేరియంట్ రూ.11,999కు లభించనుంది. మార్చి 24న ఈ రెండు వేరియంట్ల విక్రయాలు ప్రారంభమవుతాయి. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు కార్డులు వినియోగిస్తే రూ.1000 ఇన్​స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఇదీ చదవండి: యాపిల్ నయా అప్డేట్​.. మాస్క్ ధరించినా స్క్రీన్ అన్​లాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.